Hesham Abdul Wahab: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna), టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా ‘ది గర్ల్ ఫ్రెండ్’ (The Girlfriend). అల్లు అరవింద్ (Allu Aravind) సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran) దర్శకత్వంలో ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించిన ఈ సినిమా.. సరికొత్త ప్రేమ కథగా ఈ నెల 7న తెలుగు, హిందీలో, 14న తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ (Hesham Abdul Wahab).. మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ..
Also Read- Rashmika Mandanna: నన్ను కలవాలంటే ‘రౌడీ జిమ్’కు వచ్చేయండి.. నేనే ట్రైన్ చేస్తా!
ఇంటెన్సిటీ ఎక్కువగా ఉన్న చిత్రమిది
‘‘నేను మొట్టమొదట తెలుగులో ఓకే చేసిన చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’. ఈ సినిమా తర్వాతే ‘ఖుషి, హాయ్ నాన్న’ సినిమాలు ఓకే చేశాను. ఇవన్నీ ప్రేమ కథా చిత్రాలే. వీటన్నింటిలో ‘ది గర్ల్ ఫ్రెండ్’ కథలో ఇంటెన్సిటీ ఎక్కువగా ఉంటుంది. వరుసగా ప్రేమ కథా చిత్రాలకు సంగీతం అందించిన నాకు, ఇప్పుడు వేరే జానర్ మూవీస్ చేసే అవకాశం వస్తుంది. ఈ సినిమా విడుదల చాలా ఆలస్యమైంది. నేను ఫస్ట్ ఈ సినిమాకే బీజీఎం స్టార్ట్ చేశా. కానీ, కొన్ని కారణాలతో మూవీ ఆలస్యమవుతూ వచ్చింది. ఆ టైమ్‌లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌కు ప్రశాంత్ విహారిని తీసుకున్నారు. ప్రశాంత్ ఈ సినిమాకు పని చేసినందుకు చాలా హ్యాపీగా ఫీలయ్యా. అతను చాలా మంచి బీజీఎం ఇచ్చాడు. నేను అనుకున్న ఫీల్ అతని బీజీఎంలో కూడా నాకు కనిపించింది. ఇందులో మొత్తం నాలుగు సాంగ్స్ ఉంటాయి. వాటిలో నాలుగో పాట ‘నీదే నీదే’ పాటను రీసెంట్‌గానే రిలీజ్ చేశాం. ఈ పాట కంపోజింగ్ కోసం చాలా కష్టపడ్డాను. అమ్మాయిల యాంథమ్‌గా ఈ పాట ఉండాలని నాకు రాహుల్ సూచించారు.
Also Read- Vishwak Sen Funky: విశ్వక్ నవ్వుల తుఫాను ‘ఫంకీ’ రిలీజ్ డేట్ ఖరారు.. ఎప్పుడంటే?
ఈ సినిమా క్రెడిట్ అంతా ఆయనకే..
ఈ సినిమాలో విక్రమ్, భూమా పాత్రల మధ్య ఉండే సంఘర్షణే.. నేను ఈ సినిమాకు మంచి పాటలు కంపోజ్ చేసేందుకు స్ఫూర్తినిచ్చింది. ఇది ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా అని నేను భావిస్తున్నాను. నేను కూడా ఈ సినిమా చూసిన తర్వాత ఆలోచనలో పడ్డాను. మీరంతా మూవీ చూసి అప్రిషియేట్ చేస్తారనే నమ్ముతున్నాను. ఈ సినిమా క్రెడిట్ అంతా డైరెక్టర్ రాహుల్‌కే దక్కుతుంది. ఈ చిత్రంలోని పాటలన్నీ కథలో సరైన సందర్భంలో వచ్చేలా తను డిజైన్ చేసుకున్నాడు. ఒక మంచి పాటను కంపోజ్ చేసేందుకు ప్రతి సమయం సరైనదే. నేను కంపోజింగ్‌కు ప్రత్యేకంగా ఒక సమయం పెట్టుకోను. నాకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్. ఆయన ‘దిల్ సే’ సినిమా పాటలను నేను చదువుకునే సమయంలో పాడేవాడిని. ఐఫా వేడుకల్లో ఆయన సమక్షంలో నేను కంపోజ్ చేసిన ‘హాయ్ నాన్న’ సినిమాలోని పాటలు పాడటం మర్చిపోలేని సందర్భం. తెలుగులో కీరవాణి, థమన్, దేవిశ్రీ ప్రసాద్, భీమ్స్.. వీళ్ల మ్యూజిక్ కూడా నాకు చాలా ఇష్టం. తెలుగు సినిమా పరిశ్రమలో పని చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. నాకు ఇక్కడ ఒకదాని తర్వాత మరొకటిగా సినిమా అవకాశాలు వస్తునే ఉన్నాయి. ప్రస్తుతం తెలుగులో ఆనంద్ దేవరకొండ సినిమాకు మ్యూజిక్ చేస్తున్నాను. త్వరలోనే నా ఫస్ట్ బాలీవుడ్ మూవీని ప్రకటిస్తాను’’ అని చెప్పుకొచ్చారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
