Snakes: ఈ ప్రపంచంలో ఎన్నో రకాల పాములు ఉన్నాయి. వాటిలో అన్నీ ఒకేలా ఉండవు. ఇవి చూడటానికి ఒక్కో రకం, ఒక్కో రంగును కలిగి ఉంటాయి. వాటిలో కొన్ని విషం ఉన్నవి, విషం లేనివి, గాల్లో ఎగిరేవి కూడా ఉన్నాయి. సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదొక పాము వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. అయితే, ఇప్పుడు చెప్పుకునే పాము గూడు కూడా కట్టుకుంటుంది. ఏంటి పాము గూడు కట్టుకుంటుందా అని ఆలోచిస్తున్నారా? అవును మీరు వింటున్నది నిజమే. మరి ఆ పాము ఏంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..
అడవిలో సింహం రాజైతే, పాముల లోకంలో కింగ్ కోబ్రా. ఇది కేవలం విషపూరితమైనది మాత్రమే కాదు తెలివైనది కూడా. ఇతర పాములను వేటాడి తినేస్తుంది, దాని పేరు కూడా అందుకే వచ్చింది “స్నేక్ ఈటర్” అని. వేటకు దిగేటప్పుడు ఇది హై అలర్ట్ మోడ్‌లో ఉంటుంది. ఒక్క సెకనులోనే దాడి చేసి, గురి తప్పకుండా కాటేస్తుంది. ఇక దీని మెమరీ పవర్ కూడా అద్భుతమనే చెప్పుకోవాలి. తనను పెంచిన వ్యక్తిని గుంపులో ఎన్ని సంవత్సరాలైనా గుర్తుపెట్టుకుంటుంది. మగ కింగ్ కోబ్రాలు తమ అన్నీ బాగా గుర్తుంచుకుంటాయి. వేరే పాములు వాటి లైన్ దగ్గరకు వస్తే దాటితే బయటకు తరిమేస్తాయి.
ఆడ కోబ్రాలు చాలా స్పెషల్
ప్రపంచంలో గూడు కట్టే ఏకైక పామ ఇదే. ఆకులు, కొమ్మలు, మట్టి సేకరించి ఒక చక్కటి నెస్ట్ తయారు చేసుకుంటుంది. గుడ్లు పెట్టి, వాటిని కాపలాగా కాస్తుంది. ఎవరైనా దగ్గరికి వస్తే, దాడి చేయడానికి సిద్ధంగా ఉంటుంది. 18 అడుగుల వరకు పెరిగే ఈ రాక్షసి 20 సంవత్సరాల వరకు బ్రతుకుతుంది. న్యూరోటాక్సిన్ – ఒక్క కాటుతో నాడీ వ్యవస్థను పక్షవాతం చేస్తుంది. నొప్పి, మూర్ఛ, కోమాలోకి వెళ్తారు. చికిత్స ఆలస్యమైతే ప్రాణం పోవచ్చు. ఇది మనుషుల్ని సాధారణంగా ఏమి చేయదు. వాటిని బెదిరించినప్పుడే దాడి చేస్తుంది. అడవి రాజు కాబట్టి, కాబట్టి జాగ్రత్తగా ఉండండి.
