Gam Gam Ganesha Streaming On Amazon Prime
Cinema

Gam Gam Ganesha: ఓటీటీలోకి ఎంట్రీ

Gam Gam Ganesha Streaming On Amazon Prime: టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్‌ దేవరకొండ మెయిన్‌ రోల్‌లో యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ గం..గం..గణేశా. ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక, ఇమ్మాన్యుయేల్, వెన్నెల కిషోర్, రాజ్ అర్జున్, సత్యం రాజేష్ త‌దిత‌రులు ఈ మూవీలో కీ రోల్స్‌ పోషించారు. ఫ‌న్ అండ్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన‌ ఈ మూవీని హై-లైఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై కేదార్‌ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మించారు.ఉదయ్‌ శెట్టి ఈ మూవీతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చాడు.

రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో వ‌చ్చిన ఈ మూవీ మే 31న ఆడియెన్స్ ముందుకు వ‌చ్చి మంచి విజ‌యాన్ని అందుకుంది. ఇప్పుడు తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ప్ర‌ముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ ప్ర‌స్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఈ మూవీ స్టోరీ మ్యాటర్‌కి వ‌స్తే గణేశ్ ఒక అనాథ. త‌న స్నేహితుడు ఇమాన్యూయల్‌తో క‌లిసి చిన్నప్పటినుంచే దొంగతనాలు చేయడం స్టార్ట్ చేస్తాడు. మ‌రోవైపు శ్రుతితో ప్రేమలో ఉంటాడు.

Also Read: అమ్మవారి లుక్‌లో నటి, వైరల్‌ ఫొటోస్‌

అయితే శ్రుతి మాత్రం తనకు బెటర్ ఆప్షన్ దొరకగానే గణేశ్‌ని వ‌దిలి వెళ్లిపోతుంది. అయితే ఈ క్ర‌మంలోనే గ‌ణేష్ అనుకోకుండా ఒక డైమండ్‌ను దొంగ‌త‌నం చేస్తాడు. ఆ డైమండ్ కోసం ఒక గ్యాంగ్ గ‌ణేష్ వెంట‌ప‌డుతుంది. ఈ క్ర‌మంలో ఆ డైమండ్ కోసం గణేశ్ ఏం చేశాడు ?, అసలు ఆ డైమండ్ ముంబై నుంచి తెస్తున్న గణేశ్ విగ్రహంలోకి ఎలా వెళ్ళింది ?, మరో వైపు అదే గణేశ్ విగ్రహంలోకి 100 కోట్లు ఎలా వచ్చాయి ? అనేది ఈ మూవీ స్టోరీ. అయితే ఈ మూవీ స్టోరీ గురించి మరిన్ని వివరాలు తెలియాలంటే ఈ మూవీని తప్పకుండా చూడాల్సిందే.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!