Cobra Snake Video: ఈ మధ్య కాలంలో ఎంతో మంది పాపులర్ అవుదాం అని రక రకాల పనులు చేస్తున్నారు. ఒకడేమో కదులుతున్న రైలు పక్కన వెళ్లి రీల్ చేస్తాడు. ఇంకొకడేమో చెరువులోకి దూకి మరి వీడియో చేస్తాడు. వీళ్ళ పిచ్చికి ఎలాంటి మందు లేదు. రాత్రికి రాత్రే ఫేమస్ అవుదాం అని పిచ్చి వేషాలు వేస్తూ ఎవరిష్టమొచ్చినట్లు వాళ్లు వీడియోస్ రికార్డ్ చేసి వారి సోషల మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేస్తున్నారు. వీడియో వైరల్ అయితే హీరో అవుతున్నారు. అవ్వకపోతే మళ్ళీ జీరో నుంచి మొదలు పెట్టి రక రకాల ప్రయోగాలు చేసి ఎలాగైనా వైరల్ అవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో అయితే మరి అతను ఏం చేస్తున్నాడో అతడికైనా తెలుస్తుందో? లేదో? ఇంతకీ అతను చేసిన పనేంటో తెలిస్తే మీరు కూడా తిట్టకుండా ఉండలేరు.
మనలో చాలా మంది పాములను చూసి భయపడి పారిపోతుంటారు. ఇంకొందరు స్నేక్ క్యాచర్ లకు వెంటనే తెలియజేస్తారు. పాములు కనిపించగానే కొట్టకూడదని జ్యోతిష్యులు చెబుతుంటారు. దీని వల్ల దోషాలు వస్తాయని అంటున్నారు. ఇంకా ధైర్యవంతులైతే కోబ్రాలతో పట్టుకుని స్టంట్ లు చేస్తారు. కొంచం కూడా భయం కూడా లేకుండా వాటిని మెడలో వేసుకుని హీరోస్ లా బిల్డ్ అప్ ఇస్తారు.
ఏకంగా పాముతో లిప్ కిస్.. వీడెంటి బాబోయ్ ?
ఇంకొందరు వాటికి కిస్సులు పెడుతుంటారు. ఇలాంటివి చేసేటప్పుడు పాము కాట్లతో ఎంతో మంది బలైయ్యారు. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఓ కుర్రాడు పాముతో రొమాంటిక్ స్టంట్ లు చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. ఆ అబ్బాయి ఒక నాగుపాము దగ్గరకు వెళ్లి పాము వైపు చూస్తూ.. కాసేపు చూపులతో దాన్ని మాయ చేశాడు. ఆ పాము పగడ విప్పీ బుసలు కొడుతోంది. కాటు వేసేందుకు రెడీగా ఉంది. కానీ, ఆ కుర్రాడు మాత్రం కొంచం కూడా వెనక్కి వెళ్లకుండా.. పాము ముందుకు వెళ్లి లిప్ కిస్ ఇచ్చాడు. అతను ఇంకా దారుణంగా పామును నోట్లో పెట్టుకుని మరి వేషాలు వేశాడు.
