Migraine Relief: ఇంట్లో గొడవలు, డబ్బు కష్టాలు, ఆఫీసులో బాస్‌ల ఒత్తిడి… ఇలాంటి కారణాలతో తలనొప్పి రావడం సర్వసాధారణం. ఈ నొప్పి తలలో నరాలు చిట్లిపోయేలా గుచ్చు కుంటూ ఉంటుంది. దానిలో మైగ్రేన్ తలనొప్పి కూడా ఒకటి. సాధారణ నొప్పికి ఇది పూర్తిగా వేరు. దీన్ని పార్శ్వనొప్పి అని కూడా అంటారు. మైగ్రేన్ నొప్పి చాలాసార్లు తల ఒకవైపు మాత్రమే వస్తుంది, కానీ కొన్నిసార్లు తల మొత్తం కూడా బాధపెడుతుంది. ఈ నొప్పి గంటల నుంచి రోజుల వరకు కూడా ఉంటుంది. ఒకసారి ఈ నొప్పి మనిషికి మొదలైతే జీవితాంతం ఉంటుంది. దానికి సరైన మెడిసిన్స్ కూడా లేవు.
ఈ రోజుల్లో మైగ్రేన్‌తో సతమతమయ్యే వాళ్ల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. ఎండలో ఎక్కువసేపు తిరగడం, నీళ్లు తాగకుండా ఉండడం, ఆహారం సరిగ్గా తినకపోవడం, టాబ్లెట్లు అదే పనిగా వాడటం లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ మైగ్రేన్‌ను మరింత ఎక్కువయ్యేలా చేస్తున్నాయి. ఇక, ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టీవీ స్క్రీన్‌ల ముందు గంటల తరబడి కళ్లు కాయలు కాసేలా చూస్తే, మైగ్రేన్ 100% పక్కాగా వస్తుంది.
చాలామంది మైగ్రేన్ వస్తే పెయిన్‌కిల్లర్స్‌ను మింగుతూనే ఉంటారు. కానీ, ఈ మందులు శరీరానికి మంచిది కాదని డాక్టర్లు గట్టిగా చెబుతున్నారు. కాబట్టి వాటికీ బదులుగా.. మీ ఇంట్లోనే సింపుల్‌గా ఈ జ్యూస్ తయారు చేసుకుని తాగితే చక్కటి ఉపశమనం కలుగుతుంది. అయితే, ఆ జ్యూస్ ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..
ఎలా తయారు చేయాలి?
కావల్సిన పదార్థాలు
1 కప్పు పైనాపిల్ ముక్కలు,
1 కప్పు దోసకాయ ముక్కలు,
1 పాల కూర కట్ట,
కాలే ఆకులు 4-5,
1 టీ స్పూన్ అల్లం,
1 టీ స్పూన్ నిమ్మరసం,
ఉప్పు,
మిరియాలు.
Also Read: Gold Price Today: తగ్గిన గోల్డ్ రేట్స్.. కొనాలనుకునేవారికీ ఇదే మంచి ఛాన్స్!
తయారీ విధానం
మిక్సీ జార్‌లో 1 కప్పు పైనాపిల్ చిన్న ముక్కలు, 1 కప్పు తాజా పాలకూర, కాలే ఆకులు, 1 కప్పు దోసకాయ ముక్కలు, 1 టీ స్పూన్ అల్లం పేస్ట్, 1 టీస్పూన్ నిమ్మరసం, చిటికెడు మిరియాలు, రుచికి కొంచెం ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేయండి. ఆ తర్వాత, ఈ మిశ్రమంలో ఐస్ క్యూబ్స్ కలిపి సర్వ్ చేస్తే జ్యూస్ రెడీ. ఇది మైగ్రేన్ నొప్పిని రాకెట్ స్పీడ్‌లో తగ్గిస్తుంది.
గమనిక: పలు అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘స్వేచ్ఛ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
