Ashika Ranganadh Gets Another Crazy Offer
Cinema

Ashika Ranganath:సక్సెస్ కొట్టినా సంకోచమేలనో?

Ashika Ranganath not having any new projects in her hand:

ఇప్పటి హీరోయిన్లు ఒకప్పటిలా ఏ సినిమా పడితే దాన్ని ఒప్పుకోవడం లేదు. లాంగ్ స్టాండింగ్ కెరీర్ కావాలని అనుకున్నప్పుడుహడావిడి నిర్ణయాలు తీసుకోవడం వలన నష్టమే తప్ప లాభం లేదని నమ్ముతున్నారు. . సినిమాల విషయంలో ఆచి తూచి అడుగులేయడం మంచిదే కానీ సక్సెస్ వచ్చాక ఇంకాస్త జోరు కొనసాగించే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా నచ్చిన కథే రావాలి అది కూడా మరో సూపర్ హిట్ అవ్వాలని చూస్తూ ఉంటే పుణ్యకాలం కాస్త కరిగిపోతుంది. ప్రస్తుతం ఒక హీరోయిన్ చేస్తున్న పని దాదాపు అదేలా ఉంది. 2016 లోనే కన్నడ లో హీరోయిన్ గా పరిచయమైంది ఆషిక రంగనాథ్. అప్పటి నుంచి అక్కడ వరుస సినిమాలు చేస్తూ అలరిస్తుంది. కన్నడలో దాదాపు 15 సినిమాల దాకా చేసిన అమ్మడు తెలుగులో ఒకటి తమిళంలో ఒక సినిమా చేసింది.

తెలుగులో కళ్యాణ్ రామ్ తో అమిగోస్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అమ్మడు ఆ తర్వాత కింగ్ నాగార్జున తో కలిసి నా సామిరంగ సినిమాలో నటించింది. ఆ సినిమాలో ఆషిక లుక్స్, యాక్టింగ్ తెలుగు ఆడియన్స్ ని మెప్పించాయి. నా సామిరంగ లాంటి సూపర్ హిట్ కొట్టాక వెంటనే అమ్మడు ఒక రేంజ్ లో దూసుకెళ్తుందని అనుకోగా ఒక్కటంటే ఒక్క సినిమా కూడా రాలేదు. ఐతే వచ్చిన ప్రతి సినిమాకు అది బాలేదు ఇది బాలేదని చెప్పి పంపిస్తే ఇంక సినిమాలు ఎక్కడ నుంచి వస్తాయని అంటున్నారు కొందరు. నా సామిరంగ హిట్ ని క్యాష్ చేసుకోవడం లో ఆషిక వెనకపడ్డదని చెప్పొచ్చు. ఆ సినిమా వచ్చి ఏడు నెలలు అవుతున్నా నెక్స్ట్ సినిమా అప్డేట్ ఇవ్వలేదు. ఐతే మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర లో ఒక హీరోయిన్ గా ఛాన్స్ అందుకున్న ఆషిక ఆ పాత్రతో సినిమాకు హెల్ప్ అవుతుందేమో కానీ అమ్మడి కెరీర్ కి అంత ప్రోత్సాహం అందే అవకాశం లేదు

. సోలో సినిమాలకు అమ్మడు చాలా కండీషన్స్ పెడుతుందని తెలుస్తుంది. మరి ఆషిక ప్లాన్ ఏంటన్నది తెలియట్లేదు కానీ ఆమె సినిమా చేస్తే చూడాలని అనుకుంటున్న ఆడియన్స్ ని కూడా అమ్మడు నిరుత్సాహపరుస్తుంది. సక్సెస్ అందుకున్నా సరే సరైన నిర్ణయం తీసుకోక ఆషిక చేజేతులారా కెరీర్ పాడు చేసుకుంటుందని చెప్పొచ్చు. మరి అమ్మడు ఈ వెయిటింగ్ ఎందుకోసమో తనకైనా క్లారిటీ ఉందో లేదో తెలియాల్సి ఉంది.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!