Intermediate Exams (imagecredit:twitter)
తెలంగాణ

Intermediate Exams: ఈసారి ఇంటర్ పరీక్షలు యథాతథం.. వచ్చే సంవత్సరం నుంచి మార్పులు

Intermediate Exams: రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలపై బోర్డు అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. ఈసారి పరీక్​షలు గతంలో లాగే యథాతథంగా నిర్వహించాలని నిర్ణయించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు. వచ్చే వారంలో దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ ను అధికారులు రిలీజ్ చేయనున్నారు. కాగా ఇంటర్ విద్యలో వచ్చే విద్యాసంవత్సరం నుంచి సమూల మార్పులు జరగనున్నాయి. దాదాపు 6 అంశాలపై ప్రక్షాళన జరగనుంది. వీటిని 2026-27 విద్యాసంవత్సరం నుంచి అమలుచేయనున్నారు. 2026-27 విద్యాసంవత్సరం నుంచి ఇంటర్మీడియట్(Intermediate) లో 80 మార్కులకే వార్షిక పరీక్షలు జరగనున్నాయి. మరో 20 మార్కులు ఇంటర్నల్స్ గా కేటాయించనున్నారు. సబ్జెక్టులతోపాటు లాంగ్వేజెస్ కు కూడా ఇదే విధానాన్ని అమలుచేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి ఇంటర్ సిలబస్ లోనూ మార్పులు చేయనున్నారు. సిలబస్ మార్పులకు సంబంధించి సబ్జెక్టుల నిపుణులతో నవంబర్ 1 నుంచి డిసెంబర్ 15 వరకు 45 రోజులపాటు కసరత్తు చేసి సిలబస్ ను రూపొందించనున్నారు. కొత్త సిలబస్ కు సంబంధించిన పాఠ్య పుస్తకాల ముద్రణను ఏప్రిల్ నెలాఖరు నాటికి లేదా మే మొదటి వారంలోగా పూర్తి చేసి విద్యార్థులకు పుస్తకాలను అందుబాటులోకి తీసుకురానున్నారు.

15 మార్కులకు ప్రాక్టికల్ పరీక్షలు 

తెలంగాణలో ఇప్పటి వరకు సెకండియర్ సైన్స్ విద్యార్థులకు మాత్రమే ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఇకపై వచ్చే ఏడాది నుంచి మొదటి సంవత్సరం సైన్స్ విద్యార్థులకు కూడా ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహించనున్నారు. ఇప్పటి వరకు అమలుచేసిన 30 మార్కులను మొదటి సంవత్సరంలో 15 మార్కులకు, రెండో సంవత్సరంలో 15 మార్కులకు ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహిస్తారు. ఫిజిక్స్(Physics), కెమిస్ట్రీ(Chemistry), బాటనీ(Botany), జువాలజీ(Zoology) సబ్జెక్టులకు ప్రాక్టికల్స్ ను నిర్వహిస్తారు. ఇదిలా ఉండగా లాంగ్వేజెస్ లో ప్రస్తుతం ఇంగ్లిష్ కు మాత్రమే ఇంటర్నల్స్ పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో వచ్చే ఏడాది నుంచి సంస్కృతం, తెలుగు, గణితం, ఇతర ఆర్ట్స్, కామర్స్ అన్ని సబ్జెక్టులకు ఇంటర్నల్ మార్కుల విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. దీనికి గాను ఎకనమిక్స్(Econmy), కామర్స్, హిస్టరీ(History), పొలిటికల్(Political) సైన్స్ సబ్జెక్టులను యాక్టివిటీస్ రూపంలో మార్చబోతున్నారు. ఉదాహరణకు విద్యార్థులకు స్థానిక ప్రాంతాల విషిష్టతపై యాక్టివిటీ ఇచ్చి దీనికి ఇంటర్నల్ మార్కులు అందించనున్నారు. ఈ విధానాన్ని దేశంలోని 13 రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేస్తున్నాయి.

సట్జెక్ట్ ఎక్స్ పర్ట్స్ కమిటీ..

వచ్చే విద్యాసంవత్సరం నుంచి తెలంగాణ కూడా ఈ జాబితాలో చేరనుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీకి ప్రాక్టికల్స్ ఉన్నట్లు మ్యాథ్స్(ఇంటర్నల్స్)కు సంబంధించి 80 పర్సెంట్, 20 పర్సెంట్ థియరీని అమలు చేయవచ్చో సట్జెక్ట్ ఎక్స్ పర్ట్స్ కమిటీ నివేదిక ఆధారంగా తేల్చనున్నారు. ఫస్టియర్ లో ప్రాక్టికల్స్ నిర్వహించడం ద్వారా ఏ ఇయర్ టాపిక్స్ ఆ ఇయర్ లోనే కవర్ అవ్వడంతో విద్యార్థులపై ఒత్తిడి భారం తగ్గుతుందని బోర్డు భావిస్తోంది. అంతేకాకుండా వారికి చదవడం కంటే ప్రాక్టికల్ ద్వారా మైండ్ లో బలంగా గుర్తుండిపోతుందని భావిస్తోంది. ఇదిలా ఉండగా గణితం సబ్జెక్టుకు సంబందించి ఇంటర్నల్ మార్కులకు ఎలాంటి విధివిధానాలు రూపొందించాలనే అంశంపై సబ్జెక్ట్ నిపుణులు చర్చించి తుది నిర్ణయానికి రానున్నారు.

Also Read: Kurnool Bus Accident: బస్సు ప్రమాదంలో కొత్త ట్విస్ట్.. ఫ్యూజులు ఎగిరే విషయం చెప్పిన.. కర్నూలు జిల్లా ఎస్పీ!

ఒకేరకమైన గణితం ప్రశ్నాపత్రం..  

ఇంటర్ బోర్డు.. కొత్తగా కామర్స్ విద్యార్థులకు అకౌంటెన్సీ, కామర్స్, ఎకనామిక్స్(ఏసీఈ) స్ట్రీమ్ ను ప్రైవేశపెట్టనుంది. అలాగే వచ్చే ఏడాది నుంచి ఎంఈసీ గ్రూప్ విద్యార్థులకు సెపరేట్ మ్యాథ్స్ ప్రశ్నాపత్రాన్ని రూపొందించాలని నిర్ణయించారు. అంతేకాకుండా ఇప్పటి వరకు ఎంపీసీ విద్యార్థులకు, ఎంఈసీ విద్యార్థులకే ఒకేరకమైన గణితం ప్రశ్నాపత్రాన్ని అమలు చేస్తుండగా వచ్చే ఏడాది నుంచి ఇందులో మార్పులు చేసి ఎవరికి వారుగా వేర్వేరు ప్రశ్నాపత్రాన్ని రూపొందించనున్నారు. రాష్ట్రంలో ఇంటర్ సిలబస్ ను దాదాపు 12 ఏండ్ల తర్వాత రివైజ్ చేయనున్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంటర్ సిలబస్ మారనుంది. 2013-14లో గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టుల సిలబస్ మార్పు చేయగా.. 12 ఏండ్ల తరువాత సైన్స్ సబ్జెక్టుల్లో మార్పులు చేస్తున్నారు.

2019-20లో హ్యుమానిటీస్ సబ్జెక్టుల్లో మార్పులు చేయగా ఆరేండ్ల తరువాత ఇప్పుడు మార్పులు చేయనున్నారు. అలాగే 2020-21 లాంగ్వేజెస్ సిలబస్ మార్పులు చేయగా నాలుగేళ్ల తరువాత మరోసారి మార్పులు చేస్తున్నారు. సిలబస్ మార్పు నేపథ్యంలో గణితం, భౌతిక, రసాయన శాస్త్రాల్లో సిలబన్ తగ్గే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కొత్తగా ముద్రించనున్న పాఠ్య పుస్తకాల్లో క్యూఆర్ కోడ్ ను ముద్రించనున్నారు. విద్యార్థులకు డిజిటల్ మోడ్ లో పాఠాలను అందించేందుకు ఈ క్యూఆర్ కోడ ఉపయోగపడనుంది. కొత్త పాఠ్య పుస్తకాలను ఏప్రిల్ చివరినాటికి లేదా మే మొదటి వారం నాటికి మార్కెట్ లో విద్యార్థులకు అందుబాటులో ఉండేలా బోర్డు కార్యాచరణ రూపొందించుకుంది.

ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షలు : బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య 

ఇంటర్ వార్షిక పరీక్షలను వచ్చే ఏడాది ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభించాలని నిర్ణయించినట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. ఇంటర్ బోర్డులో సంస్కరణలపై ఆయన మీడియాకు శనివారం వివరించారు. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయని వివరించారు. కాగా దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ ను వచ్చే వారంలో ప్రకటిస్తామని తెలిపారు. ప్రాక్టికల్ పరీక్షలను ఫిబ్రవరి 3 నుంచి 20 వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3.50 లక్షల మంది ప్రాక్టికల్ పరీక్షలకు హాజరవుతారని, ఈసారి ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లోనే కేంద్రాలను కేటాయించనున్నట్లు తెలిపారు.

Also Read: AI voice in Spirit: ‘స్పిరట్’ గ్లింప్స్‌లో ప్రభాస్ వాయిస్ నిజం కాదని మీకు తెలుసా.. ఏం చేశారంటే?

సీసీ కెమెరాలు ఏర్పాటు..

ప్రైవేట్ కాలేజీలు సీసీ కెమెరాలను ఏర్పాటుచేస్తేనే ప్రాక్టికల్ పరీక్షల కేంద్రాలకు అనుమతి ఇస్తామని బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య స్పష్టం చేశారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయని కాలేజీలకు ప్రాక్టికల్ పరీక్షలకు కేంద్రాలను ఇవ్వబోమని వెల్లడించారు. నవంబర్ 1 నుంచి ఇంటర్ వార్షిక పరీక్ష ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని వివరించారు. రాష్ట్రంలోని ప్రైవేట్, కార్పొరేట్ జూనియర్ కాలేజీల అనుబంధ గుర్తింపు ప్రక్రియ దాదాపు ముగిసిందని, కేవలం 14 మిక్స్ డ్ ఆక్యుపెన్సీ కాలేజీల గుర్తింపు మాత్రమే పెండింగ్ లో ఉన్నట్టు తెలిపారు. వాటిలో సుమారు 3వేల మంది విద్యార్థులు చదువుతున్నట్టు తెలిపారు. వారికి ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని 430 లొకేషన్లలో 6 వేల సీసీ కెమెరాలు ఏర్పాటుచేశామని, స్టాఫ్ అటెండెన్స్ దాదాపు 90 శాతానికి దగ్గరలో ఉందన్నారు. స్టూడెంట్స్ అటెండెన్స్ 60 శాతం వరకు ఉందన్నారు. విద్యార్థులు రాకుంటే పేరెంట్స్ కు ఎప్పటికప్పుడు మెసేజులు వెళ్తున్నాయని తెలిపారు.

ల్యాబ్ సదుపాయం లేకుంటే..

ఇదిలా ఉండగా జాతీయ స్థాయిలో ఐ స్టెమ్ ఉన్నట్లుగా రాష్ట్రానికి తెలంగాణ సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్ ఫెసిలిటీస్ మ్యాప్(టీ స్టెమ్)ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఈ పోర్టల్ లో తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్, ఐటీఐల్లోని ల్యాబ్ ఫెసిలిటీస్ ను మ్యాప్ చేసి పెడుతున్నట్లు కృష్ణ ఆదిత్య వివరించారు. క్రాస్ లెర్నింగ్ ఎబిలిటీ కోసం దీన్ని ప్రవేశ పెడుతున్నట్లు స్పష్టంచేశారు. ఒక ఇనిస్టిట్యూషన్ లో సరైన ల్యాబ్ సదుపాయం లేకుంటే సమీపంలో ఉన్న ల్యాబ్ ఎక్కడుందో తెలుసుకుని ల్యాబ్ ను చెక్ చేసుకుని ఈ పోర్టల్ ద్వారా ల్యాబ్ ను అప్రోచ్ అవ్వొచ్చన్నారు. సౌకర్యాలు లేకున్నా విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అందించేందుకు ఇబ్బంది లేకుండా ఈ అవకాశాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. దీనికోసం టైం స్లాబ్ విధానాన్ని తీసుకొచ్చామని, నామినల్ ఫీజుతో ఏ టైంలో కావాలో ముందే డిసైడ్ చేసుకుని ఆ టైంలో వాడుకునేలా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియ మొత్తం ఆన్ లైన్ లోనే ఉంటుందన్నారు. టీ స్టెమ్ పోర్టల్ విద్యాశాఖ కంట్రోల్ లో ఉంటుందని, ప్రతి డిపార్ట్ మెంట్ నుంచి ఒక నోడల్ ఆఫీసర్ ఉంటారని కృష్ణ ఆదిత్య స్పష్టంచేశారు.

Also Read: India VS Australia: రోహిత్, కోహ్లీ సెన్సేషనల్ బ్యాటింగ్.. ఆసీస్‌పై భారత్ చారిత్రాత్మక విజయం

Just In

01

NIMS Hospital: నిమ్స్ ఆసుపత్రిలో అక్రమ నియామకాలు.. శాంతి కుమారి కమిటీ రిపోర్ట్‌లో సంచలనాలు..?

Twitter toxicity: సినిమాలపై ట్విటర్‌లో ఎందుకు నెగిటివిటీ పెరుగుతుంది?.. ట్విటర్ టాక్సిక్ అయిపోయిందా?

Ashanna: మావోయిస్టు పార్టీ ఆరోపణలను ఖండించిన ఆశన్న

Viral Video: అయ్యప్ప మాల దీక్షను తీసుకుని మద్యం సేవించిన స్వామి.. వీడియో వైరల్

Ramchandra Rao: జూబ్లీహిల్స్‌లో రెండు రాష్ట్రాల నేతలు కలిసి పని చేస్తాం..?