Private Travels (imagecredit:twitter)
తెలంగాణ

Private Travels: రాష్ట్రంలో ప్రైవేటు ట్రావెల్స్ ఇష్టారాజ్యం.. కనీస ప్రమాణాలు పాటించని ట్రావెల్స్

Private Travels: ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు ప్రమాదాలకు కేరాఫ్ గా మారుతున్నాయి. ఎక్కడో ఒక చోట ప్రమాద బారిన పడుతున్నాయి. బస్సుల ఫిట్ నెస్(Fitness) లేకుండానే రోడ్డెక్కుతుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. దీంతో ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. చర్యలు తీసుకోవాల్సిన రవాణాశాఖ అధికారుల చోద్యం కారణంగానే ప్రమాదాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి.

కర్నూల్ బస్సు ప్రమాద ఘటనతో..

ట్రావెల్స్ బస్సుల్లో తక్కువ సమయంలో గమ్యాన్ని చేరుకోవచ్చని.. సౌకర్యాలు ఉంటాయని ప్రయాణికులు ఆశ్రయిస్తున్నారు. అయితే ఆర్టీసీ(RTC) బస్సుల కన్నా చూడగానే ఆకట్టుకుంటాయి. కానీ వాటికి పూర్తి స్థాయి ఫిట్ నెస్ ఉండకపోవడం, నిత్యం తనిఖీ చేయాల్సిన రావాణాశాఖ అధికారులు సైతం అలసత్వం ప్రదర్శిస్తుండటంతోనే ప్రమాదాలు జరిగి ప్రజల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. మోటారు వాహన చట్టాన్ని పాటించకుండా ట్రావెల్స్ ను రోడ్డెక్కిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కేవలం గమ్యాన్ని త్వరగా చేరుకోవచ్చని కారణంతోనే ఆశ్రయిస్తున్నారు. ఈ తరుణంలో శుక్రవారం ఉదయం కర్నూల్ బస్సు ప్రమాద ఘటనతో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల ఫిట్ నెస్ ఇప్పుడు బయటపడింది. టికెట్ ధర ఎక్కుగానే ఉన్నా ప్రయాణికులకు భద్రత కల్గించేలా ప్రమాణాలు పాటించడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. అంతేగాకుండా సీనియర్ డ్రైవర్లు(Senior drivers) ఉండాలి.

సుదూర ప్రాంతాలకు అయితే ఇద్దరు డ్రైవర్లు ఉండాలనే నిబంధన ఉంది. అయినప్పటికీ ప్రైవేటు బస్సుల్లో చాలా వరకు ఒక్కరే డ్రైవరు ఉంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఎక్కువ బస్సుల్లో క్లీనరే కొన్నిసార్లు బస్సులను నడిపి ప్రమాదాలకు కారణమవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో అద్దాలు పగలకొట్టడానికి చిన్న సుత్తిలాంటి పరికరాలు(హ్యామర్)లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. బస్సులోపల మంటలువస్తే దాన్ని నిరోధించే అగ్ని నిరోధక పరికరాలు కూడా ఖచ్చితంగా అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉంది. ఏదైనా ప్రమాదం జరిగితే ప్రయాణికులు క్షేమంగా బయటపడే అవకాశం ఉంది.

Also Read: Ponguleti Srinivasa Reddy: ఇరుకు స్థలాల సమస్యకు పరిష్కారం.. పట్టణ పేదలకు పొంగులేటి తీపికబురు

నిబంధనలకు విరుద్ధంగా..

రాష్ట్ర వ్యాప్తంగా 1500 ట్రావెల్స్ బస్సులు ఉన్నాయి. గ్రేటర్ లోనే 600లకు పైగాఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. మరోవైపు ఏ రాష్ట్రంలో తక్కువ ట్యాక్స్ ఉంటుందో.. ఆ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేసుకుని ఎక్కువ ట్యాక్స్ ఉండే రాష్ట్రంలో ట్రావెల్స్ ను తిప్పుతున్నాయి. బస్సుల ట్యాక్స్ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా నిర్ణయించారు. ప్రతి మూడు నెలలకు ఒక సీటుకు చెల్లించాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూ.3,750లు, తెలంగాణలో రూ.4వేలు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ప్రైవేట్ ట్రావెల్స్ కేవలం కాంట్రాక్ట్ క్యారేజీలుగా మాత్రమే తిప్పాల్సి ఉంటుంది.

ప్రేవేట్ ట్రావెల్స్ లో కొన్ని పర్యాటకం పేరుతో అనుమతులు తీసుకుని ఇతర ప్రాంతాలకు తిప్పుతున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్ను ఎగవేత కోసం కొన్ని ట్రావెల్స్ నిర్వాహకులు ఒకే నంబరుతో పలు ప్రాంతాలకు బస్సులు నడుపుతున్నారన్న ఆరోపణలు సైతం ఉన్నాయి. ఇక రవాణాశాఖ అధికారుల తనిఖీలు అంతంతమాత్రంగానే కొనసాగుతున్నాయని, ఎక్కడైనా బస్సు ప్రమాదాలు జరిగితే అలర్టు అయి తనిఖీ చేస్తున్నారనేవిమర్శలు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా సరకు రవాణా కూడా ప్రమాదాలకు కారణమవుతోందనే ప్రచారం జరుగుతుంది. సిలెండర్లు, పేలుడు పదార్థాలు, క్రాకర్స్, ఇంధనంతో నిండి ఉన్న ద్విచక్ర వాహనాలను కూడా బస్సుల్లో రవాణా చేస్తున్నట్లు ప్రైవేట్ ట్రావెల్స

వేరే రాష్ట్రంలో రిజిస్టేషన్..

ప్రభుత్వం కర్నూల్ ప్రమాద ఘటనను సీరియస్ గా తీసుకుంది. ఇక ఎన్ ఫోర్స్ మెంట్ బృందాలతో తనిఖీ చేపట్టాలని, రవాణాశాఖ నిబంధనలు పాటించని బస్సులు సీజ్ చేయాలని ఆదేశించినట్లు సమాచారం. ఇక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల తనిఖీ ముమ్మరం చేయనున్నారు. ఎమర్జెన్సీ గా మెడికల్ కిట్ లేకున్నా.. మంటలు ఆర్పేందుకు పరికరాలు, తదితర పరికరాలు లేకున్నా చర్యలకు సిద్ధమవుతున్నారు. అయితేగాకుండా పెండింగ్ చలాన్లు చెల్లించకపోయినా చర్యలు తీసుకోబోతున్నట్లు సమాచారం. ఒక రాష్ట్రంలో పర్మిట్ తీసుకొని నిబంధనలకు విరుద్ధంగా తిరిగే వాటిపైనా కఠిన చర్యలు చేపట్టనున్నారు.

Also Read: Kurnool Bus Accident: బస్సు ప్రమాదంలో కొత్త ట్విస్ట్.. ఫ్యూజులు ఎగిరే విషయం చెప్పిన.. కర్నూలు జిల్లా ఎస్పీ!

గతంలో ఘటనలు..

  • ఆరెంట్ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తుంది. నల్లగొండ జిల్లా కేంద్రంలో హైదరాబాద్ రోడ్డు చంద్రగిరి విల్లాస్ కాలనీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 20మంది గాయపడ్డారు.
  • సూర్యాపేట జిల్లా దురాజ్ పల్లి వద్ద దివాకర్ ట్రావెల్స్ కు చెందిన ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. 10 మందికి తీవ్రగాయాలు అయ్యాయి..
  • హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తుండగా మునగాల మండలం ఆకుపాముల వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 33 మంది ప్రయాణికులు ఉండగా. సుమారు 10 మందికి గాయాలయ్యాయి.
  • మిర్యాలగూడ సమీపంలోని చింతపల్లి వద్ద ఆగి ఉన్న లారీని వెనక నుంచి బలంగా ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆస్పత్రిలో మరొకరు మృతి చెందారు. మరో 15 మంది వరకూ గాయాలపాలయ్యారు. ఒంగోలు నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
  • సూర్యాపేట సమీపంలో టేకుమట్ల వద్ద సోమవారం ప్రైవేట్ బస్సు బోల్తా పడిన ఘటనలో ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. హైదరాబాదు నుండి విజయవాడ వైపు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి పల్టీ కొట్టింది.
  • మహబూబ్ నగర్ జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్‌ లో ప్రయాణించిన 45 మందికి పైగా ప్రయాణికులు సజీవదహనం అయ్యారు  

Just In

01

The Girlfriend: రష్మిక రెమ్యూనరేషన్ తీసుకోలేదు.. ఆసక్తికర విషయం చెప్పిన నిర్మాత

Mass Jathara: రవితేజ ‘మాస్ జాతర’ నిడివి ఎంతో తెలుసా?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ డేట్ ఇదేనా? ప్రేమికులకు పండగే!

Dragon: ఎన్టీఆర్, నీల్ ‘డ్రాగన్’పై ఈ రూమర్స్ ఏంటి? అసలు విషయం ఏమిటంటే?

Private Buses: కర్నూలు బస్సు ప్రమాదం నేపథ్యంలో తనిఖీలు.. తెలంగాణలో తొలిరోజే 4 బస్సులు సీజ్