Nalgonda District: ఒకప్పుడు డాక్టర్ అంటే ‘వైద్యో నారాయణో హరి’ అని పూజించేవారు. ఇప్పుడు వైద్యుడు అంటే పేదల నుంచి డబ్బులు కొల్లగొట్టడమేనని ఆరోపిస్తున్నారు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ నల్లగొండ జిల్లా (Nalgonda District)లో తిరుమలగిరి (సాగర్) మండలం ఎల్లాపురం తండాలో చోటు చేసుకున్న ఘటనతో రుజువు అవుతోంది. ఆసుపత్రికి వచ్చిన రోగులను సకాలంలో సరైన వైద్యం అందించి ఆదుకోవాల్సిన వైద్యులే డబ్బుకు ఆశపడి వైద్యులకు ఉన్న గౌరవాన్ని తుంగలో తొక్కుతున్నారు. కుగ్రామాల్లోని అమాయక, నిరుపేద కుటుంబాలను వంచించి వారికి జన్మించిన శిశువులను వైద్యులు స్వయంగా మధ్యవర్తిత్వం చేస్తూ లక్షలకు లక్షలు తీసుకొని విక్రయాలు జరుగుతున్నారు. ప్రస్తుతం ఈ విధానం నూతన ఆదాయ ఒరవడిగా వైద్యులు మార్చుకోవడం సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తుంది.
Also Read:Nalgonda district: కాలుష్యం వెదజల్లుతున్న రైస్‌మిల్లులు.. పట్టించుకొని అధికారులు
డాక్టరే బ్రోకర్
వైద్యం అందించి అనారోగ్యంతో ఉన్న వారిని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాల్సిన వైద్యురాలే స్వయంగా బ్రోకర్ గా మారి నవజాత శిశువులను విక్రయిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటనల్లో ఇటీవల నల్లగొండ జిల్లాలో జరిగిన ఘటనలో హాలియా లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో డ్యూటీ డాక్టర్ గా పనిచేస్తున్న మట్ట శాంతి ప్రియ స్వయంగా మహిళా వైద్యురాలే మీడియేటర్ గా వ్యవహరించి నిరుపేద కుటుంబ దంపతులు కొర్ర బాబు స్వాతి ల ఐదవ సంతానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లాకు చెందిన కడలి సాంబమూర్తి.. రజిత దంపతులకు రూ.3.30 లక్షలకు 15 రోజుల క్రితం విక్రయించింది.
అంతకుముందు మగ శిశువు రూ.4.5 లక్షలకు విక్రయం
ఇటీవల నల్లగొండ జిల్లాలో శిశువు విక్రయం కలకలం రేపింది. ఈ ఘటనలో ఐసిడిఎస్ సూపర్వైజర్ ఫిర్యాదుతో నల్లగొండ వన్ టౌన్ లో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. ఈ క్రమంలోనే మహిళా వైద్యురాలు శాంతి ప్రియ గతంలోనూ ఒడిశా ప్రాంతానికి చెందిన దంపతుల 21 రోజుల మగ శిశువును కూడా విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు.
రెండు కేసుల్లో ఏడుగురి అరెస్ట్ నల్లగొండ జిల్లా కేంద్రంలోని నిర్మల్ ఆసుపత్రి కేంద్రంగా శిశువుల విక్రయాల రెండు కేసుల్లో ఏడుగురుని అరెస్టు చేసినట్లు ఎస్పి శరత్ చంద్ర పవర్ తెలిపారు. రెండో కేసులోని తల్లిదండ్రులు ఇద్దరు వరారీలో ఉన్నట్లు వివరించారు.
Also Read:Jangaon District: జనగామ జిల్లాలో క్షుద్ర పూజలు? యువతి టార్గెట్ అంటూ చర్చ?
