Telangana-Rains (Image source Twitter)
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

Montha Cyclone: తెలంగాణకు మొంథా ముప్పు.. ఈ జిల్లాల్లో అతితీవ్ర వర్షాలు.. ఆకస్మిక వరదలు

Montha Cyclone: ‘మొంథా తుపాను’ (Montha Cyclone) తెలుగు రాష్ట్రాలను ఆందోళనలకు గురిచేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడకు సమీపంలో తీరం దాటనున్న ఈ తుపాను తెలంగాణపై కూడా తీవ్రమైన ప్రభావాన్ని చూపబోతోంది. ‘మొంథా’ ప్రభావంతో తెలంగాణకు అతి భారీ వర్ష హెచ్చరిక జారీ అయ్యింది. అక్టోబర్ 28-29 తేదీల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, వరద ముప్పు తప్పదని ‘తెలంగాణ వెధర్‌మ్యాన్’ (ట్విటర్ పేజీ) హెచ్చరించింది. ఏపీలో తీరం దాటే సమయంలో తూర్పు తెలంగాణపై ప్రభావం తీవ్రంగా ఉంటుందని, మంగళ-బుధ వారాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడతాయని, ఇందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని సూచించింది.

కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్..

కుమురంభీం అసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, ములుగు, హనుమకొండ, వరంగల్, జనగాం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 150-220 మి.మీ. వర్షపాతం నమోదయ్యి, ఆకస్మిక వరదలకు (FLASH FLOODS) దారి తీసే అవకాశం ఉందని అప్రమత్తం చేసింది.

Read Also- Ram Charan Next movie: రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా దర్శకుడు ఎవరో తెలిస్తే ఫ్యాన్స్‌కు పండగే..

ఈ జిల్లాలకు బ్లూ అలర్ట్

హైదరాబాద్‌తో పాటు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సిద్ధిపేట, సంగారెడ్డి, మెడ్చల్ మల్కాజ్‌గిరి, యాదాద్రి భువనగిరి, నల్గొండ, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నారాయణపేట, వికారాబాద్ జిల్లాలకు బ్లూ అలర్ట్ జారీ అయింది. ఈ జిల్లాల్లో అక్టోబర్ 28-29 తేదీలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా, అక్టోబర్ 28న హైదరాబాద్‌లో వర్ష ప్రభావం అధికంగా ఉంటుందని అంచనా వేసింది. వాతావరణం చాలా చల్లగా ఉంటుందని, చల్లటి గాలులు వీస్తాయని ‘తెలంగాణ వెధర్‌మ్యాన్’ పేర్కొంది. నగరంలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. మొత్తంగా చెప్పాలంటే ముసురు తరహా వాతావరణం ఉంటుందని పేర్కొంది. హైదరాబాద్‌ నగరంలో సోమవారం (అక్టోబర్ 27) రాత్రి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి.

Read Also- Swetcha Effect: స్వేచ్ఛ కథనంతో సంచలనం.. రంగంలోకి దిగిన నిఘా వర్గాలు డీఎస్పీ అరాచకాలకు తెర!

అప్రమత్తం అవుతున్న ఏపీ!

మొంథా తీవ్ర తుపాను కావడంతో వీలైనంతవరకు ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం కీలక ప్రకటన చేశారు. మొంథా తుపాను ప్రభావం రాష్ట్రంపై ఉంటుందన్న వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో … గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు అధికారిక యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని వెల్లడించారు. మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలతో పాటు ఉన్నతాధికారులందరూ అన్ని శాఖల సమన్వయంతో పనిచేసేలా సన్నద్ధం చేశామని చంద్రబాబు వివరించారు. జిల్లాలకు అవసరమైన నిధులు అందుబాటులో ఉంచి, ప్రత్యేక అధికారులను నియమించామని ఆయన పేర్కొన్నారు. విద్యుత్, తాగునీరు, రవాణా సేవలకు ఎటువంటి అంతరాయం ఏర్పడకుండా చూడాలని అధికారులను ఆదేశించినట్టు చంద్రబాబు ప్రస్తావించారు. వర్షం తీవ్రతను, తుపాను ప్రభావానికి సంబంధించిన సమాచారాన్ని డైరెక్టుగా ప్రజలకు పంపడం ద్వారా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ప్రజలు కూడా అధికార యంత్రాంగానికి, గవర్నమెంట్‌కు సహకరించాలని విజ్ఞప్తు చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి, అక్కడ అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.

Just In

01

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌ను పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!

Hindu Rituals: దేవుడి దగ్గర కొబ్బరికాయను ఇలా కొడితే.. లక్ష్మీదేవి అనుగ్రహం పక్కా?

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే

Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు