Kia Carens: భారత మార్కెట్‌లో ఫేమస్ అయినా MPVలలో ఒకటైన కియా క్యారెన్స్ (Kia Carens) ఇప్పుడు కొత్త CNG ఆప్షన్‌తో అందుబాటులోకి వచ్చింది. పెట్రోల్ వెర్షన్‌పై రూ.77,900 అదనంగా చెల్లిస్తే డీలర్ లెవెల్‌లో ఈ సిఎన్‌జి కిట్ అమర్చుకోవచ్చు. ఈ కిట్ లవాటో (Lovato) సంస్థ నుంచి అందించబడుతుంది. ఇది ప్రభుత్వ ఆమోదం పొందింది. దీనికి 3 సంవత్సరాలు లేదా 1 లక్ష కి.మీ వారంటీ కూడా లభిస్తుంది.
ధరలు (ఎక్స్-షోరూమ్, ఇండియా)
2025 కియా క్యారెన్స్ ప్రీమియం (O) పెట్రోల్ MT మార్కెట్ ధర రూ.10.99 లక్షలు గా ఉంది.
2025 కియా క్యారెన్స్ ప్రీమియం (O) పెట్రోల్ MT విత్ సిఎన్‌జి మార్కెట్ ధర రూ. 11.77 లక్షలు గా ఉంది.
Also Read: GHMC: అంతా మీ ఇష్టమా.. మా అనుమతులు తీసుకోరా.. జలమండలిపై జీహెచ్ఎంసీ గరం గరం
ఇంజిన్, మైలేజ్..
క్యారెన్స్‌లో రెండు ఇంజిన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి
1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ (115hp / 144Nm)
1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ (116hp / 250Nm)
రెండింటికీ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ అందుబాటులో ఉంది.
పెట్రోల్ వెర్షన్ మైలేజ్ – 16.5 kmpl
డీజిల్ వెర్షన్ మైలేజ్ – 21.5 kmpl
పనితీరు (పెర్ఫార్మెన్స్) క్యారెన్స్ కుటుంబ MPV అయినప్పటికీ, టర్బో ఇంజిన్‌లు థ్రిల్ ఇస్తాయి. 0-100 kmph యాక్సిలరేషన్: పెట్రోల్ NA – 12.5 సెకన్లు, టర్బో పెట్రోల్ – 9.5 సెకన్లు, డీజిల్ – 11 సెకన్లు. టాప్ స్పీడ్ 180 kmph వరకు ఉంటుంది .
NA పెట్రోల్: స్మూత్ సిటీ డ్రైవ్, లో-ఎండ్ టార్క్ మంచిది. కానీ హైవేలో ఓవర్‌టేక్‌లకు కొంచెం డల్.
టర్బో పెట్రోల్: 160hp పవర్‌తో స్పిరిటెడ్ పెర్ఫార్మెన్స్, DCT ట్రాన్స్‌మిషన్ షిఫ్ట్స్ క్విక్. యంగ్ ఫ్యామిలీస్‌కు పర్ఫెక్ట్ గా ఉంటుంది.
డీజిల్: 250Nm టార్క్‌తో లో-స్పీడ్ పుల్ బెస్ట్, లోడ్‌తో కూడా స్టెడీ. హైవే క్రూజింగ్‌లో ఎఫర్ట్‌లెస్.
CNG: పెట్రోల్ మోడ్‌లో సరిపడా పనితీరు, కానీ టార్క్ కొంచెం తగ్గుతుంది. ఎకనామికల్ ఆప్షన్.
Also Read: Jagan Padayatra 2.O: మళ్లీ పాదయాత్ర చేయబోతున్న వైఎస్ జగన్.. 2017-18 మాదిరిగా గేమ్ ఛేంజర్ అవుతుందా?
ఫీచర్లు
ప్రీమియం (O) వేరియంట్‌లాగే, క్యారెన్స్ CNG కూడా ఫీచర్ల పరంగా ఆకట్టుకుంటుంది.
18 ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్ ప్లే
వాయిస్ రికగ్నిషన్, 4-స్పీకర్ ఆడియో సిస్టమ్
రియర్ వ్యూ కెమెరా, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్
లెదర్-ఫాబ్రిక్ సీటింగ్, రియర్ డిస్క్ బ్రేక్స్
ESC, హిల్ స్టార్ట్ అసిస్ట్, హిల్ డిసెంట్ కంట్రోల్, TPMS
