Jogipeta (Image source Whatsapp)
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Bottu Gambling: రూ.34 వేల నగదు స్వాధీనం

సెల్‌ఫోన్లు, బైకులు కూడా స్వాధీనం చేసుకున్న పోలీసులు
సంగారెడ్డి జిల్లా జోగిపేటలో ఘటన

రెగోడ్ మండలంలో పట్టుబడ్డ పేకాట రాయుళ్లు

జోగిపేట, స్వేచ్ఛ: సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండల పరిధిలోని ఏర్రారం గ్రామ శివారులో చిత్తు-బొత్తు (బొమ్మ, బొరుసు) ఆడుతున్న వ్యక్తులను (Bottu Gambling) శనివారం రాత్రి అరెస్టు చేసినట్లు జోగిపేట ఎస్సై పాండు తెలిపారు. ఏర్రారం గ్రామ శివారులో చిత్తు-బొత్తు ఆడుతున్నారంటూ సమాచారం అందడంతో దాడులు నిర్వహించామన్నారు. ఈ దాడుల్లో ఏడుగురిని అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుంచి రూ.34,840 నగదు, 7 సెల్‌ఫోన్‌లు, మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. పట్టుబడిన వారిలో పోతురాజు అనిల్‌ (శంకరంపేట), బిక్కునూర్‌ రాజు (ఎల్లారెడ్డిపేట్‌), గుంజరి బాలరాజు (ఎల్లారెడ్డిపేట్‌), ఎండీ.సాజీద్‌ (ఎల్లారెడ్డిపేట్‌), ఎండీ.ఆసీఫ్‌ (అల్లాదుర్గం), కొముల అనిల్‌ గౌడ్‌ (కొల్చారం), చెట్ల శంకర్‌‌లను (ఏర్రారం) అరెస్టు చేసి, కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.

Read Also- Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!

పేకాట రాయుళ్ల వద్ద రూ.2.19 లక్షలు స్వాధీనం
రేగోడ్‌లో పేకాట స్థావరాలపై దాడులు

జోగిపేట, స్వేచ్ఛ: రెగోడ్ మండలం కొండాపూర్ గ్రామ శివారులోని షెడ్డులో పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందడంతో రేగోడ్ పోలీసులు నిర్వహించిన దాడుల్లో పటాన్‌చెరుకు చెందిన నందు, లవ్య, రోహిత్‌లతో పాటు మరికొందరిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్, పటాన్‌చెరు, శంకర్‌పల్లి, జనవాడ, చేవెళ్ల ,అల్వాల్ ప్రాంతంలో నివసిస్తున్న కొందరు యువకుల కూడా ఈ జాబితాలో ఉన్నారు. పేకాట ఆడించిన వారిని కూడా పట్టుకున్నామని, పేకాట ఆడుతున్న 19 మంది యువకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అల్లాదుర్గం సీఐ రేణుక రెడ్డి తెలిపారు. ఈ కేసులో రూ.2.19 లక్షల నగదు, ఫోన్లు, కారు, ఆటో బైక్‌లను స్వాధీన పరచుకుని కోర్టులో డిపాజిట్ చేసినట్లు తెలిపారు.

Read Also- Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

మెదక్ జిల్లాలో ఎక్కడ పేకాట ఆడినా గట్టి చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా సీఐ హెచ్చరించారు. పేకాట ఆడుకోవడానికి సహకరించి స్థలమిచ్చిన వ్యక్తులపై కూడా కేసు నమోదు చేస్తామన్నారు. పేకాట ఆడుతున్న ప్రదేశాన్ని ఆర్డీవో అనుమతి తీసుకుని సీజ్ చేస్తామని తెలిపారు. యువకులు పేకాట మోజులో పడి, కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకుంటున్నారన్నారు. యువకులందరూ క్రమశిక్షణతో మెలగాలని సీఐ రేణుక రెడ్డి తెలిపారు. రేగోడ్ మండలం, ఆల్లాదుర్గ్ సర్కిల్ పరిసరాలలో జూదం ఆడే యువకులపై కఠినమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Just In

01

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!

Bandi Sanjay: కేటీఆర్‌పై గట్టి పంచ్‌లు వేసిన కేంద్రమంత్రి బండి సంజయ్