Chinmayi Sripada (Image Source: X)
ఎంటర్‌టైన్మెంట్

Chinmayi Sripada: మంగ‌ళ‌సూత్రం కాంట్రవర్సీ.. ట్రోలర్స్‌పై చిన్మ‌యి ఫిర్యాదు

Chinmayi Sripada: సోషల్ మీడియా‌లో వస్తున్న అబ్యూస్ కంటెంట్, తనపై కొందరు కావాలని చేస్తున్న అసభ్యకరమైన పదజాలంపై సింగర్ చిన్మయి (Chinmayi Sripada) ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ట్విట్టర్ స్పేస్‌లో మహిళలను కించపరుస్తూ బూతులు తిట్టడాన్ని చిన్మయి ఖండించారు. ‘‘ట్విట్టర్ స్పేస్‌లు పెట్టి.. పబ్లిగ్గా మహిళలపై వారు మాట్లాడుతున్న భాష చాలా దారుణంగా ఉందని, ఇలాంటి వాళ్లు మీ స్నేహితుల్లో ఉన్నా ప్రోత్సహించవద్దని చిన్మయి కోరింది. మహిళలు రోజూ అవమానాలతో విసిగిపోతున్నారు, వారికి మరింత గౌరవం దక్కాలని.. నేను పోరాడుతుంటే.. నా పిల్లలు చనిపోవాలని వాళ్లంతా కోరుకుంటున్నారు. మహిళలను దాటి పిల్లలను కూడా అబ్యూస్ చేసే స్థాయికి వెళ్లిపోయారు. దీనిపై నేను పోరాడతాను.. సజ్జనార్ (CP Sajjanar) సార్.. నాకు ఈ విషయంలో సహాయం చేయండి’’ అంటూ చిన్నయి విడుదల చేసిన వీడియో ఒకటి సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది.

Also Read- Bigg Boss Telugu 9: సీక్రెట్ రెబల్.. హౌస్‌లో అసలు సిసలు బిగ్ బాస్ ఆట మొదలైంది

మెడలో తాళి ఎందుకు వేసుకోరు

చిన్మయి ఇప్పుడే కాదు.. సోషల్ మీడియాలో తన దృష్టికి వచ్చిన లైంగిక వేధింపుల గురించి ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటుంది. అలాగే ఇటీవల వైరముత్తు, కార్తీక్, జానీ మాస్టర్‌లకు మళ్లీ ఎందుకు అవకాశాలు ఇస్తున్నారు. వాళ్లంతా మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించినా, ఇంకా వారికి అవకాశాలు ఇస్తూ సపోర్ట్ చేస్తున్నారని పబ్లిగ్గా పోస్ట్ చేశారు. ఇక తన భర్త రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran) డైరెక్ట్ చేసిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ (The Girlfriend) చిత్ర ప్రమోషన్స్‌లో.. చిన్మయి తన మెడలో తాళి ఎందుకు వేసుకోరు? అనే ప్రశ్నని మీడియా సంధించింది. దీనికి ఆయన వివరణ కూడా ఇచ్చారు. ‘నా భార్య తాళి వేసుకోదు.. పెళ్లి అయినట్లుగా మగవారికి లేని గుర్తింపు, గుర్తులు ఆడవారికి మాత్రం ఎందుకు ఉండాలి? అందుకే.. నేను ఆమెను తాళి ధరించవద్దని చెప్పాను’ అని రాహుల్ సమాధానం ఇచ్చారు. దీంతో, చిన్నయి తాళి గురించి, హిందూ సంప్రదాయాల గురించి, ఇంకా ఆమెకు సంబంధించిన ఇతరత్రా విషయాల గురించి సోషల్ మీడియాలో డిస్కషన్ మొదలైంది. ఇది క్రమక్రమంగా ట్రోలింగ్‌గా మారడంతో.. తనని ట్రోల్ చేసే వారందరిపై చిన్మయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పనిలో పనిగా సజ్జనార్‌ని కూడా ఆమె సాయం కోరింది. దీనికి ఆయన కూడా రెస్పాండ్ అయ్యారు. ఈ విషయాన్ని పరిశీలిస్తానని ఆమెకు హామీ ఇచ్చారు.

Also Read- Tollywood: ప్రచారంలో అలా మాట్లాడటం ఎందుకు? ఆ తర్వాత ఫూల్స్ అవడమెందుకు?

పిల్లల్ని కూడా ఈ రొచ్చులోకి..

సోషల్ మీడియాలో తనని వేధిస్తున్న వారందరి లిస్ట్ తీసిన చిన్మయి.. వెంటనే పోలీసులను ఆశ్రయించారు. అసభ్యకరమైన మెసేజ్‌లతో విసిగిపోయాను, ఇక్కడ రాయడానికి వీలులేని పదాలతో నాపై దాడి చేస్తున్నారని చిన్మయి తన ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాదు, తన పిల్లలను కూడా ఈ రొచ్చులోకి లాగుతున్నారని, నా పిల్లలు చనిపోవాలని కోరుకుంటున్నారని కూడా చిన్మయి తెలిపింది. ఇలా వేధింపులకు గురి చేస్తున్న వారికి శిక్ష పడే వరకు తన పోరాటం ఆగదని, అప్పటి వరకు పోరాటం చేస్తూనే ఉంటానని చిన్మయి ఫిర్యాదులో పేర్కొంటూ.. సీపీ సజ్జనార్‌కు కూడా ఆమె కంప్లయింట్ చేశారు. ఈ విషయంలో కొందరు నెటిజన్లు చిన్మయి‌కి సపోర్ట్‌గా నిలుస్తున్నారు. మరోవైపు ట్విట్టర్ స్పేస్‌లో ఆమె మాట్లాడిన తీరును బయటపెడుతూ.. ‘ఇలా మాట్లాడి రెచ్చగొడుతూ.. మళ్లీ కేసులు పెట్టడం ఎంత వరకు సమంజసమో.. మీరు గమనించాలి సజ్జనార్ సార్’ అంటూ కొందరు నెటిజన్లు ఆమెపై నెట్‌లో కంప్లయింట్ ఇస్తున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Konda Reddy Arrest Case: వైసీపీ విద్యార్థి నేత అరెస్టుపై ప్రభుత్వానికి కీలక ప్రశ్నలు సంధించిన గుడివాడ అమర్నాథ్

Rashmika Mandanna: నన్ను కలవాలంటే ‘రౌడీ జిమ్’కు వచ్చేయండి.. నేనే ట్రైన్ చేస్తా!

Etela Rajender: ముఖ్యమంత్రులేం ఓనర్లు కాదు.. ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Swetcha Effect: స్వేచ్ఛ ఎఫెక్ట్‌తో కదిలిన విద్యాశాఖ.. ఎమ్మెల్యే పీఏగా పనిచేస్తున్న ఇంగ్లిష్ టీచర్‌పై విచారణ షురూ

Chinmayi Sripada: మంగ‌ళ‌సూత్రం కాంట్రవర్సీ.. ట్రోలర్స్‌పై చిన్మ‌యి ఫిర్యాదు