Karimnagar District (imagecredit:twitter)
తెలంగాణ, నార్త్ తెలంగాణ

Karimnagar District: ఓరి నాయనా.. స్మశానంలో దీపావళి వేడుకలు.. ఎక్కడో తెలుసా..!

Karimnagar District: సాదారణంగా మనం దీపావలి పండుగను ఇంట్లో జరుపుకుంటాము. పండుగ సంధర్బంగా దేవుల్లను పూజించి, ఇంటివద్ద కేదారీశ్వర నోములతో కొంతమంది దేవుడినిపూజించి నోముకుంటారు. చనిపోయిన తమ పూర్వికులను గుర్తుచేసుకుంటారు. దీపావలి అంటే అతిముఖ్యంగా అందరు చేసే పని ఇంటి నిండా దీపాలు వెలిగించి కుటుంబ సబ్యులు అందరు కలిసి పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే ఇక్కడ విచిత్రం ఎంటి అంటే కొంతమంది దీపావలి పండుగను కొన్ని సామాజిక వర్గానికి చెందిన వారు చనిపోయిన తమ పూర్వికుల దగ్గరకు వెల్లి దీపాలు వెలిగిస్తారు. చనిపోయిన తమ వారి సమాదుల దగ్గరకువెల్లి అక్కడ వారి సమాదులపై దీపాలు వెలిగించి దీపావలిపండుగను జరుపుకుంటారు.

Also Read; Ponnam Prabhakar: అసెంబ్లీలో ఓకే చెప్పి.. పార్లమెంట్‌లో వ్యతిరేకిస్తున్నారు.. బీజేపీపై మంత్రి పొన్నం ఫైర్

పూర్తి వివరాల్లోకి వెలితే..

కరీంనగర్(Karimnagar) జిల్లాలోని లోని కార్ఖానా గడ్డ(Karkana Gadda)లో ఓ వింత సాంప్రదాయం ఉంది. చనిపోయిన తమ కుటుంబ సభ్యులను గుర్తుచేసుకుంటూ వారి సమాధుల(Graves) దగ్గరే వారు ఆరు దశబ్దాలుగా పండుగ వేడుకలు కొందరు దలితులు జరుపుకుంటున్నారు. స్మశానం అంటేనే సాదారణంగా అందరు భయపడుతుంటారు. అయితే తమ పూర్వికులను ఎక్కడైతే కననం చేస్తారో అక్కడే వారి సమాదుల వద్ద పండుగను జరుపుకుంటారు . వినడానికి ఇది కొంచెం మనకు ఆశ్చర్యంగా ఉన్నా గత ఆరు దశాబ్ధాలుగా కరీంనగర్‌లో ఈ సాంప్రాయాన్ని అక్కడి వారు అందరు నేటికి కొనసాగిస్తున్నారు. పండగకు వారం రోజుల ముందే స్మశానంలో దీపావళి వేడుకలకు ఏర్పాట్లు చేసుకుంటారు. సమాదులను కడిగి వాటికి పూలతో అలంకరించి రంగు రంగుల ముగ్గులువేసి అనంతరం వారికి ఇష్టమైన వంటలను చేసి వారికి వడ్డించి నైవేద్యముగా సమర్పిస్తారు. అనంతరం పిల్లాపాపలతో అక్కడే టపాసులు కాల్చి సంబరాలు జరుపుకుంటారు.

నేటికి కొనసాగింపు

కరీంనగర్‌లోని కార్ఖాన గడ్డలో ఉన్న హిందు స్మషాన వాటికలో ప్రతియేటా దలిత కుటుంబాలు ఈ పండుగను జరుపుకుంటారు. చనిపోయిన తమవారుసైతం వారి ఆత్మశాంతించడంతో పాటు వారితో కలిసి సంతోషంగా పండుగను జరుపుకుంటారని వారు నమ్ముతారు. నేటికి కూడా ఈ సాంప్రదాయమును కరీంనగర్ లో ఆచరనలో ఉంది.

Also Read: Telangana: రాష్ట్ర ప్రజా ప్రతినిధులకు పీఏలతో పరేషాన్.. వీఐపీలకు సేవలు సామాన్యులకు చుక్కలు

Just In

01

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే

Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?