Election Commission (imagecredit:swetcha)
తెలంగాణ, హైదరాబాద్

Election Commission: జూబ్లీహిల్స్‌లో సోదాలు ముమ్మరం.. అభ్యర్థుల వెనక షాడో టీమ్‌లు

Election Commission: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ పూర్తికావటంతో ఇక బరిలో నిలిచిన అభ్యర్థుల ఎన్నికల ప్రచార వ్యయంతో జిల్లా ఎన్నికల అధికారులు దృష్టి సారించారు. ఉప ఎన్నిక ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు వీలుగా కేంద్రం నుంచి వచ్చిన వ్యయ, సాధారణ, పోలీస్(Police) ఎన్నికల పరిశీలకులు వ్యూహాం సిద్దం చేశారు. నేటి నుంచి అభ్యర్థుల వెనకా షాడో టీమ్ లను వెంబడించేలా ఏర్పాట్లు చేశారు. వీరిలో కేంద్రం నుంచి వచ్చిన పోలీస్ పరిశీలకుడు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోనున్న 65 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లను నేరుగా పరిశీలించి, అక్కడ చేపట్టాల్సిన భద్రత ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నట్లు తెలిసింది. క్రిటికల్ పోలింగ్ స్టేషన్లతో పాటు ఇతర పోలింగ్ స్టేషన్ల వద్ద మొత్తం 1666 మంది పోలీసులు వివిధ రకాల బందోబస్తు విధులు నిర్వహించనున్నారు. వ్యయ, సాధారణ పరిశీలకులు అభ్యర్థుల ప్రచారంలో ఎక్కడైనా ఓటర్లను మభ్య పెడుతున్నారా? ఎక్కడైనా నగదు, మద్యం పంపిణీ చేస్తున్నారా? అన్న విషయంపై పూర్తి స్థాయిలో నిఘా పెట్టినట్లు సమాచారం.

వీడియో వ్యూవింగ్ టీమ్.. 

బరిలో ఉన్న ప్రధాన పార్టీ అభ్యర్ధులతో పాటు ప్రతి ఒక్కరూ తమ ప్రచారంలో భాగంగా నిర్వహించే పాదయాత్ర, సభలు, సమావేశాలకు సువిధ పోర్టల్ లో గానీ, రిటర్నింగ్ ఆఫీసర్ నుంచి తప్పకుండా అనుమతులు తీసుకోవాలని ఎన్నికల అధికారులు సూచించారు. అనుమతులున్న, అనుమతులు లేని ప్రచార కార్యక్రమాలను ఎప్పటికపుడు వీడియో చిత్రీకరించేందుకు వీడియో వ్యూవింగ్ టీమ్ ను కూడా ఏర్పాటు చేశారు. అక్రమంగా నగదు, మద్యం తరలింపులతో పాటు 1950 టోలీ ఫ్రీకి వచ్చే ఫిర్యాదులకు వెంటనే స్పందించిన స్పాట్ కు క్షణాల్లో చేరుకునేందుకు వీలుగా 45 ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ లు, మరో 45 స్టాటిక్ సర్వేైలెన్స్ టీమ్ లతో పాటు వీడియో సర్వైలెన్స్ టీమ్ లు 4, వీడియో వ్యూవింగ్ టీమ్ లు, మరో నాలుగు అకౌంటింగ్ టీమ్ లను ఏర్పాటు చేశారు. మొత్తం వంద టీమ్ లతో నిఘాను ముమ్మరం చేశారు.

Also Read: Spirit Movie: ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్.. ప్రభాస్ సినిమాలో రవితేజ, త్రివిక్రమ్ వారసులు..

రూట్ మ్యాప్‌లు సిద్దం.. 

వీడియో సర్వైలెన్స్ టీమ్ లు అభ్యర్థులు ప్రచార కార్యక్రమాల్ని వీడియో చిత్రీకరించి, దాన్ని వీడియో వ్యూవింగ్ టీమ్ లకు పంపించి, ఆ ప్రచార కార్యక్రమంలో అయిన ఖర్చును అంచనా వేసి, అకౌంటింగ్ టీమ్ ద్వారా అభ్యర్థి ఖాతాలో జమ చేసేలా ఏర్పాట్లు చేశారు. ఒక్క ఫిర్యాదుపై ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ తో పాటు కేంద్ర పరిశీలకులు ఆగమేఘాలపై స్పాట్ కు చేరుకునేలా రూట్ మ్యాప్ లను కూడా సిద్దం చేసినట్లు తెలిసింది. ప్రతి అభ్యర్థి ప్రచార కార్యక్రమంలో షాడో టీమ్ లు పాల్గొని తీసుకున్న అనుమతి ప్రకారం ప్రచారం జరుగుతుందా? దాన్ని ఉల్లంఘించి ఏమైనా జరుగుతుందా? అన్న విషయాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించి, అనుమతిని ఉల్లంఘించి జరిగినట్లయితే అభ్యర్థిపై కేసు నమోదుకు సిఫార్సు చేయనున్నట్లు సమాచారం. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థులపై నిఘా ముమ్మరం చేసినట్లు తెలిసింది.

ఇప్పటి వరకు రూ.2.82 కోట్లు సీజ్..

జూబ్లీహిల్స్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన ఈ నెల 13 నుంచి ఇప్పటి వరకు ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ లు, స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్ లు నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో ఆకస్మికంగా సోదాలు నిర్వహించి ఇప్పటి వరకు రూ. 2.82 కోట్ల నగదు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయం వెల్లడించింది. ఇప్పటి వరకు రూ. 2. 75 లక్షల 83 వేల 590 నగదు, రూ. 3 లక్షల 69 వేల 478 విలువైన 512.375 లీటర్ల లిక్కర్, రూ. లక్షా 41 వేల 175 విలువైన 0.197 కేజీల గంజాయి, 0.011 గ్రాములు ఎండీఎంఏతో పాటు రూ. లక్షా 37 వేల పై చిలుకు విలువ చేసే ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. వీటికి తోడు 11 కోడ్ ఉల్లంఘన కేసులను నమోదు చేసినట్లు కూడా తెలిపారు.

Also Read: Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాదం.. పోలీసుల అదుపులో బైకర్ ఫ్రెండ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు

Just In

01

NIMS Hospital: నిమ్స్ ఆసుపత్రిలో అక్రమ నియామకాలు.. శాంతి కుమారి కమిటీ రిపోర్ట్‌లో సంచలనాలు..?

Twitter toxicity: సినిమాలపై ట్విటర్‌లో ఎందుకు నెగిటివిటీ పెరుగుతుంది?.. ట్విటర్ టాక్సిక్ అయిపోయిందా?

Ashanna: మావోయిస్టు పార్టీ ఆరోపణలను ఖండించిన ఆశన్న

Viral Video: అయ్యప్ప మాల దీక్షను తీసుకుని మద్యం సేవించిన స్వామి.. వీడియో వైరల్

Ramchandra Rao: జూబ్లీహిల్స్‌లో రెండు రాష్ట్రాల నేతలు కలిసి పని చేస్తాం..?