Nizamabad MLA PA: నిజామాబాద్ రూరల్ ఎమ్మెలే పి ఏ శ్రీనివాస్ రెడ్డి,DEOఅశోక్ కు నోటీసులు జారి చేసింది హ్యూమన్ రైట్స్ కోర్టు. చాలా కాలంగా ప్రభుత్వ ఉపాద్యాయునిగా ఉండి ఎమ్మెలే పి ఏ గా పనిచేయటాన్ని తప్పు పట్టిన కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. వివరణ కోసం హాజరు కావాలని ఆదేశం జారీ చేసింది కోర్టు. విద్యా హక్కు చట్టం నిబంధనలను అతిక్రమిస్తున్నారని ఇద్దరిపై ఆర్టీఐ కార్యకర్త గోపాల్ పిర్యాదు చేశారు. నోటీసులపై స్వేచ్ఛ ప్రతినిధి వివరణ కోరడంతో DEO అశోక్ సమాధానం ఇచ్చారు. శ్రీనివాస్ రెడ్డి పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామనీ స్పష్టం చేశారు.
Also Read: Nizamabad: ఆ జిల్లాలో కష్టకాలంలో.. పార్టీ జెండా మోసినవాళ్లకే జిల్లా పరిషత్
ఎవ్వరైనా నిబంధనలు పాటించాల్సిందే
ప్రభుత్వ టీచర్లుగా ఉన్నవారు ప్రజా ప్రతినిధుల పీఏలుగా పనిచేయరాదనీ అన్నారు. ఎవ్వరైనా నిబంధనలు పాటించాల్సిందే అంటూ హెచ్చరించారు. సెలవులో ఉండటం వల్ల కోర్టు నోటీసులు చూడలేకపోయామని, అలాగే 2023 నుంచి ఇంగ్లీష్ టీచర్ అంటూ లక్షల జితలు తీసుకుంటూ పిల్లలకు విద్య చెప్పకుండా ఎంఎల్ఏ కు పీ ఏ గా పనిచేయడం పై హ్యూమన్ రైట్స్ కోర్టు ఈ ఇష్యుని సిరియస్ తీసుకుంది. సదరు ఇంగ్లీష్ టీచర్ అయినా శ్రీనివాస్ రెడ్డి కి నోటీసులు జారీ చేయడంతో ఉమ్మడి జిల్లాలో ఎంఎల్ఏ లకు పీ ఏ లుగా ఉన్న వారందరి గుండెల్లో ఒక్క సారిగా గుబులు పుట్టించే ఈ నోటీసులు ఘటన చర్చా నియాంశంగా మారింది.
Also Read: Nizamabad district: కులవృత్తిదారుల నుంచి లక్షల్లో వసూలు.. ఇవ్వకుంటే కుల బహిష్కరణలు
