Natural Star Nani: రామ్ చరణ్‌కు పోటీగా నాని.. ఇరకాటంలో మెగా ఫ్యాన్స్‌!
Paradise vs Peddi (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Natural Star Nani: రామ్ చరణ్‌కు పోటీగా.. మెగా ఫ్యాన్స్‌ని ఇరకాటంలో పెట్టిన నాని!

Natural Star Nani: టాలీవుడ్‌లో ఎప్పుడూ సినిమాల పోటీలు ఆసక్తికరంగానే ఉంటాయి. స్టార్ హీరోల సినిమాలు ఒకే రోజున థియేటర్లలోకి వస్తే అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంటుంది. ఇప్పుడు అలాంటి సీన్ రాబోతోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న ‘పెద్ది’ (Peddi) సినిమాకు పోటీగా, నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) నటించిన ‘ది ప్యారడైజ్’ (The Paradise) సినిమా.. ఆ సినిమా కంటే ఒక రోజు ముందే విడుదల కాబోతోంది. దీంతో ఈసారి బాక్సాఫీస్ వద్ద రామ్ చరణ్, నానిల మధ్య ఆసక్తికర పోరు ఉండబోతోంది. సాధారణంగా మెగా హీరో సినిమాకు ఎదురుగా మరో స్టార్ సినిమా రిలీజ్ అయితే, మెగా ఫ్యాన్స్ కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తారు. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. అదేంటంటే..

Also Read- Mahesh and Rajamouli: మహేష్ బాబు, రాజమౌళి మధ్య ఆసక్తికర సంభాషణ.. సోషల్ మీడియా షేక్!

డైలమాలో ఫ్యాన్స్..

‘ది ప్యారడైజ్’ సినిమాకు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, అతని తదుపరి చిత్రం మెగాస్టార్ చిరంజీవితో ఉండబోతోంది. అంతేకాదు ఆ సినిమాను నేచురల్ స్టార్ నాని స్వయంగా నిర్మించబోతున్నారు. అంటే రామ్ చరణ్‌కు ఇప్పుడు బాక్సాఫీస్‌లో నాని పోటీగా నిలుస్తున్నా, అదే సమయంలో నాని భవిష్యత్తులో మెగాస్టార్‌తో కలిసి పనిచేయబోతున్నాడు. ఇలా చూసుకుంటే, నానిని వ్యతిరేకించడం మెగా ఫ్యాన్స్‌కి ఇబ్బందిగా మారింది. ఒకవైపు రామ్ చరణ్ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నారు, మరోవైపు నాని నిర్మాణంలో మెగాస్టార్ సినిమా చేయబోతున్నందున ఆయనకు కూడా గుడ్‌విల్ ఉండాలని అనుకుంటున్నారు. దీంతో ఫ్యాన్స్ మధ్యలో క్లియర్ డైలమా నెలకొంది. ఎవరి సినిమాకు మద్దతు ఇవ్వాలి అన్న ప్రశ్న తలెత్తింది.

Also Read- Rajashekar: అది లేకపోతే జైల్లో ఉన్నట్టే ఉంటుంది.. ‘కె ర్యాంప్’‌ సాంగ్‌‌పై కూడా వేసేశాడు

రెండు సినిమాలూ హిట్ కావాలి

ఇకపోతే, ‘ప్యారడైజ్’ ట్రైలర్, సాంగ్స్ ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేశాయి. నాని ఈ సినిమాలో మరోసారి తన నేచురల్ పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకునేలా ఉన్నాడు. ‘పెద్ది’ మాత్రం రామ్ చరణ్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవబోతుందన్న హైప్ ఇప్పటికే ఉంది. రెండు సినిమాలకూ విభిన్నమైన కాన్సెప్ట్, భారీ అంచనాలు ఉండటంతో ఈ పోటీ మరింత ఎగ్జైటింగ్‌గా మారింది. ఇంతలో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మధ్య ‘ఎవరి సినిమా బాక్సాఫీస్ వద్ద నిలుస్తుంది?’, ‘పెద్ది vs ప్యారడైజ్ ఎవరు విన్నర్?’ అనే చర్చలు మొదలయ్యాయి. కానీ చాలా మంది మాత్రం రెండు సినిమాలూ హిట్ కావాలని కోరుకుంటున్నారు. మొత్తానికి, ఈసారి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రామ్ చరణ్ – నాని పోటీ.. కేవలం కలెక్షన్స్‌కే కాకుండా, ఫ్యాన్స్ ఎమోషన్స్‌కీ టెస్ట్ కానున్నాయి. ‘ది ప్యారడైజ్’ మూవీ 26 మార్చి, 2026న విడుదల కాబోతుంటే, రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా ఆయన పుట్టినరోజైన 27 మార్చి 2026న విడుదల కానుంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Jogipet Accident News: ఓరి నాయనా .. పందులను ఢీకొని ఆటో బోల్తా.. స్పాట్‌లో మహిళ మృతి..!

Revenge Crime: రెండు కుటుంబాల మధ్య పగ.. ఇటీవలే ఒక హత్య.. పోస్టుమార్టం నిర్వహించగా…

IND vs SA 5th T20I: కొద్ది గంటల్లో ఐదో టీ20.. టీమిండియాలో భారీ మార్పులు.. ఈ ఇద్దరు స్టార్లు ఔట్!

BMW Teaser: రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ టీజర్ వచ్చేసింది.. మాస్‌కి ఫ్యామిలీ టచ్..

Huzurabad News: మిషన్ భగీరథకు తూట్లు.. నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్న అధికారులు..?