Dreams: మనలో చాలా మందికి రాత్రి వేళల్లో చెడు, గందరగోళంగా ఉండే కలలు వస్తుంటాయి. ఇవి హారర్ సినిమాల మాదిరి కాదు. మన మనసు, భావోద్వేగాల ప్రతిబింబం. నిద్రలో కలలు, భయంకర స్వప్నాలు అనేవి మన మెదడు స్ట్రెస్, భయం, భావోద్వేగాలను ప్రాసెస్ చేసే సహజ ప్రక్రియలో భాగమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
చెడుకలల వెనుక సైన్స్ ఏం చెబుతుందంటే?
న్యూరోసైంటిస్టు చెప్పిన దాని ప్రకారం, “కలలు అంటే మన మెదడుకు రాత్రిపూట జరిగే థెరపీ సెషన్‌లాంటివి ” కానీ మనం ఎక్కువగా ఒత్తిడిలో ఉన్నప్పుడు, సరైన నిద్ర లేకపోయినప్పుడు లేదా భావోద్వేగ కలతలో ఉన్నప్పుడు.. ఆ థెరపీ “నైట్‌మేర్”గా మారుతుంది. చెడుకలలకు కారణమయ్యే ప్రధాన కారణాలు. చెడుకలలు యాదృచ్ఛికంగా రావు.. వాటికి స్పష్టమైన ట్రిగర్స్ ఉంటాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
స్ట్రెస్, ఆందోళన: మనిషి మానసిక ఒత్తిడి, భావోద్వేగ సంఘర్షణల మధ్య నలిగిపోయినప్పుడు ఎక్కువగా వస్తాయి.
నిద్ర లోపం: సరైన నిద్ర రాకపోవడం వల్ల రెమ్ సైకిల్స్ ఎక్కువగా డిస్టర్బ్ అవుతాయి, అప్పుడు కలలు మరింత కన్ఫ్యూస్ చేస్తాయి.
మందులు: కొన్ని యాంటీడిప్రెసెంట్లు, బీపీ మందులు నిద్రలో కలలపై ప్రభావం చూపుతాయి.
రాత్రి లేట్‌గా తినడం: నిద్రకు ముందే తినడం మెటబాలిజాన్ని పెంచి, మెదడును యాక్టివ్‌గా ఉంచుతుంది. దీని వల్ల చెడుకలలు వస్తాయి.
ట్రామా లేదా PTSD: గతంలో జరిగిన భయంకర అనుభవాలు ఉన్నవారికి రికరింగ్ నైట్‌మేర్‌లు సాధారణమవుతాయి.
చెడుకలలలో దాగి ఉన్న ప్రయోజనం ఇదే
నైట్‌మేర్‌లు అసహజంగా ఉన్నా, వాటికి ఒక ఉపయోగకరమైన కారణం ఉంది. పరిశోధకుల ప్రకారం, చెడుకలలు మన మెదడుకు రియల్ లైఫ్‌లో భయాన్ని ఎదుర్కోవడానికి ఒక రిహార్సల్‌లాంటివి. దీన్ని ‘థ్రెట్ సిమ్యులేషన్ థియరీ’ అంటారు. అంటే మన మెదడు భవిష్యత్తులో ఎదురయ్యే పరిస్థితులకు ముందుగా సిద్దమవుతుంది.
Also Read: First Date Ideas: ఫస్ట్ డేట్‌లో మీ ప్రియమైనవారిని ఇంప్రెస్ చేయాలా? ఈ అద్భుత ఐడియాలు మీ కోసమే!
చెడుకలలను తగ్గించుకోవచ్చా?
మంచి నిద్ర అలవాట్లు, ఒత్తిడి నియంత్రణ వలన తగ్గించుకోవచ్చు.
ఈ చిట్కాలతో చెడు కలలను తగ్గించుకోండి..
నిద్ర సమయాన్ని స్థిరంగా ఉంచండి: ప్రతిరోజూ ఒకే టైంలో నిద్రపోవడం, లేవడం వల్ల రెమ్ సైకిల్స్ కరెక్ట్ గా ఉంటాయి.
రాత్రి సమయంలో కాఫీ, హెవీ ఫుడ్స్ వద్దు : ఇవి మెదడును స్టిమ్యులేట్ చేసి చెడుకలలకు కారణమవుతాయి.
నిద్రకు ముందు రిలాక్స్ అవ్వండి: ధ్యానం, లైట్ మ్యూజిక్ వినడం వలన స్ట్రెస్ తగ్గుతుంది.
శాంతమైన నిద్ర : గది చల్లగా, చీకటిగా, మొబైల్-ఫ్రీగా ఉంచండి.
ఇమేజరీ రిహార్సల్ థెరపీ (IRT): నైట్‌మేర్‌కి పాజిటివ్ ఎండింగ్ ఉంటే భయాన్ని తగ్గించుకోవచ్చు.
గమనిక: పలు హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘స్వేచ్ఛ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
