Suryapet News (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Suryapet News: ప్రతి ఒక్కరూ చట్టపరిధిలో నడుచుకోవాలి: ఎస్పీ నరసింహ

Suryapet News: మత్తు పదార్థాల భారీన పడి యువత తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ(SP Narasimha) సూచించారు. సోమవారం పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట(Suryapet) జిల్లా కేంద్రంలో జిల్లా పోలీసుల అధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. జై జావాన్ , జై కిసాన్, జై పోలీస్ అంటూ, పోలీసు అమరవీరుల ఆశయాలను సాధిస్తామని పౌరులతో కలిసి నినాదాలు చేశారు.

ప్రజలలో చిరస్మరణీయం

ఈ సందర్బంగా ఎస్పి నరసింహ మాట్లాడుతూ.. ప్రతి పౌరుడు పోలీసు(Police) అమరవీరుల త్యాగాలను స్మరించుకోవాలని, పోలీసు త్యాగాలకు గుర్తుగా ప్రతి ఒక్కరు సత్ప్రవర్తనతో చట్టానికి లోబడి నడుచుకోవాలని సూచించారు. పోలీసు అమరవీరులను అనునిత్యం స్మరించుకుంటూ, నిరంతరం ప్రజలలో చిరస్మరణీయంగా నిలిచిపోయేలా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ప్రస్తుత సమాజంలో డ్రగ్స్ అత్యంత ప్రమాదకరంగా మారిందని, వీటిని క్షేత్రస్థాయిలో నిర్మూలించడంలో పోలీసులు, పౌరులు, ప్రజలు భాగస్వామ్యం కావాలని కోరారు.

Also Read: Election Commission: జూబ్లీహిల్స్‌లో సోదాలు ముమ్మరం.. అభ్యర్థుల వెనక షాడో టీమ్‌లు

యువత చెడు మార్గంలో..

యువత దేశ భవిష్యత్తని, యువత చెడు మార్గంలో వెళ్ళవద్దని గాంజా, డ్రగ్స్ కు అలవాటు పడవద్దని ఎస్పీ కోరారు.ఈ కార్యక్రమంలో అధనపు ఎస్పి రవీందర్ రెడ్డి(ASP Ravindhar), జనార్ధన్ రెడ్డి లతో అడ్మిన్ అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, AR అధనపు ఎస్పి జనార్ధన్ రెడ్డి, సూర్యాపేట డివిజన్ DSP ప్రసన్న కుమార్, AR DSP నరసింహ చారి, పోలీస్ సంఘం అధ్యక్షులు రామచందర్, CI లు, RI నారాయణ రాజు, SI లు, RSI లు k అశోక్, ఎం అశోక్, సురేష్, సాయిరాం, రాజశేఖర్, యువత, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Also Read: Adivasi Protest: లంబాడీలకు వ్యతిరేకంగా ఆదివాసీల ఆందోళన.. అడ్డుకున్న పోలీసులు

Just In

01

Mass Jathara Trailer: మాస్ విందుకు రెడీ అయిపోండమ్మా.. ఇక వార్ జోనే!

Bad Boy Karthik: అందమైన ఫిగరు నువ్వా.. హీరోయిన్‌ని నాగశౌర్య అలా అడిగేశాడేంటి?

Telangana Handloom Crisis: 12 ఏళ్లుగా నేతన్నల నెత్తిన పాలకవర్గాల పిడుగు! పుష్కర కాలంగా ఇన్‌‌ఛార్జ్‌ల అరాచకం!

Chiranjeeva Trailer: రాజ్ తరుణ్ ‘చిరంజీవ’ ట్రైలర్ ఎలా ఉందంటే..

Huzurabad: హుజూరాబాద్‌లో కాంగ్రెస్ నేత సుడిగాలి పర్యటన.. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ