dude-ott(image :x)
ఎంటర్‌టైన్మెంట్

Dude movie ott: ప్రదీప్ రంగనాధన్ ‘డ్యూడ్’ ఓటీటీలోకి వచ్చేది అప్పుడేనా!.. ఎక్కడంటే?

Dude movie ott: ప్రదీప్ రంగనాధన్ హీరోగా తెరకెక్కిన ‘డ్యూడ్’ సినిమా థియేటర్లలో విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమా నవంబర్ 14,2025న నెట్ ఫ్లిక్స్ లో స్టీమింగ్ కానుంది. విడుదలైన నాలుగు వారాల్లోనే ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. దీంతో థియేటర్లలో చూడలేని ప్రదీప్ రంగనాథన్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ప్రదీప్ రంగనాధన్ హీరోగా దర్శకుడు కీర్తిశ్వరన్ మొదటి చిత్రంగా ఈ మూవీని తీసుకొచ్చారు. ఈ సినిమాలో ‘ప్రేమలు’ ఫేమ్ మమితా బైజు హీరోయిన్‌గా నటించారు. సీనియర్ నటుడు శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపిస్తారు. రోహిణి , హృదూ హరూన్, సత్య, నేహా శెట్టి తదితరులు నటిస్తారు. సాయి అభ్యంకర్ ఈ సినిమాకు సంగీతం అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా సినిమా దీపావళి సందర్భంగా విడుదలైంది.

Read also-Varanasi: ‘వారణాసి’ టైటిల్ పాయె.. మహేష్, రాజమౌళి టైటిల్ ఏంటో?

ఈ సినిమా కథ విషయానికి వస్తే.. కుందన్ (మమితా బైజు) పశుసంవర్ధక శాఖ మంత్రి ఆదికేశవులు (శరత్ కుమార్) కుమార్తె. ఆమె మేనత్త కుమారుడు గగన్ (ప్రదీప్ రంగనాథన్)ను ప్రేమిస్తుంది. కానీ గగన్ ఆ ప్రేమను ఓప్పుకోడు. లవ్ ఫెయిల్యూర్ బాధలో బెంగళూరుకు వెళ్లిపోతుంది కుందన్. ఎప్పుడూ పక్కన ఉండే అమ్మాయి దూరం అయ్యేసరికి గగన్ మనసులో ప్రేమ బయటపడుతుంది. తన మావయ్యకు చెప్పి పెళ్లి చేసుకుంటానని బతిమాలతాడు . గగన్ తల్లి (రోహిణి) కుందన్ తండ్రి మధ్య ఉన్న పాత గొడవలు, పెళ్లి మధ్యలో వచ్చే అడ్డంకులు, కుందన్ ఆకస్మికంగా పెళ్లి వద్దని అనడం, గగన్ చేసే త్యాగాలు ఇవన్నీ సినిమాను ముందుకు తీసుకెళతాయి. మొత్తంగా.. బాల్యం నుంచి పెరిగిన వ్యక్తిపై ప్రేమ, కుటుంబ బంధాలు, సామాజిక సమస్యలపై కొంచెం సందేశం ఇచ్చే కథ. దీని గురించి మరింత తెలుసుకోవాలంటే సినిమాకు వెళ్లాల్సిందే.

Read also-Sudheer Babu: మహేష్ సపోర్ట్ తీసుకోలేదు.. సుధీర్ బాబు స్కెచ్ ఏంటి?

టెక్నికల్ అంశాలు ఎలా ఉన్నాయంటే.. కథ, దర్శకత్వం గురించి మాట్లాడితే, ప్రేమకథల్లో కొత్తదనం కష్టమే అయినా చెప్పే తీరు మాత్రం చాలా ముఖ్యం. ప్రేమ వ్యక్తీకరణ సమయంలో మార్పులు, సామాజిక సమస్యలు ఎంటర్‌టైనింగ్‌గా చూపించారు. ముగింపు అందరూ అమోదించేలా ముగించారు. కెమేరా పనితనం ఆకట్టుకునేలా ఉంది. ఎడిటింగ్ విసయానికొస్తే కాస్త మెరుగు పడాల్సి ఉంది. సాయి అభ్యంకర్ అందించి సంగీతం మెప్పించింది. సంగీతం సినిమాలు బాగా ఎలివేట్ చేస్తుంది. ఈ సినిమా ఓటీటీ విడుదలకోసం అభిమానలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే వంద కోట్ల క్లబ్ లో చేరిన ఈ సినిమా ప్రదీప్ రంగనాధన్ స్టార్ డమ్ ను మరింత పెంచింది.

Just In

01

TPCC: జూబ్లీహిల్స్‌లో టీపీసీసీ ‘ఉమెన్స్ వ్యూహం’.. రంగంలోకి 7 మహిళా బృందాలు.. ఏం చేస్తాయంటే?

RT76: ఆషికాతో రొమాన్స్‌లో రవితేజ.. షూటింగ్ అప్డేట్ ఇదే!

HYDRA: హైడ్రా ప్ర‌జావాణికి విశేష స్పందన.. సోమవారం ఎన్ని ఫిర్యాదులు అందాయో తెలుసా?

Telangana BJP: గతంలో రెండు ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపు.. ఈసారీ వర్కౌట్ అయ్యేనా..?

Vijay Sethupathi: పూరీతో చేస్తున్న సినిమా అయ్యేలోపు తెలుగులో మాట్లాడతా.. కవితలు కూడా రాస్తా!