Re-Entry | రీ - ఎంట్రీ ఇచ్చిన నటి
Kalki 2898 ad Makers Introduce Actress Shobana Role Look
Cinema

Re-Entry: రీ – ఎంట్రీ ఇచ్చిన నటి

Kalki 2898 ad Makers Introduce Actress Shobana Role Look:పాన్ ఇండియా స్టార్‌ డార్లింగ్‌ ప్రభాస్‌ హీరోగా యాక్ట్ చేసిన లేటెస్ట్ సైన్స్‌ ఫిక్షన్‌ అండ్‌ ఫ్యూచరిస్టిక్‌ మూవీ కల్కి 2898ఏడీ. ఈ మూవీలో బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్, లోకనాయకుడు కమల్‌హాసన్, బాలీవుడ్ హీరోయిన్లు దీపికా పదుకోన్, దిశా పటానీ ఇతర లీడ్‌ రోల్స్‌లో యాక్ట్ చేశారు. నాగ్‌ అశ్విన్‌ డైరెక్షన్‌లో సి. అశ్వినీదత్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మూవీ ఈ నెల 27న రిలీజ్‌ కానుంది. కాగా ఈ మూవీ ట్రైలర్‌ నుంచి ప్రమోషన్‌ కార్యక్రమాలు స్పీడప్‌ అయ్యాయి.

తాజాగా కల్కి ఫ్యాన్స్‌కు మేకర్స్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ఈ మూవీలోని మరియమ్‌ రోల్‌ను ఆడియెన్స్‌కు మూవీ యూనిట్‌ ఇంట్రడ్యూస్‌ చేసింది.మరియ‌మ్ రోల్‌లో సీనియర్‌ నటి, పద్మశ్రీ అవార్డు గ్రహీత శోభన యాక్ట్ చేస్తున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. 2006లో వచ్చిన గేమ్‌ మూవీ తర్వాత శోభన తెలుగులో మరో సినిమా చేయలేదు. సుమారు పద్దెనిమిదేళ్ల తర్వాత కల్కి మూవీ ద్వారా మళ్లీ వెండితెరపై శోభన కనిపించనుంది. ఈ తరుణంలో ఆమె ఫ్యాన్స్ పుల్‌ జోష్‌లో ఉన్నారు. మరో 8 రోజుల్లో మరియమ్‌ను కలుస్తారని వైజయంతి మూవీస్ ఒక పోస్ట్‌ రిలీజ్‌ చేశారు.

Also Read: ఆ మూవీలో నటించి తప్పు చేశా

అందరినీ మెప్పించేలా ఆమె లుక్‌ ఉంది. ప్రస్తుతం సోషల్‌మీడియాలో శోభనకు సంబంధించిన పోస్టర్‌ వైరల్‌ అవుతుంది. ఇక ఈ మూవీలో నాని, దుల్కర్‌ సల్మాన్, విజయ్‌ దేవరకొండ, మృణాల్‌ ఠాకూర్‌ అతిథి పాత్రల్లో యాక్ట్ చేశారనే టాక్‌ కూడా తెరపైకి వచ్చింది. మరి ఈ మూవీలో ఎవరెవరు యాక్ట్ చేయనున్నారనేది మూవీ రిలీజ్ డేట్ వరకు వెయిట్ చేయకతప్పదు.

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..