The Girlfriend Producers (Image Source: X)
ఎంటర్‌టైన్మెంట్

The Girlfriend: రిలీజ్‌కు ముందు ఉండే టెన్షన్‌ లేదు.. చాలా హ్యాపీగా ఉన్నామంటోన్న నిర్మాతలు.. ఎందుకంటే?

The Girlfriend: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (National Crush Rashmika Mandanna), టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి (Dheekshith Shetty) జంటగా నటించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ (The Girlfriend) చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. నవంబర్ 7న తెలుగు, హిందీలో.. నవంబర్ 14న తమిళ, కన్నడ, మలయాళంలో విడుదల కాబోతున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించారు. ఇంటెన్స్, ఎమోషనల్ లవ్ స్టోరీగా దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషన్స్‌ను మేకర్స్ యమా జోరుగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా చిత్ర నిర్మాతలు ధీరజ్ మొగిలినేని (Dheeraj Mogilineni), విద్య కొప్పినీడి (Vidya Koppineedi).. మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేశారు. వీరిలో ముందుగా

Also Read- Bigg Boss Telugu 9: మాధురి అలక.. ప్యాక్ యువర్ బ్యాగ్ పవన్.. రామూ రాథోడ్ నవ్వుల నజరానా

నిర్మాత ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ..

‘‘లాక్ డౌన్ టైమ్‌లో స్క్రిప్ట్ డెవలప్ చేసే దశలో ఉన్నాం. థియేటర్లన్నీ ఓపెన్ అయిన తర్వాత ఈ సినిమాను థియేట్రికల్‌గా రిలీజ్ చేయాలనుకున్నాం. మేము ఈ ప్రాజెక్ట్ టేకోవర్ చేసినప్పటి నుంచి థియేటర్లలోనే అని ముందుకెళ్లాం. నిర్మాతలు ఎవరైనా కమర్షియల్‌గా మూవీ ఉండాలని కోరుకుంటారు. కానీ మేము మాత్రం ఈ సినిమా విషయంలో రిస్క్ చేసినా పర్వాలేదు అనేంతగా ఈ స్టోరీ నచ్చింది. లవ్ స్టోరీస్‌ను ఎవరో ఒకరి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలి. ఈ కథ హీరోయిన్ కోణంలో ఉంటుంది. అలాంటప్పుడు స్టార్స్‌ను ఈ మూవీకి హీరోగా తీసుకోలేం. మంచి పెర్ఫార్మర్ కావాలి. దీక్షిత్ మంచి పెర్ఫార్మర్. రష్మిక లాగే తన క్యారెక్టర్‌లో ఆకట్టుకునేలా నటించాడు. సినిమా చూశాక అందరూ దీక్షిత్ గురించి మాట్లాడుకుంటారు. ఈ సినిమాను మేమే సొంతంగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. థియేట్రికల్‌గా ఈ మూవీ బాగా వర్కవుట్ అవుతుందని ఎంతగానో నమ్ముతున్నాం. గతంలో రాహుల్ చేసిన ప్రాజెక్ట్స్ గురించి కాకుండా.. కథ బాగా నచ్చి ఈ మూవీ ప్రొడ్యూస్ చేశాం. రష్మిక ఈ సినిమాకు రెమ్యునరేషన్ తీసుకోలేదు కాబట్టి.. ఆ కృతజ్ఞతతో రెట్టింపు పారితోషికం ఇస్తున్నాం. అనూ ఇమ్మాన్యుయేల్ ఇందులో చాలా మంచి రోల్ చేసింది. తనది గెస్ట్ రోల్ కాదు.. అంత కంటే పెద్ద క్యారెక్టర్. మామూలుగా సినిమా రిలీజ్ అంటే చివరి వరకు టెన్షన్ పడుతుంటాం. కానీ ఈ సినిమా విషయంలో మేము నమ్మింది స్క్రీన్ మీద కనిపిస్తోంది. సో.. హ్యాపీగా టెన్షన్ లేకుండా ఉన్నాం. అలాగే రిలీజ్‌కు కూడా మంచి డేట్ దొరికింది. రెండు రోజుల ముందే ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నాం. ఎప్పుడు అనేది త్వరలోనే డేట్స్ అనౌన్స్ చేస్తాం’’ అని తెలిపారు.

Also Read- Biker First Lap: ‘గెలవడం గొప్ప కాదు.. చివరిదాకా పోరాడటం గొప్ప’.. ‘బైకర్’ గ్లింప్స్ ఎలా ఉందంటే?

మరో నిర్మాత విద్య కొప్పినీడి మాట్లాడుతూ

‘‘ఈ సినిమా కథ విన్నప్పుడే మేము స్టోరీకి బాగా కనెక్ట్ అయ్యాం. ఇది రెగ్యులర్ కమర్షియల్ స్టోరీ అయితే కాదు. ఈ సినిమా చూశాక ప్రతి ఒక్కరూ ఒక మెసేజ్‌ను తీసుకుంటారు. సెన్సార్ వాళ్ల దగ్గర నుంచి డైరెక్టర్‌కు నేషనల్ అవార్డ్ దక్కుతుందనే ప్రశంసలు వచ్చాయంటే ఇందులో ఉన్న కంటెంట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ప్రతి డెసిషన్ కలెక్టివ్‌గా డిస్కస్ చేసి తీసుకున్నాం. స్టోరీస్ సెలెక్షన్ విషయంలోనూ నిర్మాతలిద్దరం ఉమ్మడిగానే నిర్ణయాలు తీసుకుంటాం. మా ప్రాజెక్ట్ వెనక అరవింద్ సార్ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. వుమెన్ సెంట్రిక్ అని కావాలని సెలెక్ట్ చేసుకున్నది కాదు.. కథ ఆ తరహాలో నడుస్తుంది. రియల్ ఇన్సిడెంట్స్‌తో ఇన్స్‌పైర్ అయి కథ రాసినా, మిగతా అంతా స్క్రిప్ట్ చేసుకున్నదే. సినిమా బిగినింగ్‌లోనే హేషమ్‌ను మ్యూజిక్ డైరెక్టర్‌గా ఫిక్స్ అయ్యాం. ఆయన మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఇందులో నాలుగు సాంగ్స్, రెండు బిట్ సాంగ్స్ ఉంటాయి. ఇది వుమెన్ సెంట్రిక్ మూవీ కాదు. కాలేజ్ బ్యాక్ డ్రాప్‌లో సాగే ప్రేమ కథ. సినిమా చూసిన ప్రేక్షకులంతా ఈ కథకు బాగా రిలేట్ అవుతారు. తమకు తెలిసిన వారి ప్రేమ కథలు వారికి గుర్తొస్తాయి. ఈ ప్రాజెక్ట్ సమంతతో చేయాలని అనుకోలేదు. ఈ స్క్రిప్ట్‌కు రష్మిక అయితే బాగుంటుందని అనుకున్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకటికి పదిసార్లు ఆలోచించిని తర్వాతే ప్రాజెక్ట్స్ టేకప్ చేస్తున్నాం. మాకు అరవింద్ సార్ ఇచ్చే సలహా కూడా అదే’’ అని చెప్పుకొచ్చారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Prashanth Varma: ప్రశాంత్ వర్మ.. అసలేం జరుగుతుంది?

Premante Teaser: పోలీస్ హెడ్ కానిస్టేబుల్‌గా సుమ.. ‘ప్రేమంటే’ టీజర్ ఎలా ఉందంటే?

Varanasi: ‘వారణాసి’ టైటిల్ పాయె.. మహేష్, రాజమౌళి టైటిల్ ఏంటో?

Rajasekhar: నాకు ఆ వ్యాధి ఉంది.. ఓపెన్‌గా చెప్పేసిన యాంగ్రీమ్యాన్!

Crime News: మూడు రోజుల్లో వీడిన హత్య కేసు మిస్టరీ.. ఎలా పసిగట్టారంటే?