Medak district ( image credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Medak district: నర్సాపూర్ అటవీ.. ఏకో పార్కు ప్రాంతాన్ని పరిశీలించిన : కలెక్టర్ రాహుల్ రాజ్

Medak district: కాటేజీలు రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మాత్యులు శ్రీమతి కొండా సురేఖ, గారి చేతుల మీదుగా త్వరలో ప్రారంభోత్సవానికి అటవీ శాఖ ఆధ్వర్యంలో చేస్తున్న ఏర్పాట్లను  కలెక్టర్ డీఎఫ్ఓ జోజి అటవీ శాఖ సిబ్బందితో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  నర్సాపూర్ ఎకో పార్క్ కాటేజీలు సాధ్యమైనంత త్వరగా యాత్రికులకు అందుబాటులోకి తీసుకు రావడానికి అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు.

 Also ReadMedak District: మహిళను చీరతో చెట్టుకు కట్టేసి అత్యాచారం.. మెదక్ జిల్లాలో దారుణ ఘటన

ఆహ్లాదకరమైన వాతావరణం

నర్సాపూర్ ఎకో పార్క్లో యాత్రికుల సౌకర్యార్థం సుమారు 42 కాటేజీలు పి.పి.పి మోడ్ లో అటవీ శాఖ మరియు ప్రైవేట్ యాజమాన్య సహకారంతో నిర్మాణాలు పూర్తిచేసుకుని త్వరలో ప్రారంభించుకుని యాత్రికులకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. నర్సాపూర్ ఎకో పార్క్ ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటుందని, చూడ చక్కని ప్రాంతంగా వెలసిల్లుతూ యాత్రికుల మదిని కట్టిపడేస్తుందని ఆయన అన్నారు. ఎంతోమంది ప్రకృతి ప్రేమికులు, యాత్రికులు సెలవు దినాల్లో నర్సాపూర్ ఎకోపార్క్ సందర్శించి ఆహ్లాదకరమైన వాతావరణంలో కుటుంబ సభ్యులతో ఆ రోజంతా సంతోష దాయకంగా గడుపుతారని మరింత సౌకర్యాలు యాత్రికులకు కల్పించాలని ఉద్దేశంతో కాటేజీ నిర్మాణాలు ప్రభుత్వం చేపట్టిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్ఓ జోజి అటవీ శాఖ అధికారులు సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు. 

 Also Read: Medak District: స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ రిలీజ్‌.. మెదక్‌లో రాజుకున్న రాజకీయ వేడి!

Just In

01

Swetcha Effect: స్వేచ్ఛ ఎఫెక్ట్.. వసూళ్ల సార్ బాధితుల నుంచి వాంగ్మూలం సేకరణ

Cyclone Montha: మెుంథా తుపాను ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు వంకలు

Hydraa: 435 ఏళ్ల‌ చ‌రిత్ర కలిగిన పాత‌బ‌స్తీలోని చెరువుకు హైడ్రా పున‌రుద్ధ‌ర‌ణ‌

Maoists Killed: చత్తీస్‌ఘడ్ బీజాపూర్ జిల్లా సరిహద్దుల్లో పోలీసులు మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు

Singareni Collieries: సింగరేణిలో మెగా జాబ్ మేళా.. 23 వేల మందికి ఉద్యోగ అవకాశాలు