Chilli Market: రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆత్మ గౌరవంతో పంటలు అమ్ముకునేలా మార్కెట్ నిర్మాణం చేస్తున్న రేవంత్‌రెడ్డి(Revanth Reddy) నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్రలో నిలువనుందని ఇక్కడి రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం మిర్చి మార్కెట్‌ను తెలంగాణకే తలమానికంగా మోడల్ మార్కెట్ గా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం 80 వేల మిర్చి బస్తాల సామర్థ్యం నుంచి 2 లక్షల బస్తాల సామర్థ్యం తో నిర్మాణం పూర్తిచేస్తున్నారు.
155 కోట్లతో ఆధునిక వసతులతో..
1937 లో ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ప్రారంభం కాగా.. 1967 లో ప్రత్యేక మిర్చి మార్కెట్ ఏర్పాటైంది. 2017 లో పోటెత్తిన మిర్చి బస్తాలతో స్థలం లేక రైతులు మార్కెట్ ను ధ్వంసం చేశారు. ఇక ఖమ్మం మిర్చి నూతన మార్కెట్ వ్యవసాయ మార్కెట్ ల చరిత్రలో యావత్ తెలంగాణకే మోడల్ మార్కెట్ గా మారబోతోంది. 155 కోట్లతో ఆధునిక వసతులతో మిర్చి మార్కెట్ నిర్మాణం కోసం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala Nageswara Rao) పట్టుదలతో ఈ ఏడాది ఫిబ్రవరి 26 న పనులు ప్రారంభించారు. నిర్మాణ రంగంలో ప్రతిష్టాత్మకమైన ఏజిలిటీ అండ్ భూమి ఇన్ ఫ్రా కంపెనీ వారు నిర్మాణం చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మిర్చి పంట అనగానే గుర్తొచేది గుంటూరు తర్వాత ఖమ్మం(Khammam) మార్కెట్. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ చరిత్ర చూస్తే 1937 లో ప్రారంభం అయింది. అన్ని రకాల పంటల ఉత్పత్తులు క్రయ విక్రయాలు సాగేవి. కాల క్రమంలో 1967 లో మిర్చి మార్కెట్ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మిర్చి సాగు పెరిగి మార్కెట్ కు బస్తాలు పోటెత్తేవి 2017 మార్కెట్ సామర్థ్యం 80 వేల బస్తాలు ఉంటే లక్ష కు పైగా మిర్చి బస్తాలు అమ్మకానికి రాగా మార్కెట్ లో గందరగోళం నెలకొంది. పోటెత్తిన మిర్చితో కొనుగోళ్లు సకాలంలో జరగక రైతులు కోపోద్రిక్తులుగా మారి మార్కెట్ ధ్వంసం చేశారు.
Also Read: Plastic Containers: ప్లాస్టిక్ కంటైనర్లలో ఫుడ్ వేడి చేస్తున్నారా? డాక్టర్స్ ఏం చెబుతున్నారంటే?
నూతన మిర్చి మార్కెట్‌లో ఆధునిక సౌకర్యాలు..
15 ఎకరాల స్థలంలో ట్రాన్సాక్షన్ షెడ్లు 6 నిర్మాణం చేస్తున్నారు. ప్రీ ఇంజినీరింగ్ బిల్డింగ్ టెక్నాలజీతో నిర్మాణం చేస్తున్నారు. రెండు అంతస్తులతో నిర్మాణం చేసే మెజనైన్ ఫ్లోర్ ప్రత్యేకత చూస్తే గ్రౌండ్ ఫ్లోర్ లో మిర్చి విక్రయాలు ఫస్ట్ ఫ్లోర్ లో రైతు విశ్రాంతి భవనం దడవాయి మీటింగ్ హాల్, ట్రేడర్స్ అండ్ కమీషన్ ఏజెంట్స్ మీటింగ్ హాల్స్ ఏర్పాటుకు నిర్మాణ ప్లాన్ చేశారు. అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ మూడు అంతస్తులతో నిర్మాణం చేస్తున్నారు. ఒక్కో షెడ్ 121 మీటర్లు పొడవు 27 మీటర్ల వెడల్పు తో నిర్మాణం చేస్తున్నారు. రానున్న రోజుల్లో షెడ్స్ పై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు కు మంత్రి తుమ్మల రూపకల్పన చేసారు. ఖమ్మం నూతన మిర్చి మార్కెట్ లో రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించారు. ఖమ్మం మిర్చి మార్కెట్ లో రైతుల అవస్థలకు శాశ్వతంగా పరిష్కారం చూపాలని ఆదర్శ రైతు కూడా అయిన తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో ఉండటం ఇక్కడి రైతులకు వరంగా మారింది. ఖమ్మం లో నూతన మిర్చి మార్కెట్ నిర్మాణం చేపట్టి యావత్ తెలంగాణలోని మార్కెట్ లకు మోడల్ గా ఉండేలా మంత్రి తుమ్మల స్వయంగా రూపకల్పన చేశారు. ఇంజనీరింగ్ నిపుణులతో చర్చించి రైతు సంఘాలు ట్రేడర్లతో చర్చించి మోడల్ మార్కెట్ ప్లాన్ రూపకల్పన చేసారు.
రైతులు ఆత్మ గౌరవంతో..
ఆరుగాలం రెక్కల కష్టం చేసే రైతులు విత్తు నాటిన నుంచి మొక్క ను కన్నబిడ్డలా సాకి పైరు కు చీడ పీడలు లేకుండా రైతులు తమ కలల పంట సాగు చేస్తే, తీరా చేతికందే నాటికి అకాల వర్షాలు రైతన్న కష్టం నీటి పాలు చేసే దుస్థితి. చేతికందిన మిర్చి మార్కెట్ లో అమ్మడానికి వస్తే మిర్చి బస్తాలు పెట్టే సౌకర్యం లేక రైతులు కాలకృత్యాలు తీర్చుకోవాలని చూస్తే సరైన వసతులు లేక, ఎండలో వానలో తమ రెక్కల కష్టం అమ్ముకోవడం పురిటి నొప్పులుగా మారాయి. అదంతా గతం ఇక మీదట రైతులు తమ మిర్చి పంట అమ్ముకోవడం కోసం వస్తే వారి మిర్చి బస్తాలు దింపడానికి సరైన వసతులు , వారు తమ కష్టాలు మర్చిపోయేలా చక్కని విశ్రాంతి భవనం నిర్మాణం. మూడు టాయిలెట్ బ్లాక్స్ 4 ఆర్వో వాటర్ ప్లాంట్స్ నిర్మాణం చేస్తున్నారు. రైతులు టిఫిన్స్ భోజనాలు చేసేలా హైజీనిక్ గా ప్లాన్ చేశారు. రైతులు ఖమ్మం మిర్చి మార్కెట్ కు వచ్చి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా తమ పంట అమ్ముకునేలా నూతన మిర్చి మార్కెట్ కు రూపకల్పన చేసారు. ప్రస్తుతం ఉన్న 80 వేల బస్తాలు సామర్థ్యం నుంచి రెండు లక్షల బస్తాలు సామర్థ్యంతో నూతన మార్కెట్ నిర్మాణం చేస్తున్నారు. నూతన మిర్చి మార్కెట్ నిర్మాణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లపై రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నారు.
