Gadwal Crime: ధరూర్ మండల కేంద్రంలో ఉన్న హేమంత్ బంగారు దుకాణం వ్యాపారి శివ కుమార్ చారిని శాంతినగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఒక దొంగ బంగారు కేసులో విచారణకు గాను ఆ వ్యాపారిని తీసుకెళ్లినట్లు ప్రచారం నడుస్తోంది. ఇదిలా ఉండగా గతంలో ఆ బంగారు దుకాణం వ్యాపారిపై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఇష్టానుసారం తనది కాని బంగారాన్ని కొత్త,కొత్త వ్యక్తులతో ధరలకు (లక్ష రూపాయలు విలువైన బంగారాన్ని ఇరవై వేలకు)తక్కువకు కొనడం, అలాగే తన షాపులో ఉన్న బంగారు,వెండి అభరణలల్లోను సగానికి పైగ నాణ్యత లేకుండ ఉన్న అభరణలను రాయచూర్ నుండి తీసుకొనివచ్చి ప్రజలకు తక్కువ ధరలకు అమ్మకాలు జరిపి వారిని మోసం చేసేవాడని ఆరోపణలు ఉన్నాయి. ఇలా నాణ్యత లేని బంగారం, వెండి అభరణలు అమ్మకూడదని పలుమార్లు గద్వాల సంఘం వాళ్లు హెచ్చరించిన పెడచెవిన పెట్టేవాడని తెలిసింది.
Also Read:Jogulamba Gadwal Crime: అక్రమ సంబంధానికి అడ్డొస్తాడని.. ప్రియుడితో హత్య చేయించిన భార్య!
మరో ఘటనలో మహిళా మెడలో బంగారం కోసం హత్య
మహిళ మెడలోని గొలుసు కోసం గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లో ఒంటరిగా ఉండగా రెక్కీ నిర్వహించి మెడలోని బంగారాన్ని అపహరించేందుకు ఆమెను హత్య చేసి తీసుకెళ్లారనే ఆరోపణలు బాధిత కుటుంబం నుంచి వస్తున్నాయి. ఈ ఘటన గద్వాలలో కలకలం రేపింది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం గద్వాల పట్టణంలోని షెరిల్లి వీధికి చెందిన లక్ష్మి (55) ఆదివారం ఇంట్లో ఉండగా భర్త కిరాణా సరుకుల కోసం బయటికి వెళ్లారు. తిరిగి వచ్చేసరికి ఆమె అపస్మారక స్థితిలో పడి ఉండడానికి గమనించి స్థానికుల సహాయంతో చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మరణించినట్లు తెలిపారు.
క్లూస్ టీం తో పరిశీలించిన పోలీసులు
సమాచారం అందుకున్న గద్వాల సీఐ టంగుటూరి శ్రీను, ఎస్ఐలు సంఘటన స్థలానికి చేరుకొని జాగిలాలతో దుండగుల కోసం వెతికారు. మహిళ గొంతుపై బలమైన గాయాలు ఉండడం, మెడలో నాలుగు తులాల బంగారు గొలుసు లేకపోవడంతో దొంగల నుంచి ఆమె రక్షించుకునేందుకు ప్రతిఘటించగా జరిగిన పెనుగులాటలో ముఖంపై బలమైన గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. బంగారం కోసమే దొంగలు రెక్కీ నిర్వహించి ఈ ఘాతుకానికి పాల్పడ్డారనే కోణంలో మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
