Ponnam Prabhakar: మొంథా” తుఫాను ప్రభావం తో కురుస్తున్న భారీ వర్షాలతో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. రైతులకు నష్టం వాటిల్లకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వ్యవసాయ, మార్కెటింగ్, రెవిన్యూ, డిఆర్డీఓ సంబందిత శాఖల అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలకు రైతులు తరలించిన వరి ధాన్యం నిల్వలతో పాటు ఆయా ప్రాంతాల్లో ఆరబెట్టిన పంట ధాన్యం వర్షానికి తడిసి నష్టపోకుండా రైతులకు టార్పాలిన్లను అందుబాటులో ఉంచాలని సూచించారు.
రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలి
తుపాను ప్రభావం గురించి రైతులకు తెలియజేస్తూ, అప్రమత్తం చేయాలని తెలిపారు. తుఫాన్ ప్రభావం తగ్గే వరకు వరి కోతలు జరపకుండా రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాల నుండి మిల్లులకు ధాన్యం పంపిన వెంటనే దిగుమతి చేసుకునేలా అధికారులు పర్యవేక్షణ జరపాలని, వెంటవెంటనే ట్రక్ షీట్లు తెప్పించుకుని ట్యాబ్ ఎంట్రీలు చేయించాలని అధికారులను ఆదేశించారు.తడిసిన ధాన్యం పాడవకుండా రైతులు వ్యవసాయ అధికారులు సూచించే పద్ధతులు పాటించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
Also Read: Ponnam Prabhakar: తెలంగాణలో రవాణాశాఖ చెక్కు పోస్టులు రద్దు చేశాం.. మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం
