Crime News (imagecredit:swetcha)
క్రైమ్

Crime News: మామిడి తోటలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 6 గురు అరెస్ట్..!

Crime News: పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. వారి వద్ద నుంచి రూ.2.50 లక్షల నగదు, రెండు ద్విచక్ర వాహనాలు, 8 సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు. కూరల్లోకి వెళ్తే ఖమ్మం(Khammam) జిల్లా కూసుమంచి మండలంలోని నాయకన్ గూడెం లో మామిడి తోటలో ఖమ్మం, సూర్యాపేట, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జగ్గయ్యపేటకు చెందిన కొంతమంది పేకాట ఆడుతున్నారని సమాచారం మేరకు పోలీసులు పకడ్బందీగా దాడి నిర్వహించారు. ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా మరికొంతమంది పరారైనట్లు పోలీసులు వెల్లడించారు.

గత కొంతకాలంగా పేకాట..

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్ గూడెం శివారు మామిడి(Mango) తోటలో గత కొంతకాలంగా పేకాట నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన కొంతమంది పేకాట రాయుళ్లు ఇక్కడికి వచ్చి పేకాట గుట్టు చప్పుడు కాకుండా పేకాట నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు లక్షల కొద్ది నగదు చేతులు మారుతున్నట్లుగా తెలుస్తోంది. పేకాటలో డబ్బులు సంపాదించినవారు ఆనందంలో ఇంటికి వెళుతుంటే.. డబ్బులు పోగొట్టుకున్న వారు ఆర్థిక ఇబ్బందులకు గురవుతూ వారి కుటుంబాల్లో తరచు వివాదాలు చోటు చేసుకోవడం గమనార్హం. దీంతో ఆయా కుటుంబాల్లో ఆర్థిక సమస్యలు ఉత్పన్నమవడంతో కొంతమంది తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్యలు కూడా చేసుకున్న ఘటనలు ఉన్నాయని నాయకన్ గూడెం(Nayak Gudem) ప్రజలు వెల్లడిస్తున్నారు.

Also Read: Election Commission: జూబ్లీహిల్స్‌లో సోదాలు ముమ్మరం.. అభ్యర్థుల వెనక షాడో టీమ్‌లు

ఎందుకు అరికట్టడం లేదు..

సమాజంలో ఏ చిన్న సంఘటన జరిగినా పోలీసులకు ప్రథమంగా తెలిసిపోతుంది. చోరీలు, వివాదాలు, అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ వ్యాపారాలు ఇలా ఏది జరిగిన పోలీసులకు విశ్వాసనీయ సమాచారం అందుతుంది. ఇలా వచ్చిన సమాచారం మేరకు పోలీసులు, ఇతర టాస్క్ ఫోర్స్(Task Force) అధికారులు సైతం ఆయా ఘటనలపై దాడులు నిర్వహిస్తూ చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తారు. అయితే కొంతమంది అధికారులు ఇలాంటి వ్యవహారాలన్నింటిని చూసి చూడనట్టు “మామూళ్లు”గానే వ్యవహరిస్తున్నట్లుగా ప్రజల నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అరికట్టాల్సిన అధికారులే అక్రమార్కులకు, అసాంఘిక కార్యకలాపాల నిర్వహకులకు సహకరించడంతోనే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని ప్రజలు బాహాటంగా చర్చించుకుంటున్నారు.

Also Read: Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Just In

01

Bad Boy Karthik: అందమైన ఫిగరు నువ్వా.. హీరోయిన్‌ని నాగశౌర్య అలా అడిగేశాడేంటి?

Telangana Handloom Crisis: 12 ఏళ్లుగా నేతన్నల నెత్తిన పాలకవర్గాల పిడుగు! పుష్కర కాలంగా ఇన్‌‌ఛార్జ్‌ల అరాచకం!

Chiranjeeva Trailer: రాజ్ తరుణ్ ‘చిరంజీవ’ ట్రైలర్ ఎలా ఉందంటే..

Huzurabad: హుజూరాబాద్‌లో కాంగ్రెస్ నేత సుడిగాలి పర్యటన.. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

Sreeleela: పెళ్లి తర్వాత అలాంటి పాత్రలే ఎక్కువ చేస్తా.. వైరల్ అవుతున్న శ్రీలీల బోల్డ్ కామెంట్స్