Karimnagar: ఆ గ్రామానికి బస్సు సర్వీస్ ప్రారంభం.
Karimnagr ( image creduit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Karimnagar: ఆ గ్రామానికి బస్సు సర్వీస్ ప్రారంభం.. 30 ఏళ్ల కల నెరవేరిన వేళ గ్రామస్తుల హర్షం!

Karimnagar: హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్  నాడు జమ్మికుంట నుండి వయా బేతిగల్, కేశవపట్నం మీదుగా కరీంనగర్ (Karimnagar) వరకు నూతన బస్సు సర్వీసును ప్రారంభించారు. గత 30 సంవత్సరాలుగా బస్సు సౌకర్యం కోసం ఎదురుచూస్తున్న బేతిగల్ గ్రామ ప్రజల చిరకాల స్వప్నం ఈరోజు నెరవేరింది. కొత్త బస్సు ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రణవ్‌కు గ్రామస్థులు బాణాసంచా కాల్చి ఘనంగా స్వాగతం పలికారు.

Also Read: Karimnagar District: ఓరి నాయనా.. స్మశానంలో దీపావళి వేడుకలు.. ఎక్కడో తెలుసా..!

గ్రామీణ ప్రాంతాల ప్రజలకు, ముఖ్యంగా విద్యార్థులకు ఎంతో ఉపశమనం

ఈ సందర్భంగా వొడితల ప్రణవ్ మాట్లాడుతూ, ఈ నూతన సర్వీసు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు, ముఖ్యంగా విద్యార్థులకు ఎంతో ఉపశమనం కలిగిస్తుందని అన్నారు. బేతిగల్ ప్రజల నిరీక్షణ ఫలించిందని, ఈ సర్వీసు రోజుకు రెండుసార్లు నడుస్తుందని, ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం ఆయన స్వయంగా టికెట్ కొనుగోలు చేసి కొంత దూరం బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తోందని, మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తోందని గుర్తు చేశారు. ఈ బస్సు సౌకర్యం కల్పనకు సహకరించిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తామని ప్రణవ్ స్పష్టం చేశారు.

సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

వీణవంక మండలంలోని బేతిగల్ మరియు వల్భాపూర్ గ్రామాల్లో లబ్ధిదారులకు వొడితల ప్రణవ్ ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) చెక్కులను పంపిణీ చేశారు. బేతిగల్‌లో 4, వల్భాపూర్‌లో 3 చెక్కులు సహా మొత్తం రూ. 3,15,000/- విలువైన చెక్కులను పంపిణీ చేసి, లబ్ధిదారులు వెంటనే వాటిని బ్యాంకులో జమ చేసుకోవాలని సూచించారు.

Also Read: Karimnagar Crime: కత్తి సురేష్ హత్య.. కూరలో వయాగ్రా టాబ్లెట్స్ కలిపిన భార్య.. ఆపై ఉరేసి ఘాతుకం

Just In

01

Itlu Arjuna: ‘న్యూ గయ్ ఇన్ టౌన్’ ఎవరో తెలిసిపోయింది.. ‘సోల్ ఆఫ్ అర్జున’ వచ్చేసింది

India Vs South Africa: దక్షిణాఫ్రికాతో మూడో టీ20.. టాస్ గెలిచిన భారత్.. ఏం ఎంచుకుందంటే?

KCR: 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్పీ భేటీ.. మరో ప్రజా ఉద్యమం!.. కీలక నిర్ణయాలు!

Geethanjali 4K: ‘శివ’ తర్వాత కింగ్ నాగ్ మరో అద్భుత క్లాసిక్ త్వరలోనే థియేటర్లలోకి!

Panchayat Elections: పంచాయతీ పోరు రెండో దశలోనూ కాంగ్రెస్ హవా.. భారీ సంఖ్యలో పంచాయతీల కైవసం