The RajaSaab: ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘ది రాజాసాబ్’. తాజాగా ఈ సినిమా విడుదలకు సంబంధించి అసత్య ప్రచారాలను చెక్క పెట్టేలా మూవీ టీం ఒక నోట్ విడుదల చేసింది. ఈ సినిమా జనవరి 9, 2026న విడుదల కావడంలేదని, అనివార్య కారణాల వల్ల ఈ సినిమా విడుదల మళ్లీ వాయిదా పడిందని వస్తున్న వార్తలను నిర్మాత ఖండించారు. దీనికి సమాధానంగా ప్రెస్ నోట్ విడుదల చేశారు. అందులో.. ‘ప్రభాస్ హీరోగా వస్తున్న ‘ది రాజాసాబ్’ సినిమా విడుదల లేట్ అవుతుందంటూ వస్తున్న వార్తలు అన్నీ అసత్యం. ఈ సినిమా అనుకున్న తేదీలోనే గ్రాండ్ గా విడుదల అవుతుంది. అసత్య ప్రచారాలను అభిమానులు నమ్మకండి. ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అభిమానులు ప్రభాస్ ను మరో కోణంలో చూడబోతున్నారు.’ అంటూ చెప్పుకొచ్చారు నిర్మాత విశ్వ ప్రసాద్.
Read also-NC24 Meenakshi first look: నాగచైతన్య ‘NC24’ నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన మూవీ టీం..
అంతే కాకుండా.. ప్రతి డిపార్టుమెంట్ ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నారు. అభిమానులు థియేటర్లలో పండగ చేసుకునేలా ఈ సినిమాను రూపొందిస్తున్నాం. ఖచ్చితంగా ప్రేక్షకులకు మంచి థియేట్రికల్ ఎక్సీపియన్స్ అందుతుంది. ప్రేక్షకులు వీటన్నింటినీ పట్టించుకోకండి. ముందుగా చెప్పినట్లు ఈ సినిమాను సంక్రాంతికే తీసుకువస్తున్నాం. త్వరలో ఒక పాటతో మీ ముందుకు రాబోతున్నాం. అంటూ చెప్పుకొచ్చారు. దీనిని చూసిన అభిమానులకు విడుదలపై ఓ క్లారిటీ వచ్చింది. ఈ సినిమాపై వచ్చే అసత్య వార్తలకు బ్రేక్ పడింది.
Read also-Diane Ladd: వెటరన్ నటి ‘డయాన్ లాడ్’ కన్నుమూత.. చనిపోయే ముందు ఏం చెప్పారంటే?
సినిమా కథ, ఒక యువకుడు తన పూర్వీకుల ఆస్తిని తిరిగి పొందాలని ప్రయత్నిస్తాడు. డబ్బు కొరతతో ఇబ్బంది పడుతున్న అతను, పాత సినిమా థియేటర్ నేపథ్యంలో భయాన్విత అనుభవాలు, ప్రేమ కలిగిన రొమాన్స్, హాస్యాస్పద సంఘటనల మధ్య తప్పుకుంటాడు. ప్రభాస్ ఈ చిత్రంలో డ్యూయల్ రోల్స్‌లో నటిస్తున్నాడు – థియేటర్ మాలిక్‌గా భూతంగా, తన తాత, మనవడు రూపాల్లో. ఈ కథ ప్రేమ, వారసత్వం, అతీత రహస్యాలను కలిపి, ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందింది. ఈ సినిమా విడుదల కోసం ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఒక సారి విడుదల కావల్స్ ఉన్న ఈ సినిమాపై ఇంటాంటి రూమర్లు రావడం అభిమానులను కలవర పరుస్తోంది. నిర్మాత విడదుల చేసిన ఈ నోట్ తో అభిమానులకు ఒక క్లారిటీ వచ్చినట్టైంది. ఈ సినిమాలో నిథి అగర్వాల్, మాళవిక మోహన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
An Official Note from Team #TheRajaSaab pic.twitter.com/N1wQOIYaDP
— People Media Factory (@peoplemediafcy) November 4, 2025
