Maoist Factory (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Maoist Factory: మావోయిస్టుల ఫ్యాక్టరీలను ధ్వంసం చేసిన భద్రతా దళాలు

Maoist Factory: మావోయిస్టులకు అత్యంత స్వర్గధామంగా మారిన సుక్మా జిల్లాలో మావోయిస్టుల ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని భద్రత బలగాలు ధ్వంసం చేశాయి. ఆ ప్రాంతంలో నుండి 17 రైఫిళ్ళు, భారీ మొత్తంలో ప్రియుడు పదార్థాల సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. నిరంతరం మావోయిస్టుల కార్యకలాపాలను అణచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం, చత్తీస్గడ్ ప్రభుత్వాలు సంయుక్తంగా భద్రతా బలగాలను మోహరించి వారి చర్యలను అడ్డుకుంటున్నారు. విస్తృతమైన కూంబింగ్ లతో వారి స్థావరాలపై నిత్యం దాడులు చేస్తున్నారు. ఎదురుపడిన మావోయిస్టులను కాల్పుల్లో మట్టు పెడుతున్నారు. అత్యధికంగా మావోయిస్టు పార్టీలో పనిచేసే వారందరూ లొంగిపోయే విధంగా పకడ్బందీ చర్యలను చేపడుతున్నారు. మావోయిస్టులంతా హింసా మార్గాన్ని వదిలేసి జనజీవన స్రవంతిలో కడవాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) పేర్కొంటూ వస్తున్నారు.

అధికారుల ఆదేశాల మేరకు..

సుక్మా జిల్లాలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు భద్రత బలగాలు నిత్యం మావోయిస్టుల కార్యకలాపాల అణిచివేతకు పకడ్బందీ ప్రణాళికలు రచిస్తూ ముందుకు సాగుతున్నాయి. సోమవారం నిఘా వర్గాల విశ్వసనీయ సమాచారంతో సుక్మ జిల్లా(Sukma District)లో డిఆర్జి బృందం గోంగూడ ప్రాంతంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో మావోయిస్టుల ఆయుధ తయారీ కర్మగారాన్ని ధ్వంసం చేశాయి. ఆ ప్రాంతం నుంచి 17 రైఫిళ్ళు, భారీ మొత్తంలో ఆయుధాల తయారీ పదార్థాలు, తుపాకి భాగాలు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల కార్యకలాపాలు పెంచేందుకు లక్ష్యంతో ఈ కర్మగారాన్ని నిర్వహిస్తున్నారని పోలీసుల ప్రాథమిక దర్యాప్తు లో వెళ్లడైనట్లు పోలీసులు చెబుతున్నారు.

Also Read: Prashanth Varma: ప్రశాంత్ వర్మ.. అసలేం జరుగుతుంది?

పోలీసుల కొత్త వ్యూహం

సుక్మ జిల్లాలో పోలీసులు కొత్త వ్యూహాలను అనుసరిస్తున్నారు. మావోయిస్టుల కార్యకలాపాలను అడ్డుకునేందుకు నిత్యం అహర్నిశలు శ్రమిస్తున్నారు. పోలీసులు అనుసరిస్తున్న చర్యలతో మావోయిస్టులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. సుక్మా జిల్లాలో గడిచిన ఏడాదికాలంగా 545 మంది మావోయిస్టులు లొంగిపోయి జనజీవన స్రవంతిలో చేరిపోయారు. 454 మంది మావోయిస్టులను అరెస్టు చేశారు. 64 మంది కఠినమైన మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. ఈ చర్యలతో మిగిలిన మావోయిస్టులపై ఒత్తిడి పెరిగి జనజీవన స్రవంతిలో కలిసిపోయేందుకు సుముఖం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్ జి చవాన్(SP Kiran G Chavan) మాట్లాడుతూ… మావోయిస్టులను నిర్మూలించేందుకే భద్రత బలగాలు కృషి చేస్తున్నాయని తెలిపారు. మావోయిస్టు ప్రాంతాల్లోని ప్రజలు శాశ్వత శాంతి, అభివృద్ధి మార్గంలో జీవించేందుకే పనిచేస్తున్నాయన్నారు. మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న వారందరూ జనజీవన స్రవంతిలో కలవాలని ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. బిజిఎల్ లాంచర్ 1, బిజిఎల్ లాంచర్ 6, 12 బోర్ రైఫిల్ 6, సింగిల్ షాట్ రైఫిల్ 3, దేశంలో తయారుచేసిన ఫిస్టల్ 01, 12 బోర్ రైఫిల్ బారెల్ ర 02, హ్యాండ్ డ్రిల్ మిషన్ బిగ్ 01, టేబుల్ వైస్ 17, బిజిఎల్ బారెల్ 03, బి జి ఎల్ బాడీ కవర్ 02, దీపం 01, హ్యాండ్ డ్రిల్ మిషన్ చిన్నది 01, యాక్స్ 01, బన్సుల 01, విద్యుత్తిగా 20 మీటర్లు, ఇనుప వైపు 05, హతావురా 02, గ్రైండర్ ప్లేట్ 04, వెల్డింగ్ హ్యాండ్ షీల్డ్ 02 లను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.

Also Read: TPCC Coordination Committee: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం కో ఆర్డినేషన్ కమిటీ.. దీనిలో ముఖ్య నేతలు వీరే..!

Just In

01

Wife Shocking Plot: కట్టుకున్న భర్తనే కిడ్నాప్ చేయించింది.. దర్యాప్తులో నమ్మలేని నిజాలు

Swetcha Effect: స్వేచ్ఛ ఎఫెక్ట్.. అవినీతి అక్రమాలపై అదనపు ఎస్పీ శంకర్ విచారణ షురూ.. వెలుగులోకి సంచలనాలు

Revanth Reddy: ఈ నెల 11 లోగా కేసీఆర్‌ను అరెస్ట్ చేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Tandur Protest: తాండూర్‌లో హైటెన్షన్.. పార్టీలకు అతీతంగా భారీగా కదిలొచ్చిన నేతలు..?

Baahubali rocket: ‘బాహుబలి’ సినిమా మాత్రమే కాదు.. తెలుగు ప్రజల గౌరవం..