Air India crash: ఎయిరిండియా క్రాష్‌ సర్వైవర్ ఎలా ఉన్నాడంటే
Air-India-Crash (image source Twitter)
Viral News, లేటెస్ట్ న్యూస్

Air India crash: ఎయిరిండియా క్రాష్‌లో బతికిన ఏకైక ప్యాసింజర్ ప్రవర్తనలో అనూహ్య మార్పు.. భార్య, కొడుకుతో..

Air India crash: ఈ ఏడాది జూన్ 12న జరిగిన ఎయిరిండియా క్రాష్ యావత్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో ఏకంగా 241 మంది ప్రాణాలు పోగొట్టుకోగా, ఒకే ఒక్కరు ప్రాణాలతో బయపట్డారు. ఫ్లైట్‌లోని 11ఏ సీటులో కూర్చొని బతికి బట్టకట్టిన ఆ వ్యక్తి పేరు విశ్వాస్ కుమార్ రమేష్. ప్రస్తుతం ఈ భూమిపై బతికివున్న ప్రాణుల్లో తానే అత్యంత అదృష్టవంతుడినని ఆయన వ్యాఖ్యానించారు. ఘోర విషాదం నుంచి ప్రాణాలతో బయటపడిన తాను అనుభవిస్తున్న శారీరక, మానసిక ఇబ్బందులను ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకు ఆయన వివరించారు. తాను ఎవరితోనూ మాట్లాడడం లేదని, ఒంటరిగా ఉంటున్నానని తెలిపారు. తన భార్య, కొడుకుతో కూడా మాట్లాడటం లేదని వెల్లడించారు. ప్రస్తుతం ఒంటరిగా గడుపుతున్నానని, గదిలో ఒంటరిగా కూర్చుంటానని తెలిపారు. భార్యతో, కొడుకుతో కూడా మాట్లాడను, ఒంటరిగా ఉండాలనిపిస్తోందని ఆయన వివరించారు.

ప్రమాదం జరిగిన విమానంలో కొన్ని సీట్ల దూరంలోనే తన తమ్ముడు అజయ్ కూడా చనిపోయాడంటూ కళ్లు చమర్చారు.తమ్ముడిని కోల్పోవడం జీవితంలో తీర్చలేని లోటు అని చెప్పారు. తమ్ముడే తన బలమని, గత కొన్నేళ్లుగా తమ్ముడే తనను అన్ని విధాలా ఆదుకున్నాడని గుర్తుచేసుకొని కన్నీళ్లు పెట్టారు. తమ్ముడు లేడనే వాస్తవాన్ని తన కుటుంబం జీర్ణించుకోలేకపోతోందని విచారం వ్యక్తం చేశారు. తమ్ముడితో పాటు విమానంలోని మిగతా వారంతా చనిపోయి తాను మాత్రమే బతికివుండడం చాలా అదృష్టమని ఆయన అభివర్ణించారు.

Read Also- Nuclear weapons: పాక్, చైనా అణ్వాయుధాలు పరీక్షిస్తున్నాయన్న ట్రంప్ .. ఇండియా కూడా మొదలుపెడుతుందా?

కాగా, రమేష్‌కు పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (PTSD) ఉన్నట్లు నిర్ధారణ అయింది. అయితే, ఇండియాలో చికిత్స పొందిన తర్వాత, బ్రిటన్‌లోని తన స్వస్థలమైన లీసెస్టర్‌కు తిరిగి వెళ్లినప్పటి నుంచి ఆయన చికిత్స తీసుకోలేదట. జూన్ 12న అహ్మదాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా 171 విమానం అహ్మదాబాద్‌లోని ఒక మెడికల్ హాస్టల్‌ బిల్డింగ్‌పై కూలిపోయింది. ఘటనా స్థలంలో పెద్ద ఎత్తున మంటలు వెలువగా, రమేష్ మాత్రం అక్కడి నుంచి నడుచుకుంటూ రోడ్డుపైకి రావడం, అందుకు సంబంధించిన దృశ్యాలు ప్రపంచవ్యాప్తంగా వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. రమేష్ కుమార్ విశ్వాస్‌కు బ్రిటన్ పౌరసత్వం ఉంది.

ఆ ప్రమాదం నుంచి తాను మాత్రమే బయటపడడాన్ని నమ్మలేకపోతున్నానని, ఇప్పటికీ నమ్మశక్యంగా లేదని రమేష్ పేర్కొన్నాడు. ఒక్క వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడడం ఒక అద్భుతమని ఆయన వ్యాఖ్యానించారు. ఎయిరిండియా క్రాష్ తర్వాత తనకు శారీరకంగా, మానసికంగా చాలా బాధగా ఉందన్నారు. ‘‘ నాకు, నా కుటుంబానికి చాలా కష్టంగా ఉంది. గత 4నెలలుగా, మా అమ్మ రోజూ బయట తలుపు దగ్గర కూర్చుంటోంది. ఎవరితోనూ మాట్లాడటం లేదు, ఏమీ చేయడం లేదు. నేను కూడా ఎవరితోనూ మాట్లాడటం లేదు. నేను ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాను. రాత్రంతా ఆలోచిస్తూ ఉంటున్నాను. మానసికంగా బాధపడుతున్నాను. మా కుటుంబం మొత్తానికి ప్రతిరోజూ బాధాకరంగా ఉంటోంది’’ అని రమేష్ వెల్లడించారు.

Read Also- Nuclear weapons: పాక్, చైనా అణ్వాయుధాలు పరీక్షిస్తున్నాయన్న ట్రంప్ .. ఇండియా కూడా మొదలుపెడుతుందా?

ప్రమాదం నుంచి తప్పించుకున్నప్పటి శారీరకానికి గాయాలయ్యాయని తెలిపారు. కాలు, భుజం, మోకాళ్లు, వీపు భాగంలో బాగా నొప్పిగా ఉంటోందని, పనులేమీ చేయలేకపోతున్నానని చెప్పారు. డ్రైవింగ్ కూడా చేయలేకపోతున్నానని వివరించారు. సరిగా నడవలేని పరిస్థితి కారణంగా తన భార్య సహాయం చేస్తోందని వివరించారు. రమేష్‌కు ఎయిరిండియా సుమారుగా రూ.25. లక్షల తాత్కాలిక పరిహారం అందించింది. అయితే, ఇది సరిగా సరిపోవడం లేదని, ఇబ్బందులు పడుతున్నారని ఆయన సన్నిహితులు చెప్పారు.

Just In

01

KCR: 27 లేదా 28న పాలమూరుకు కేసీఆర్?.. ఎందుకో తెలుసా?

Student Suicide Attempt: గురుకుల క‌ళాశాల‌ భ‌వ‌నం పైనుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

Ramchander Rao: సర్పంచ్ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్‌కు బీజేపీ రాంచందర్ రావు ప్రశ్న ఇదే

Bhatti Vikramarka: తెలంగాణలో అత్యధిక ప్రజావాణి అర్జీలను పరిష్కరించిన కలెక్టర్‌.. ఎవరో తెలుసా..?

New Sarpanch: ఎలుగుబంటి వేషంలో నూతన సర్పంచ్.. కోతుల సమస్యకు చెక్!