Mahabubabad District (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Mahabubabad District: మహబూబాబాద్‌లో కుక్కల స్వైర విహారం.. పట్టించుకోని అధికారులు

Mahabubabad District: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కుక్కలు(Dogs) స్వైర విహారం చేస్తున్నాయి. ప్రజలపై దాడి చేస్తూ బెంబేలెత్తిస్తున్నాయి. గుంపులు గుంపులుగా ప్రధాన రహదారులపై విహరిస్తూ ఒంటరిగా వెళ్లే వారిపై దాడి చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. మున్సిపాలిటీల్లో అధికారులు కుక్కల అరికట్టే చర్యలు చేపట్టాల్సి ఉండగా నిర్లక్ష్యం వహిస్తూ విఫలం చెందుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆదివారం మహబూబాబాద్(Mehabubabad) మున్సిపాలిటీ కేంద్రం స్థానిక కొండపల్లి గోపాలరావు నగర్(Gopalarao Nagar) కాలనీలో కుక్కల స్వైర విహారం చేస్తూ, బీభత్సవం సృష్టించాయి.

కరుస్తున్న పట్టింపు లేని అధికారులు 

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కాలనీల్లో కుక్కలు ప్రజలపై దాడి చేస్తున్న అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపణలు వస్తున్నాయి. తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఆదివారం కుక్కలు చేసిన దాడిలో కుక్కలు చేసిన దాడిలో జాడి భవిష్, కాగితం వినయ్, వెంగలి శ్రీనివాస్ లకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Also Read: Megastar Chiranjeevi: ఇకపై చిరంజీవి పేరు, ఫొటోలను ఎలా పడితే అలా వాడారో..!

రహదారులపై కుక్కల సంచారం

మున్సిపాలిటీ పరిధిలోని పలు కాలనీల్లో వ్యర్థ పదార్థాలు రహదారులపైనే ఉండడంతో వీధి కుక్కలు అక్కడికి చేరుకుంటున్నాయి. ఇలాంటి సందర్భాల్లోనే అటుగా వెళుతున్న ప్రజలపై కుక్కలు దాడి చేస్తున్నాయి. ఆకలితో ఉన్న కుక్కలు తమపై దాడి చేస్తారేమోనని ఆందోళనతో ప్రజలపై తిరిగి దాడి చేస్తూ గాయపరుస్తున్నాయి. రహదారులపై ఎప్పటికప్పుడు వ్యర్థ పదార్థాలు నిల్వ ఉండకుండా డంపింగ్ యార్డ్(Dumping yard) లకు తరలిస్తే ప్రజలకు కుక్కల నుండి ఉపశమనం కలుగుతుందని ప్రజలు వివరిస్తున్నారు. శానిటేషన్ పూర్తిస్థాయిలో నిర్వహిస్తే రహదారులపై వ్యర్ధ పదార్థాలు ఉండకుండా పోతాయి. దీంతో వీధి కుక్కలు సైతం రహదారులపై రాకుండా ఉంటాయని స్థానిక ప్రజలు వెల్లడిస్తున్నారు. ఒకవైపు రహదారులపై గోవులు సంచరిస్తూ తరచూ ప్రమాదాల బారిన పడుతున్నాయి. అదేవిధంగా రహదారికి అడ్డంగా గోవులు రావడంతో వాహనదారులు ప్రమాదాలకు గురై తీవ్ర గాయాలపాలు అవుతున్నారు. ముఖ్యంగా మున్సిపాలిటీ అధికారులు అటు ఆవులను, ఇటు కుక్కల బెడదను తగ్గించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Also Read: Election Commission: జూబ్లీహిల్స్‌లో సోదాలు ముమ్మరం.. అభ్యర్థుల వెనక షాడో టీమ్‌లు

Just In

01

Suryapet News: ప్రతి ఒక్కరూ చట్టపరిధిలో నడుచుకోవాలి: ఎస్పీ నరసింహ

Haryana: సిస్టర్స్ డీప్ ఫేక్ వీడియోలు.. సోదరుడు ఆత్మహత్య.. వెలుగులోకి షాకింగ్ నిజాలు

Crime News: మామిడి తోటలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 6 గురు అరెస్ట్..!

ACB Rides: ఏసీబీ వలలో గ్రామ పరిపాలన అధికారి.. దేవుడే పట్టించేనా..!

Mass Jathara: మాస్ జాత‌ర ప్రీ రిలీజ్ ఈవెంట్.. రవితేజ కోసం కోలీవుడ్ స్టార్ హీరో..?