Director Nag Ashwin Gives Update On Kalki Climax Video Viral
Cinema

Kalki 2898 AD: అదిరిపోయే అప్డేట్‌

Director Nag Ashwin Gives Update On Kalki Climax Video Viral: ఎప్పుడెప్పుడా అని ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్న గ్లోబల్‌ స్టార్‌ డార్లింగ్‌ ప్రభాస్‌ ఫ్యాన్స్‌కి పూనకాలు వచ్చే రోజు త్వరలోనే రాబోతుంది. ఎందుకంటే కల్కి 2898 ఏడీ జూన్ 27న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న కొద్దీ ప్రభాస్ అండ్ నాగ్‌ అశ్విన్‌ టీం ఏదో ఒక అప్‌డేట్‌తో అందరినీ ఖుషీ చేస్తోంది. సైన్స్ ఫిక్షన్‌ జోనర్‌లో వస్తోన్న ఈ మూవీని వైజయంతీ మూవీస్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోంది.

ఇక కల్కి 2898 ఏడీ ప్రమోషన్‌లో భాగంగా ది ఫ్రౌడ్‌ ఆఫ్‌ కల్కి 2898 ఏడీ పేరుతో ఎపిసోడ్‌ 1 ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ఈ స్టోరీ అన్నింటికీ క్లైమాక్స్‌. నా చిన్నప్పుడు తీసిన పాతాళ భైరవి, మహాభారతం, భైరవద్వీపం, ఆదిత్య 369, వంటి మూవీస్ మన పౌరానిక కథలతో తీశారు. మన కలియుగంలో ఏం జరుగబోతుంది. ఎలా జరుగొచ్చు. కేవలం ఇండియాలోనే కాదు ప్రపంచంలో ప్రతీ ఒక్కరూ ఈ స్టోరీతో కనెక్ట్‌ అయ్యేలా ఉంటుందంటూ కల్కి ప్రపంచం ఎలా ఉండబోతుందో తెలియజేస్తూ సాగుతున్న మూవీలాగా చేస్తున్నామని అంతేకాకుండా కల్కి అన్ని యుగాలలో ఉంటాడు అనేది నాకు ఈ స్టోరీ 5 ఏండ్లు పట్టిందని నాగ్‌ అశ్విన్‌ తెలిపిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ‌

ఇప్పటికే ఈ మూవీ నుంచి లాంఛ్ చేసిన బుజ్జి, భైరవ విజువల్స్‌, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. ఈ మూవీలో ప్రభాస్ భైరవ పాత్రలో కనిపించనుండగా, అతడి దోస్త్‌ బుజ్జిగా స్పెషల్ కారు సందడి చేయనుంది. ఈ మూవీలో బాలీవుడ్ భామలు దీపికా పదుకొనే, దిశా పటానీ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు.బెంగాలీ నటుడు శాశ్వత ఛటర్జీ మెయిన్ విలన్‌ కాగా.. లెజెండరీ యాక్టర్లు అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, రాజేంద్రప్రసాద్‌, పశుపతి కీలక పాత్రలు పోషిస్తున్నారు. మేకర్స్‌ ఇప్పటికే లాంఛ్ చేసిన కల్కి 2898 ఏడీ టైటిల్‌, గ్లింప్స్ వీడియో, టీజర్లు సినిమాపై సూపర్ బజ్‌ క్రియేట్ చేస్తున్నాయి.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!