Gadwal District ( IMAGE CREDIT: SWETCHA REPORTER)
ఫొటోగ్యాలరీ

Gadwal District: గద్వాల రోడ్లకు మహార్దశ.. రహదారుల పునరుద్ధరణకు క్యాబినెట్ ఆమోదం!

Gadwal District: పదేండ్లు రిపేర్లకు నోచుకోని రోడ్లకు తెలంగాణ ప్రభుత్వం హ్యామ్ విధానంలో మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించిందని ఇందులో భాగంగా గద్వాల జిల్లాలో (Gadwal District) రోడ్ల మరమ్మతులకు నిధులు మంజూరు చేశారని , ఇందుకు సీఎం సీఎం రేవంత్ రెడ్డి, రోడ్డు రవాణ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి కి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. గద్వాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల పునరుద్ధరణకు తెలంగాణ క్యాబినెట్ ఆమోదం తెలిపిందని, ఇందులో భాగంగా గద్వాల నియోజకవర్గ పరిధిలోని పలు రహదారుల పునరుద్ధరణకు రూ.316.45 కోట్ల నిధులు మంజూరనట్లు గద్వాల ఎమ్మెల్యే తెలియజేశారు. గద్వాల నియోజకవర్గ పరిధిలోని హామ్ ద్వారా ఆర్ అండి బి రోడ్లకు రూ.162.45 కోట్లు, పంచాయతీ రాజ్ రోడ్లకు రూ.154కోట్ల నిధులు మంజూరైనట్లు తెలిపారు.

 Also Read: Gadwal District: ఇరుకుగా మారుతున్న రహదారులు.. పట్టించుకోని మున్సిపల్‌ అధికారులు

రాయచూర్ రహదారి రూ.74.29 కోట్లు

ఆర్ అండి బి రోడ్లకుగాను ఎరిగెర- అయిజ- అలంపూర్ రోడ్(బల్గెర, మిట్టదొడ్డి, తుమ్మలపల్లి) రూ.9.61 కోట్లు, గద్వాల్ – రంగాపూర్ రోడ్డు (గద్వాల, జమ్మిచేడు, పూడూరు x రోడ్, వీరాపురం, పుటాన్ పల్లి, అనంతపురం ఎర్రవల్లి) రూ.39.84 కోట్లు, గద్వాల రాయచూర్ రహదారి రూ.74.29 కోట్లు,‌ గద్వాల అయిజ‌ రోడ్డు(గద్వాల, పరుమాల, కుర్వపల్లి, పెద్దపల్లి, బూడిదపాడు, అమరవాయి, మల్దకల్) రూ.24.32కోట్లు, బల్గెర మాచర్ల రోడ్డు రూ.1.5కోట్లు, గట్టు మాచర్ల రోడ్డు (20/2 నుండి 25/3) రూ.12.80 కోట్లు మంజూరయ్యాయి.

మీణ రోడ్డు పునరుద్ధరణకు రూ.154 కోట్లు

అదే విధంగా హ్యామ్​ ద్వారా గద్వాల్ నియోజకవర్గంలో పంచాయతీ రాజ్ రోడ్ల కిందా పీడబ్ల్యూడి రోడ్ నుండి పార్చర్ల, పీడబ్ల్యూడి రోడ్ నుండి కొత్తపాలెం, మార్లబీడు పీడబ్ల్యూడి రోడ్ నుండి కోతుల గిద్ద, పీజేపీ రోడ్ నుండి బీంపురం,‌ పీడబ్ల్యూడి రోడ్ నుండి బస్వాపూర్ వయా అనంతపూర్, నందిన్నె నుండి మాచర్ల, వాయిల్ కుంట తండా నుండి మల్లాపూరం తండా, మల్దకల్ జడ్పీ రోడ్ నుండి ఆరగిద్ద, గొర్లఖాన్ దొడ్డి నుండి ఆరగిద్ద, రంగాపూర్ నుండి బస్వాపూర్, పీడబ్ల్యూడి రోడ్ నుండి పాతపాలెం, పీడబ్ల్యూడి రోడ్ నుండి ముసల్ దొడ్డి వయా కొండాపురం, పీడబ్ల్యూడి రోడ్ నుండి పూజారి తండా వయా గువ్వలదిన్నె, పీడబ్ల్యూడి రోడ్ నుండి రంగాపుర్ వయా మైలగడ్డ, మల్దకల్ నుండి విఠాలపూర్ వయా ఎల్కూర్, బిజ్వారం నుండి మద్దెలబండ వయా ఉలిగేపల్లి, నేతువానిపల్లి, ఉల్లిగేపల్లి నుం గ్రామీణ రోడ్డు పునరుద్ధరణకు రూ.154 కోట్లు మంజూరయ్యాయని ఆయన తెలిపారు.

80 కోట్లతో మెడికల్ కాలేజీ భవనం నిర్మాణం

ఇందుకు సంబంధించిన పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని ఎమ్మెల్యే తెలిపారు. అదేవిధంగా గద్వాల నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా గద్వాలలో నర్సింగ్ కళాశాల నిర్మాణం పూర్తి చేసినట్లు, నవంబర్ 25 నాడు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి చేత మీదుగా ప్రారంభోత్సవం చేయడం జరుగుతుందని తెలిపారు. 80 కోట్లతో మెడికల్ కాలేజీ భవనం నిర్మాణం భూమి పూజ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అలాగే వ్యవసాయ రంగంలో కూడా రైతులు పండించిన వరి ధాన్యంలో గోదాంలో నిల్వ ఉంచడానికి గోదాములను కేటాయించడం జరిగిందని గద్వాల నుండి ఇతర ప్రాంతాలకు ధాన్యమును సరఫరా చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో సీనియర్ నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, జమ్ములమ్మ ఆలయ కమిటి చైర్మన్ వెంకట్రాములు, మాజీ జడ్పీటిసి ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీలు ప్రతాప్ గౌడ్, విజయ్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ బాబర్, మాజీ కౌన్సిలర్ మురళి, నాయకులు విక్రమ్ సింహా రెడ్డి, శేఖర్, నాగులుయాదవ్, కుర్మన్న, రిజ్వాన్ తదితరులు పాల్గొన్నారు.

 Also Read: Gadwal District: గద్వాల జిల్లా కాంగ్రెస్ నాయకుల్లో ఉత్కంఠ.. ఇక అందరి చూపు అటువైపే..!

Just In

01

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?

Biggest Scams in India: భారతదేశాన్ని కుదిపేసిన అతిపెద్ద స్కామ్స్ ఇవే..

Napoleon Returns: జంతువు ఆత్మతో కథ.. ‘నెపోలియన్ రిటర్న్స్’ టైటిల్ గ్లింప్స్ అదిరింది