Donald Trump (Image Source: Twitter)
అంతర్జాతీయం

Donald Trump: ఓరి బాబోయ్ మళ్లీ గెలికేసిన ట్రంప్.. భారత్ – పాక్ ఉద్రిక్తతలపై కీలక వ్యాఖ్యలు

Donald Trump: భారత్ – పాక్ మధ్య ఇటీవల తలెత్తిన ఉద్రిక్తతలకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ మళ్లీ పాత పాటే పాడారు. ఆ రెండు దేశాల మధ్య శాంతి స్థాపనలో తాను కీలక పోత్ర పోషించినట్లు స్వయంగా ప్రకటించుకున్నారు. మయామీలో జరిగిన బిజినెన్ ఫోరంలో ట్రంప్ మాట్లాడుతూ.. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ సమయంలో దయాది దేశాల మధ్య తలెత్తిన ఘర్షణలను ప్రస్తావించారు. వాణిజ్య ఒప్పందాలను రద్దు చేస్తానని హెచ్చరించి.. మే నెలలో ఆ రెండు అణ్వాయుధ దేశాల మధ్య శాంతిని చేకూర్చినట్లు పేర్కొన్నారు.

రెండు దేశాలను హెచ్చరించా: ట్రంప్

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకూ 8 యుద్ధాలను తాను ఆపినట్లు ట్రంప్ మరోమారు ప్రకటించారు. భారత్ – పాక్ ఘర్షణతో పాటు కోసోవో-సెర్బియా, కాంగో- రువాండా దేశాల ఉద్రిక్తలను సైతం తాను చల్లార్చినట్లు ట్రంప్ వ్యాఖ్యానించారు. ‘భారత్, పాకిస్తాన్‌లతో వాణిజ్య ఒప్పందం చర్చల దశలో ఉండగా రెండు దేశాలు యుద్ధానికి సిద్ధమవుతున్నట్లు ఓ పత్రిక పతాక శీర్షికలో చూశాను. 7 విమానాలు కూలిపోయాయని ఎనిమిదోది తీవ్రంగా దెబ్బతిన్నదని విన్నాను. అప్పుడు దీనిని నేను యుద్ధంగా భావించాను. భారత్, పాక్ అణ్వాయుధ దేశాలు కావడంతో మీరు శాంతికి అంగీకరించకపోతే మీతో వాణిజ్య ఒప్పందం చేసుకోనని తెగేసి చెప్పాను’ అని ట్రంప్ వివరించారు.

‘తొలుత వ్యతిరేకించి.. దారికొచ్చాయ్’

అమెరికాతో వాణిజ్య ఒప్పందానికి తమ దేశాల మధ్య ఉద్రిక్తతలకు సంబంధం లేదని దిల్లీ, ఇస్లామాబాద్ వ్యతిరేకించినట్లు ట్రంప్ పేర్కొన్నారు. అయితే రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు.. వాణిజ్య ఒప్పందానికి సంబంధం ఉందని తాను తెగేసి చెప్పినట్లు వెల్లడించారు. ‘ఇది చెప్పిన తర్వాతి రోజు నాకు ఫోన్ వచ్చింది. రెండు దేశాలు శాంతి చేసుకున్నాయని చెప్పారు. అప్పుడు నేను ధన్యవాదాలు చెప్పి వాణిజ్యం చేద్దాం అని అన్నాను. చూడండి ఇది ఎంత బాగుందో కదా?. టారిఫ్‌లు లేకపోతే ఇది జరిగేది కాదు’ అని ట్రంప్ వ్యాఖ్యానించగా బిజినెస్ ఫోరం సభలో చప్పట్లు మారుమోగాయి.

Also Read: KCR: జూబ్లీహిల్స్‌లో కేసీఆర్ ప్రచారం పై వీడని సస్పెన్స్.. ఉత్కంఠ రేపుతున్న సారు తీరు

ట్రంప్ మాటల్లో వాస్తవం లేదు: భారత్

పాక్ తో యుద్ధాన్ని తానే ఆపానంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను భారత్ పలుమార్లు ఖండించింది. కాల్పులు ఆపాలని మే 10న పాక్ కమాండర్లు స్వయంగా వేడుకున్న తర్వాతే ఆపరేషన్ సిందూర్ ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు భారత అధికారులు తెలిపారు. అయితే భారత్ ఈ విషయాన్ని చాలాసార్లు స్పష్టం చేసినప్పటికీ ట్రంప్ మాత్రం తానే యుద్ధాన్ని ఆపినట్లు ప్రగల్భాలు పలుకుతున్నారు. మే నుండి ఇప్పటివరకు కనీసం 60 సార్లు భారత్ – పాక్ మధ్య తానే శాంతి కుదిర్చినట్లు ట్రంప్ చెప్పుకున్నట్లు నివేదికలు తెలిపాయి. కాగా పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా మే 7న భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు. అంతకుముందు పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయక భారత పౌరులు ప్రాణాలు కోల్పోయారు.

Also Read: Mithra Mandali OTT: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన మిత్రమండలి.. నెల కాకముందే..

Just In

01

Memory Improvement: ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెంచే అద్భుతమైన హెల్త్ టిప్స్

Hydraa: నాటి నిందలే నేటి ఫలితాలు.. హైడ్రాకు జనం నీరాజనాలు

Bigg Boss Telugu: చిచ్చుపెట్టిన బిగ్ బాస్.. ఇమ్మూ, రీతూ మధ్య భారీ ఫైట్.. గొడవతో దద్దరిల్లిన హౌస్!

Air Purifier: రూ.20,000 లోపు బెస్ట్ ఎయిర్ ప్యూరిఫయర్లు.. కొనుగోలు చేసేముందు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలివే!

Heroes turned villains: టాలీవుడ్‌లో హీరోలుగా పరిచయమై విలన్లుగా మారిన నటులు ఎవరో తెలుసా..