Hyderabad ( IMAGE CREDIT: SWETCHA REPORER)
హైదరాబాద్

Hyderabad: హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యకు శాశ్వతంగా చెక్.. మెట్రోకు సమాంతరంగా రెండు ఫ్లై ఓవర్లు!

Hyderabad: గ్రేటర్ హైదరాబాద్ లో నిత్యం రద్దీగా ఉండే జంక్షన్లలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టేలా సర్కారు మరో అడుగు ముందుకేసింది. ఇప్పటికే హెచ్ సిటీ కింద అయిదు ప్యాకేజీలుగా 23 ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సర్కారు ఇపుడు ఉప్పల్ జంక్షన్ లో వాహన రాకపోకలు మరింత వేగంగా కదిలేలా హబ్సిగూడలో మెట్రోరైలుకు సమాంతరంగా రెండు ఫ్లై ఓవర్ వంతెనలను నిర్మించేందుకు లైన్ క్లియర్ చేసింది.

 Also Read:NIMS Hyderabad: విద్యార్థి మృతికి ఉద్యోగులే కారణమా?.. నిమ్స్‌పై స్వేచ్ఛ వరుస కథనాలు

ఫ్లై ఓవర్లను నిర్మించి చెక్ పెట్టేందుకు సిద్దం

ఉప్పల్ జంక్షన్ లో ఇప్పటికే పాదచారుల కోసం జంక్షన్ చుట్టూ స్కై వేను నిర్మించి పాదచారులకు సౌలభ్యం కల్పించిన సర్కారు ఇపుడు రోడ్డు మార్గం గుండా ప్ర్రయాణించే వాహనదారుల ట్రాఫిక్ కష్టాలకు మరో రెండు ఫ్లై ఓవర్లను నిర్మించి చెక్ పెట్టేందుకు సిద్దమైంది. ముఖ్యంగా హబ్సిగూడ నుంచి నాగోల్ వరకు, నాగోల్ నుంచి హబ్సిగూడ వరకు ఒక్కో ఫ్లై ఓవర్ ను మూడు లేన్లుగా, రెండు ఫ్లై ఓవర్లను ఆరు లేన్లుగా నిర్మించాలన్న ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేస్తూ ఇటీవలే జీఓ నెం. 400 ను విడుదల చేసింది. ఇప్పటికే జీహెచ్ఎంసీ ఈ ప్రతిపాదనలను తయారు చేయగా, ఇందుకు ప్రభుత్వం ఆమోదం తెలపటంతో త్వరలోనే టెండర్ల ప్రక్రియను చేపట్టేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం. జీహెచ్ఎంసీ మొత్తం రూ. 657 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప

వేగవంతం కానున్న రాకపోకలు

నిత్యం రద్దీగా ఉండే ఉప్పల్ జంక్షన్ లో మెట్రో కారిడార్ కు సమాంతరంగా కుడి, ఎడమ వైపు హబ్సిగూడ నుంచి నాగోల్ వరకు నిర్మించనున్న రెండు ఫ్లై ఓవర్ల నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వస్తే ఉప్పల్ జంక్షన్ నుంచి వాహనరాకపోకలు మరింత వేగవంతమయ్యే అవకాశముంది. ప్రస్తుతం హబ్సీగూడ నుంచి ఉప్పల్ జంక్షన్ మీదుగా నాగోల్ వెళ్లే ప్రయాణికులు తీవ్ర ట్రాఫిక్ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ రెండు ఫ్లై ఓవర్లు అందుబాటులోకి వస్తే హబ్సీగూడ, నాగోల్ మధ్య రాకపోకలు వేగంగా సాగి ట్రాఫిక్ సమస్య తగ్గటంతో వాహనదారుల సమయం, ఇంధనం ఆదా అయ్యే అవకాశాలున్నాయి. ఉప్పల్ జంక్షన్ లోని ట్రాఫిక్ సమ్సయ ఎఫెక్టు హబ్సిగూడ, తార్నాక, ఉప్పల్ నేషనల్ హైవేలపై చాలా వరకు తగ్గే అవకాశముంది.

 Also Read: Hyderabad: గంజాయి మత్తులో ఓ కిరాతకుడు.. చిన్నారిపై అఘాయిత్యం.. ఎక్కడంటే?

Just In

01

Telugu Directors: ఈ ఇద్దరి తెలుగు దర్శకుల భవితవ్యం ఏమిటి?

Natural Star Nani: రామ్ చరణ్‌కు పోటీగా.. మెగా ఫ్యాన్స్‌ని ఇరకాటంలో పెట్టిన నాని!

Mahesh and Rajamouli: మహేష్ బాబు, రాజమౌళి మధ్య ఆసక్తికర సంభాషణ.. సోషల్ మీడియా షేక్!

The Brain: మరోసారి హీరోగా అజయ్.. హిట్ కొడతాడా? జానర్ ఇదే!

Rajashekar: అది లేకపోతే జైల్లో ఉన్నట్టే ఉంటుంది.. ‘కె ర్యాంప్’‌ సాంగ్‌‌పై కూడా వేసేశాడు