Maoists Surrender: కాంకేర్ జిల్లా పోలీసుల ఎదుట ఆయుధాలతో 21 మంది సరెండర్
బీజాపూర్, స్వేచ్ఛ: మావోయిస్టుల ప్రాభవం అంతిమ దశకు చేరుకుందా అంటే జరుగుతున్న ప్రస్తుత పరిణామాలను నిశితంగా గమనిస్తే అవుననే అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి. ఛత్తీస్‌గడ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా కాంకేర్ ప్రాంతానికి చెందిన 21 మంది మావోయిస్టులు సంబంధిత పోలీసు అధికారుల ఎదుట లొంగిపోయారు. ఇందులో 13 మంది మహిళలు ఉన్నారు.
ఇటీవలే వరుస ఎదురుదెబ్బలు
ఇటీవలే మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బలు తగిలాయి. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట సీనియర్ మావోయిస్టు నాయకుడు, కేంద్ర కమిటీ సభ్యుడు, కేంద్ర అధికార ప్రతినిధి అభయ్ అలియాస్ మల్లోజుల వేణుగోపాల్ రావు ఏకంగా 60 మంది సహచర పార్టీ సభ్యులతో కలిసి లొంగిపోయారు. ఆయుధాలను సమర్పించి మరీ సరెండర్ అయ్యారు. ఆ ఘటన జరిగిన కొన్ని రోజుల వ్యవధిలోనే మరో కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ మెంబర్, నార్త్ బస్తర్ మావోయిస్టు పార్టీ నేత తక్కెళ్ళపల్లి వాసుదేవరావు అలియాస్ రూపేష్ అలియాస్ సతీష్ అలియాస్ ఆశన్న తోపాటు 209 మంది మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర పోలీసుల ఎదుట ఆయుధాలను సమర్పించి సరెండర్ (Maoists Surrender) అయ్యారు.
Read Also- Montha Cyclone: తెలంగాణకు మొంథా ముప్పు.. ఈ జిల్లాల్లో అతితీవ్ర వర్షాలు.. ఆకస్మిక వరదలు
ఈ నెలలో ఇప్పటికే 50 మంది లొంగుబాటు
ఛతీస్‌గఢ్ రాష్ట్రంలో రోజుకో రకమైన పరిస్థితి నెలకొంటుంది. ఈ నెల 15వ తేదీన 50 మంది మావోయిస్టులు లొంగిపోయారు. అందులో 32 మంది మహిళలు, 18 మంది పురుషులు ఉన్నారు. వీరంతా కోయలి బేడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీఎస్ఎఫ్ 40వ బెటాలియన్ చెందిన కంతేరా శిబిరంలో లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ఇద్దరు దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ (డీకే ఎస్ జెడ్ సి) రాజ్మన్ మందావి, రాజు సలాం ఉన్నారు. వీరు మొత్తం 39 ఆయుధాలను సమర్పించారు. అందులో ఏకే-47 రైఫిల్స్ 7, రెండు ఎస్ ఎల్ ఆర్ లు, ఇన్సాస్ రైఫిల్స్, ఒకటి ఎల్ఎంజీ తోపాటు ఇతర ఆయుధాలను పోలీసులకు అందజేశారు. రాజ్మన్ మందావి, రాజు సలాం సహా ప్రసాద్ తమ్మిడి, హీరా లాల్ కొమ్ర, జుగ్ను కోవాచి, నర్సింగ్ నేతం, నాందే (రాజ్మన్ మందావి) భార్య ఉన్నారు. వీరితో పాటు మరో 21 మంది ఏరియా కమిటీ సభ్యులు, పలువురు పార్టీ స్థాయి మావోయిస్టులు లొంగిపోయారు. వీరు మాడ్ జోన్, ఉత్తర బస్తర్ ప్రాంతంలో పీఎల్‌జీఏ (peoples liberation Gerilla army) పనిచేశారు. తాజాగా ఆదివారం 21 మంది మావోయిస్టులు లొంగిపోవడం ఆ పార్టీకి కుంగుబాటు చర్యగా మేధావులు భావిస్తున్నారు.
Read Also- Swetcha Effect: స్వేచ్ఛ కథనంతో సంచలనం.. రంగంలోకి దిగిన నిఘా వర్గాలు డీఎస్పీ అరాచకాలకు తెర!
