MD Ashok Reddy: జలమండలి పరిధిలో త్వరలో వాటర్ ఆడిట్ ను ప్రారంభించి, ప్రతి రిజర్వాయర్ నుంచి సరఫరా చేస్తున్న ప్రతి చుక్క నీటిని లెక్క కట్టేలా ఫ్లో మీటర్ ను అమర్చి, చివరి వినియోగదారుని వద్ద కూడా మీటర్ రీడింగ్ సరిపోయేలా లెక్క కట్టి ట్రాన్స్ మిషన్ లాస్ తేలుస్తామని జలమడలి ఎండీ అశోక్ రెడ్డి(MD Ashok Reddy) అన్నారు. దాని ద్వారా వృథాగా పోతున్న నీటిని గుర్తించి దాన్ని అరికట్టడానికి చర్యలు తీసుకునే వెసులుబాటు కల్గుతుందని ఎండీ వివరించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కలుషిత నీరు సరఫరా అవుతున్నట్లు వచ్చే ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ వెంటనే పరిష్కరించాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
వీలైనంత త్వరగా పరిష్కరించాలని..
మంగళవారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో ఈడీ మయాంక్ మిట్టల్ లతో కలిసి ఓ అండ్ ఎం, రెవెన్యూ, ఎంసీసీ, సింగిల్ విండో, ఏఏంఎస్ తదితర అంశాలపైన సీజీఎంలు, జీఎం, డీజీఎం, మేనేజర్ లతో ఎండీ సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంసీసీకి వచ్చే ఫిర్యాదులను వీలైనంత త్వరగా పరిష్కరించాలని సూచించారు. ముఖ్యంగా కలుషిత నీరు, సీవరేజి ఓవర్ ఫ్లో, మిస్సింగ్ మ్యాన్ హోళ్లపై వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యతనివ్వాలని ఆదేశించారు. ఆఫ్ లైన్ ఫిర్యాదులను సైతం ఎంసీసీ పరిధిలో నమోదు చేసి పరిష్కరించాలన్నారు. తద్వారా మొత్తం ఫిర్యాదులను అధ్యయనం చేసేందుకు వీలు కల్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
Also Read: Kavitha: పత్తి తేమ శాతం సడలింపు ఇవ్వాలి.. కేంద్రానికి కవిత లేఖ!
కొత్త కనెక్షన్ల మంజూరులో..
అలాగే, కొత్త కనెక్షన్ల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వెంటనే మంజూరు చేసే దిశగా చర్యలను వేగవంతం చేయాలన్నారు. కొత్త కనెక్షన్ల మంజూరులో విషయంలో అలసత్వం వహిస్తే శాఖ పరమైన చర్యలు తప్పవని ఎండీ హెచ్చరించారు. మంచినీటి సరఫరాలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారుల దృష్టి సారించాలని సూచించారు. వీటితో పాటు ఎయిర్ టెక్, సిల్ట్ కార్టింగ్ వాహనాల వినియోగంపై సమీక్షించారు. ఈ సమావేశంలో జలమండలి ఆపరేషన్ డైరెక్టర్లు టీవీ శ్రీధర్, వినోద్ భార్గవ సీజీఎంలు, జీఎంలు, డీజీఎంలు, మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.
Also Read: Manikonda firing case: మణికొండ కాల్పుల కేసులో బిగ్ ట్విస్ట్… షాక్‌కు గురిచేస్తున్న సీఐ ప్రకటన
