Allu Arjun: ‘పుష్ప’ సిరీస్ చిత్రాలతో పాన్ ఇండియా స్టార్ స్థాయిని దాటి ప్రపంచవ్యాప్త గుర్తింపును సొంతం చేసుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun).. నేషనల్ అవార్డ్‌ని సైతం సాధించి, తన తదుపరి ప్రాజెక్ట్‌ల విషయంలో మరింత కేర్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన లైనప్‌కు సంబంధించి టాలీవుడ్‌లో నడుస్తున్న ప్రచారం ఆయన అభిమానులకు, సినీ ప్రేక్షకులకు మెంటలెక్కిస్తోంది అనే చెప్పాలి. ఈ లైనప్ గనుక నిజమైతే, ఇక అల్లు అర్జున్ (Allu Arjun)కు భారతీయ సినీ చరిత్రలో తిరుగులేదని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.
Also Read- Hesham Abdul Wahab: ‘ది గర్ల్ ఫ్రెండ్’ చిత్రానికి నాకు స్ఫూర్తినిచ్చిన అంశమదే!
భారీ దర్శకులతో బన్నీ సినిమాలు.. ఇక తగ్గేదే లే!
ప్రస్తుతం అల్లు అర్జున్ తమిళంలో స్టార్ డైరెక్టర్ అయినటువంటి అట్లీతో పాన్ వరల్డ్ సినిమా (AA22xA6) చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ముంబైలో శరవేగంగా జరుగుతోంది. ఇందులో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు, విజువల్ ఎఫెక్ట్స్‌కు భారీ ప్రాధాన్యత ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత ఐకాన్ స్టార్ ఎవరితో చేయబోతున్నారనే దానిపైనే ప్రస్తుతం బీభత్సమైన చర్చ నడుస్తోంది. ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఆయన తదుపరి సినిమాలు భారతదేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన దర్శకులతో ఉండబోతున్నాయని తెలుస్తోంది.
జక్కన్న (రాజమౌళి): ‘బాహుబలి, RRR’ వంటి చిత్రాలతో భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిన దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli)తో అల్లు అర్జున్ సినిమా ఉంటుందనే ప్రచారం ఊపందుకుంది. ఈ కాంబో కనుక సెట్ అయితే, అది బాక్సాఫీస్ వద్ద చరిత్ర తిరగరాయడం ఖాయం.
ప్రశాంత్ నీల్: ‘KGF, సలార్’ వంటి మాస్ యాక్షన్ బ్లాక్‌బస్టర్‌లను అందించిన ప్రశాంత్ నీల్ (Prasanth Neel)తో అల్లు అర్జున్ ‘రావణం’ అనే సినిమా చేయబోతున్నట్లు ప్రముఖ నిర్మాత దిల్ రాజు సైతం కన్ఫర్మ్ చేశారు. ఇది నీల్ డ్రీమ్ ప్రాజెక్ట్ అని, ‘KGF’ తరహాలోనే పవర్‌ఫుల్, డార్క్ యాక్షన్ డ్రామాగా ఉంటుందని తెలుస్తోంది.
సందీప్ రెడ్డి వంగా: ‘అర్జున్ రెడ్డి, యానిమల్’ వంటి చిత్రాలతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga)తో కూడా అల్లు అర్జున్ సినిమా ఉంటుందని గతంలోనే అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం ఊహించని యాక్షన్ డ్రామాగా ఉంటుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Also Read- Chinmayi Sripada: మంగళసూత్రం కాంట్రవర్సీ.. ట్రోలర్స్‌పై చిన్మయి ఫిర్యాదు
భన్సాలీ, బోయపాటి, కొరటాల పేర్లు కూడా..
ఈ భారీ దర్శకులతో పాటు, బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీతో కూడా బన్నీ సినిమా చేయనున్నారనే టాక్ నడుస్తోంది. అలాగే, మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన బోయపాటి శ్రీను, కొరటాల శివ పేర్లు కూడా ఈ లైనప్‌లో వినిపిస్తుండడం విశేషం. ఇంకా ‘పుష్ప 3’ గురించి కూడా చర్చలు నడుస్తున్నాయి. నిజంగా ఈ దర్శకులతో వరుసగా సినిమాలు గనుక సెట్ అయితే, అల్లు అర్జున్ పాన్ ఇండియాకు పర్యాయపదంగా మారిపోవడం ఖాయమని, ఆయన అభిమానులు ‘ఇక తగ్గే దే లే.. టిఎఫ్ఐ (టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ) మాదే’ అంటూ సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటున్నారు. ఒక నటుడికి ఇంత పవర్ ప్యాక్డ్ లైనప్ ఉండటం అరుదైన విషయమనే చెప్పుకోవాలి. వీళ్లందరితో సినిమాలు చేసినా, చేయకపోయినా.. ఇందులో కనీసం ముగ్గురితో అయినా అల్లు అర్జున్ సినిమాలు చేసే అవకాశం ఉంది కాబట్టి.. ఎలా చూసినా.. అల్లు అర్జున్‌కి ఇక తిరుగులేదని చెప్పుకోవాలి. చూద్దాం.. మరి ఈ దర్శకులతో ఆయన సినిమాలు చేస్తారా? లేదా? అనేది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
