Dhananjoy-Gope (Image source Twitter)
జాతీయం, లేటెస్ట్ న్యూస్

Former Maoist: ఆరేళ్లక్రితం లొంగిపోయిన మావోయిస్టు.. ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా.. ఫొటో ఇదిగో

Former Maoist: లొంగిపోయిన మావోయిస్టులలో కొందరి జీవితాలు నిజంగా ఆదర్శప్రాయంగా మారతాయి. ఒకప్పుడు తుపాకీతో అడవుల్లో తిరిగిన వారు, సమాజ సేవకులుగా మారి కొత్త బాటలో పయనిస్తారు. ప్రభుత్వం అందించిన పునరావాస పథకాలను సద్వినియోగం చేసుకుంటూ, విద్య, ఉపాధి, సామాజిక సేవ రంగాల్లో ప్రతిభ చాటుతుంటారు. తమ అనుభవాలను పంచుకుంటూ జన స్రవంతిలోకి రావాలంటూ మరికొందరిని ప్రోత్సహిస్తుంటారు. హింసామార్గం ఎప్పటికీ శాంతిని ఇవ్వదని, లక్ష్యాన్ని చేరుకోనివ్వదని తమ ప్రయాణం ద్వారా సమాజానికి స్ఫూర్తినిస్తుంటారు. అలాంటి కోవకే చెందుతాడు ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాకు చెందిన మాజీ మావోయిస్టు (Former Maoist) ధనంజయ్ గోపే. ఆయనకు అలియాస్ సుధీర్ అనే పేరు కూడా ఉంది. ఆరేళ్ల క్రితం తుపాకీని పక్కనపెట్టి జనజీవన స్రవంతిలో కలిసిన ఆయన ప్రస్తుతం సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఆయనకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆపరేషన్ కగార్ నేపథ్యంలో, మావోయిస్టులు పెద్ద సంఖ్యలో లొంగిపోతున్న తరుణంలో ధనంజయ్ గోపే ప్రయాణం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Read Also- Ramchander Rao: బీజేపీకి భయపడే సీఎం స్వయంగా ప్రచారానికి దిగారు.. రాంచందర్ రావు కీలక వ్యాఖ్యలు

Dhananjoy-Gope (Image source Twitter)
Dhananjoy-Gope (Image source Twitter)

14-15 ఏళ్లపాటు అడవిలోనే..

ధనంజయ్ గోపే దాదాపుగా 14- 15 ఏళ్లపాటు మావోయిస్టు కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నాడు. తనపై ఉన్న 5 లక్షల రూపాయల నగదు బహుమతితో 2019 ఫిబ్రవరిలో కోరాపుట్ పోలీసుల ముందు లొంగిపోయాడు. ప్రస్తుతం మల్కన్‌గిరి బ్లడ్ బ్యాంక్‌లో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. అంటే, తాను ఒకప్పుడు వ్యతిరేకించిన సమాజానికే ఇప్పుడు భద్రత కల్పించే డ్యూటీ చేస్తుండడం గమనార్హం. మావోయిస్టుల్లో పనిచేస్తున్నప్పుడు గుమ్మా ఏరియా కమిటీకి డివిజనల్ కమిటీ సభ్యుడిగా, 2009లో బలిమెల ఏరియాలో క్రియాశీలక సభ్యుడిగా పనిచేశాడు. ఇతడిపై నమోదైన నేరాలలో హత్య, దహనం వంటి అనేక హై ప్రొఫైల్ కేసులు కూడా ఉండేవి. జనజీవన స్రవంతిలో కలవాలని నిర్ణయించుకున్న అతడు, ఒడిశా సౌత్-వెస్ట్రన్ రేంజ్ డీఐజీ . హిమాన్షు లాల్ ముందు లొంగిపోయాడు.

Read Also- Commissioner Sudheer Babu: ప్రజలు కూడా యూనిఫాం లేని పోలీసులే.. రాచకొండ కమిషనర్ సుధీర్​ బాబు

బలిమెల ప్రాంతానికే చెందిన మరో మాజీ మావోయిస్టు రామ మడ్కామి, అలియాస్ దినేష్ జీవితం కూడా దాదాపుగా ఇదే విధంగా ఉంది. దినేష్ 2015లో పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ప్రస్తుతం మల్కన్‌గిరి హాస్పిటల్‌లో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. దినేష్ గతంలో మల్కన్‌గిరి కోరాపుట్ సరిహద్దు డివిజన్‌లో క్రియాశీలక సభ్డిగా పనిచేశాడు. ప్రస్తుతం జనజీవన స్రవంతిలో కలిసిన తర్వాత తమ జీవితం పట్ల వీరిద్దరూ సంతృప్తిని వ్యక్తం చేశారు. అడవుల్లో ఉన్న మావోయిస్టులు కూడా లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాని వారిద్దరూ పిలునిచ్చారు.

 

Just In

01

Kasibugga Temple Stampede: కాశీబుగ్గ తొక్కిసలాట.. 9 మంది దుర్మరణం.. దుర్ఘటన వెనుక 11 కారణాలు ఇవే!

Swetcha Effect: స్వేచ్ఛ ఎఫెక్ట్.. ధరల నియంత్రణపై స్పందించిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు

Peddi: అచ్చియమ్మగా జాన్వీ కపూర్.. డబుల్ ట్రీట్ ఇచ్చిన మేకర్స్!

Kasibugga Temple Tragedy: ప్రైవేటు ఆలయం అంటే ఏమిటి?, కాశీబుగ్గ తొక్కిసలాట ప్రభుత్వానికి సంబంధం లేదా?

Ekadashi: పెళ్ళి కానీ యువతులు ఏకాదశి రోజున తల స్నానం చేయడకూడదా?