Prabhas Comments On Amitabh And KamalHaasan Kalki Pre Release Event
Cinema

Pre Release: కల్కి ఈవెంట్‌లో ఫన్నీ మూమెంట్స్‌ 

Prabhas Comments On Amitabh And KamalHaasan Kalki Pre Release Event: పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా, నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న లేటెస్ట్ మూవీ కల్కి 2898 ఏడీ. ఈ మూవీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా జూన్ 27న గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. ఈ నేపథ్యంలో ముంబైలో బుధవారం సాయంత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను మూవీ యూనిట్ గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో ప్రభాస్‌తో పాటు అమితాబ్‌బచ్చన్, కమల్ హాసన్‌, దీపికాపదుకొణె, హీరో రానా దగ్గుబాటితో పాటు ఇతర నటీనటులు సందడి చేశారు.

ఈ సందర్భంగా ఇంట్రెస్టింగ్‌ సీన్ అందరినీ ఆకట్టుకుంది. అదేంటంటే ఈ ఈవెంట్‌కు హాజరైన బాలీవుడ్‌ స్టార్‌ నటి దీపిక పదుకొణె ప్రస్తుతం ప్రెగ్నెంట్‌ అన్న విషయం తెలిసిందే. మరికొన్ని రోజుల్లో ఆమె బిడ్డకు జన్మనివ్వబోతోంది. బేబీ బంప్‌తోనే ఈవెంట్‌కు హాజరైన దీపిక స్టేజ్‌పైకి వెళ్లేటప్పుడు, దిగేటప్పుడు కాస్త ఇబ్బందిపడ్డారు. ఆ టైమ్‌లో బిగ్‌బీ, ప్రభాస్‌ దీపికకు సాయం చేశారు. ముందుగా ఈవెంట్‌కు వచ్చిన వారిని స్టేజ్‌పైకి రానా ఆహ్వానించారు. అమితాబ్‌, ప్రభాస్‌ వెళ్లగా దీపికను కూడా స్టేజ్‌పైకి రమ్మన్నారు. ఆ టైమ్‌లో దీపిక స్టేజ్‌ మెట్లు ఎక్కేటప్పుడు అమితాబ్‌ ఆమె చేయి పట్టుకుని సాయం చేశారు.

Also Read: ఓటీటీలోకి ఎంట్రీ

అనంతరం మాట్లాడటం అయిపోయాక స్టేజ్‌ దిగేటప్పుడు ప్రభాస్‌ దీపికకు సాయం చేశారు. అయితే ప్రభాస్ దీపిక చేతులు పట్టుకునేటప్పుడు అమితాబ్‌ వెనకాల నేను చేయి పట్టుకుంటా అన్నట్లుగా ప్రభాస్‌ని గట్టిగా పట్టుకోవడంతో దీపిక నవ్వుతుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

Just In

01

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?