Vijay Thalapathy Birthday Goat Movie Special Video
Cinema

Dalapathi: డబుల్‌ రోల్‌, డబుల్‌ మజా

Vijay Thalapathy Birthday Goat Movie Special Video: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి బర్త్‌డే సందర్భంగా ఫ్యాన్స్ సెలబ్రేషన్స్‌ని చాలా గ్రాండ్‌గా చేసుకున్నారు. ఇప్పుడు దాన్ని డబుల్ చేయడం కోసమా అన్నట్లు విజయ్‌ యాక్ట్ చేసిన మూవీ నుంచి క్రేజీ వీడియో ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ఇదైతే ఫ్యాన్స్‌కు మాములు కిక్ ఇవ్వట్లేదు. ఎందుకంటే కేవలం 50 సెకన్ల వీడియోలోనే ఫుల్ హైప్‌ని పెంచేసింది.

విజయ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ద గోట్ ఈ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా యాక్ట్ చేస్తోంది. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో తీస్తున్న ఈ మూవీలో విజయ్ డబుల్‌ రోల్‌ చేస్తున్నాడు. వెంకట్ ప్రభు ఈ మూవీకి దర్శకుడు. ఇదివరకే ఈ మూవీ షూటింగ్ ఎండింగ్‌కు వచ్చేసింది. సెప్టెంబర్‌ 5న థియేటర్లలో మూవీని రిలీజ్ చేస్తామని మూవీ యూనిట్‌ అనౌన్స్‌ చేశారు. తాజాగా రిలీజ్ చేసిన స్పెషల్ వీడియోలో ఇద్దరు విజయ్‌లు బైక్‌పై వెళ్తుండగా వీళ్లని విలన్స్ ఛేజ్ చేస్తూ ఉంటారు.

Also Read:కల్కిపై ఆర్జీవీ ట్వీట్

ఇక ఈ మూవీకి యువన్ శంకర్ రాజా క్రేజీ మ్యూజిక్‌ని అందించారు. స్పెషల్ వీడియోతో ఎంతగానో ఆకట్టుకున్నారు. మరి ఫుల్ ఎలా ఉంటుందో చూడాలంటే మాత్రం మరికొన్ని డేస్ వెయిట్ చేయకతప్పదు. ఇకపోతే ఈ మూవీలో ప్రముఖ డ్యాన్సర్ ప్రభుదేవా, ప్రశాంత్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Just In

01

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ