Viral News: ప్రస్తుతం సర్టిఫికేట్ యుగం నడుస్తోంది. మనిషి కళ్లముందే ఉన్నప్పటికీ దానిని ధ్రువీకరించే పత్రాలను ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకుల్లో సమర్పించాల్సిన పరిస్థితులను చూస్తూనే ఉన్నాం. ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, పాన్ కార్డ్, బర్త్ సర్టిఫికేట్ ఇలా ప్రతీ మనిషి జీవితంలో భాగమైపోయాయి. ఆఖరికి మనిషి మరణించిన తర్వాత కూడా దానిని ధ్రువీకరించేందుకు మళ్లీ డెత్ సర్టిఫికేట్ కూడా అవసరం అవుతుంటుంది. అలాంటి డెత్ సర్టిఫికేట్ గురించి ఓ మనిషి బతికుండగానే ప్రకటన ఇవ్వడం.. నెట్టింట వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళ్తే…
డెత్ సర్టిఫికేట్ కు సంబంధించిన ఓ న్యూస్ పేపర్ ప్రకటన ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ఒక వ్యక్తి తన డెత్ సర్టిఫికేట్ పోయిందంటూ ఏకంగా పేపర్ లోనే ప్రకటన ఇవ్వడం నవ్వులు పూయిస్తోంది. ఆ ప్రకటనకు సంబంధించిన క్లిప్ ను చూసి.. నెటిజన్లు నవ్వు ఆపుకోలేకపోతున్నారు. ఆ యాడ్ ఇచ్చిన వ్యక్తిని ఉద్దేశించి సరదాగా స్పందిస్తున్నారు. సర్గానికి వెళ్లేందుకు డెత్ సర్టిఫికేట్ ను సమర్పించాలా? అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.
ప్రకటనలో ఏముందంటే?
డాక్టర్ అజయిత ఈ ప్రకటనకు సంబంధించిన క్లిప్ ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ ప్రకటన 2022 సెప్టెంబర్ 7న ప్రచురితమైన పేపర్ కు సంబంధించినది. అసోం రాష్ట్రానికి చెందిన లూమ్డింగ్ బజారులో తన డెత్ సర్టిఫికేట్ పోయినట్లు రంజిత్ కుమార్ చక్రవర్తి అనే వ్యక్తి ప్రకటనలో తెలియజేశాడు. ఈ క్లిప్ ను చూసి కొందరు నెటిజన్లు గందరగోళానికి గురయ్యారు. డెత్ సర్టిఫికేట్ అనేది మరణించిన తర్వాత ఇస్తారు కదా? అని ప్రశ్నిస్తున్నారు. మరి ఆ వ్యక్తి ఏ విధంగా డెత్ సర్టిఫికేట్ పోయిందని ప్రకటన ఇచ్చారో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారు.
Also Read: Viral Video: సెలైన్ బాటిల్‌తో వీధుల్లో తిరిగిన రోగి.. అంత అర్జంట్ పని ఏంటో? ఇదిగో వీడియో
నెటిజన్ల రియాక్షన్..
డెత్ సర్టిఫికేట్ ప్రకటనపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘ఈ ఘటన చూస్తే భూతాలు ఉన్నట్లు నిరూపితమవుతోంది’ అని ఓ వ్యక్తి పోస్ట్ చేశాడు. ‘మీ డెత్ సర్టిఫికేట్ దొరికింది సార్.. వచ్చి తీసుకెళ్లండి’ అని మరొక వ్యక్తి ఫన్నీ కామెంట్ చేశాడు. ‘చనిపోయిన వారు కూడా ప్రకటనలు ఇస్తారా?’ అని మరో వ్యక్తి సందేహం వ్యక్తం చేశాడు.
India is definitely not for beginners… pic.twitter.com/hbZNBb53u6
— Dr. Ajayita (@DoctorAjayita) October 30, 2025
