TPCC Coordination Committee (imagecredit:twitter)
తెలంగాణ, హైదరాబాద్

TPCC Coordination Committee: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం కో ఆర్డినేషన్ కమిటీ.. దీనిలో ముఖ్య నేతలు వీరే..!

TPCC Coordination Committee: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కొరకు టీపీసీసీ కో ఆర్డినేషన్ కమిటీ(TPCC Coordination Committee)ని నియమించింది. ఈ మేరకు పీసీసీ చీప్​ మహేష్​ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) ప్రత్యేక ఉత్తర్వులు రిలీజ్ చేశారు. ఇందులో చైర్మన్ గా మేయర్ గద్వాల విజయలక్ష్​మీ(Gadwal Vijayalakshmi) ఉండగా, కో చైర్మన్ గా మాజీ ఎమ్మెల్యే, కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ కుమార్(Anil Kumar) లు వ్యవహరించనున్నారు. మెంబర్లుగా రోహిన్ రెడ్డి, సమీర్ వాలీయ్, మోతో శోభన్ రెడ్డి, విజయారెడ్డి, రజితా పరమేశ్వర్ రెడ్డి, బొంతు శ్రీదేవి, బానోత్ సుజాత, మహలక్ష్​మీ రామన్ గౌడ్, పూజిత, మంజుల, బూరుగడ్డ పుష్ఫ, ఇందిరా శోభన్, రేగులపాటి రమ్యారావు, ఉజ్మాషకీర్ లు పనిచేయనున్నారు. వారం రోజుల పాటు జరిగే ఎన్నికల ప్రచారాన్ని ఈ కమిటీ మానిటరింగ్ చేయడంతో పాటు సమన్వయం, క్షేత్రస్థాయి కేడర్ఝ‌కు దిశా నిర్దేశం చేయనున్నది.

Also Read: India victory: వాషింగ్టన్ సుందర్ మెరుపులు.. ఆసీస్‌పై టీమిండియా సునాయాస విజయం

కాంగ్రెస్ కార్పొరేషన్లతో మీటింగ్

కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ చైర్మన్లతో నేడే ప్రత్యేక మీటింగ్ జరగనున్నది. పీసీసీ చీఫ్​ మహేష్​ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరగనున్న ఈ మీటింగ్ కు ఏఐసీసీ ఇన్ చార్జీ మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan) తో పాటు ఏఐసీసీ కార్యదర్శులు హాజరు కానున్నారు. గాంధీభవన్ లో జరిగే ఈ మీటింగ్ లో ప్రధానంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్లు(BC Reservations), నామినేటెడ్ పోస్టులు, పార్టీ కార్యక్రమాలు వంటి వాటిపై చర్చించనున్నారు. దీంతో పాటు డీసీసీ ఎంపిక పై అభిప్రాయాలు కూడా సేకరించనున్నారు. అంతేగాక పార్టీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రోగ్రామ్స్ పై ఆరా తీయనున్నారు.

Also Read: Tollywood star kids:  స్టార్ కిడ్స్‌కి సినిమాల్లో అవకాశాలు ఈజీగా వస్తాయా?.. టాలెంట్ అక్కర్లేదా?..

Just In

01

HYDRA: హైడ్రా ప్ర‌జావాణికి విశేష స్పందన.. సోమవారం ఎన్ని ఫిర్యాదులు అందాయో తెలుసా?

Telangana BJP: గతంలో రెండు ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపు.. ఈసారీ వర్కౌట్ అయ్యేనా..?

Vijay Sethupathi: పూరీతో చేస్తున్న సినిమా అయ్యేలోపు తెలుగులో మాట్లాడతా.. కవితలు కూడా రాస్తా!

Stray Dogs Case: వీధి కుక్కల బాధితులకు సుప్రీంకోర్టులో ఊరట.. ఇకపై ఆ షరతు ఎత్తివేత

Thummala Nageswara Rao: పత్తి సేకరణకు మరీ ఇన్ని ఆంక్షలా?.. కేంద్రానికి మంత్రి తుమ్మల లేఖ