Telangana BJP: కాషాయ పార్టీకి నవంబర్ నెల సెంటిమెంట్ గా మారింది. గతంలో జరిగిన రెండు ఉప ఎన్నికల్లో విజయ దుందుభి మోగించింది. అదేనెలలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతుండటంతో ఒక వర్గానికి చెందిన శ్రేణులు జోష్ తో ఉన్నాయి. గతంలో ఉప ఎన్నికల్లో గెలుపు తీరాలకు చేరినట్లే ఈ ఎన్నికల్లోనూ విజయతీరాలకు చేరుతామని బీజేపీ(BJP)లోని ఒక వర్గం శ్రేణులు ధీమాతో ఉన్నాయి. జూబ్లీహిల్స్ లో 7 డివిజన్లు ఉన్నాయి. వీటిలో ముస్లింల ఓట్లు డిసైడింగ్ ఫ్యాక్టర్ గా మారుతాయనే ప్రచారం కూడా ఉంది. అయితే ఈ ఎన్నికల్లో ఇవేవి వర్కువుట్ అయ్యే చాన్స్ లేదని బీజేపీ నాయకులు చెబుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ పదేండ్ల పాలన, కాంగ్రెస్(Congress) రెండేండ్ల పాలనను చూశారని, వారి మోసాలు చూసి ప్రజలంతా బీజేపీ వైపునకు ఆకర్షితులవుతున్నారని చెబుతున్నారు. ఈ ఒక్క అంశమే తమ గెలుపును డిసైడ్ చేస్తుందనే ధీమాతో వారున్నారు.
ఆ అభ్యర్థికి ఎవరూ ఓట్లు వేయరు
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 4,01,365 ఓట్లు ఉన్నాయి. అందులో ముస్లిం ఓటర్లు దాదాపు 1.18 లక్షలకు పైచిలుకు ఉంటాయని తెలుస్తోంది. అవి కాకుండా మిగతా ఓట్లన్నీ తమ పార్టీకే పడుతాయనే ధీమాతో కాషాయ పార్టీ నేతలు భావిస్తున్నారు. అందుకు ఇంటింటికీ వెళ్లి గ్రౌండ్ లెవల్లో ప్రచారం చేపడుతున్నట్లుగా చెబుతున్నారు. అంతేకాకుండా బీఆర్ఎస్ పదేండ్ల పాలన చూసి ఆ అభ్యర్థికి ఎవరూ ఓట్లు వేయబోరని, అలాగే కాంగ్రెస్ అభ్యర్థిపై రౌడీ షీటర్ అనే ముద్ర ఉండటం కూడా తమకు ప్లస్ అవుతుందని కమలదళం భావిస్తోంది. ఇదిలాఉండగా ఇప్పటికే ఆర్ఎస్ఎస్ విస్తృతంగా పనిచేస్తోందని శ్రేణులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నాయి. నవంబర్ లో జరిగిన రెండు బైపోల్స్ లో విజయబావుటా ఎగురవేసినట్లే ఈసారి కూడా విజయతీరాలకు చేరి హ్యాట్రిక్ సాధిస్తామని ధీమాతో పార్టీ ఉంది.
Also Read: Dude movie ott: ప్రదీప్ రంగనాధన్ ‘డ్యూడ్’ ఓటీటీలోకి వచ్చేది అప్పుడేనా!.. ఎక్కడంటే?
విజయతీరాలకు చేరుతాం..
దుబ్బాక ఉప ఎన్నిక 2020 నవంబర్ లో జరిగింది. ఉత్కంఠ పోరులో బీఆర్ఎస్(BRS) అభ్యర్థి సుజాత(Sujatha)పై రఘునందన్ రావు(Raghunandan Rao) 1079 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అలాగే హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు కూడా 2021 నవంబర్ లోనే వెలువడ్డాయి. బీఆర్ఎస్(BRS), ఆత్మగౌరవానికి మధ్య జరిగిన ఎన్నికలుగా చెప్పిన రాజేందర్.. గులాబీ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్(Gellu Srinivas Yadav) పై 24,068 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. అదే తరహాలో ఈసారి కూడా విజయతీరాలకు చేరుతామని శ్రేణులు భావిస్తున్నాయి. కాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్(Kishan Reddy)డి సైతం తాము కింగ్ మేకర్ కాదని, కింగ్ గా నిలుస్తామని ధీమాతో ఉన్నారు. కాగా జూబ్లీహిల్స్ లో గత అసెంబ్లీ ఎన్నికల్లో 43.28 శాతం మాత్రమే పోలింగ్ జరిగింది. ఈసారి గెలుపు కూడా పోలింగ్ శాతం పైనే ఆధారపడి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రచారంలో ఇతర పార్టీల కంటే కాస్త వెనుకబడి బీజేపీ ఉందనే టాక్ వినిపిస్తోంది. అలాంటిది ఈ ఎన్నికల్లో గెలుపు సాధ్యమేనా? అనేది కూడా పార్టీలో ఒక వర్గం నేతలు ప్రశ్నిస్తున్నారు. కేవలం నవంబర్ సెంటిమెంట్ ఉన్నంత మాత్రాన గెలుపు వచ్చి చేరుతుందా? అనే చర్చ కూడా జరుగుతోంది. పూర్తిస్థాయిలో శ్రమిస్తే తప్పా విజయతీరాలకు చేరలేమని పలువురు చెబుతున్నారు. నవంబర్ సెంటిమెంట్ కాషాయ పార్టీకి కలిసొస్తుందా? లేదా అనేది తేలాలంటే ఈనెల 14 వరకు ఆగాల్సిందే.

