Gadwal District: జోగులాంబ గద్వాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి నియామక ప్రక్రియకు సమయం ఆసన్నం కావడంతో నడిగడ్డలో రాజకీయ వేడి మొదలైంది. గతంలో కూడా అనేకసార్లు డిసిసి అధ్యక్షుడు నియామకం విషయంలో పార్టీలో చర్చ జరిగినప్పటికీ ఆ ప్రక్రియ ముందడుగు పడలేదు. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఏసీ నుంచి పరిశీలకులు రావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో సంఘటన్ సృజన్ అభియాన్ అనే కార్యక్రమం పేరుతో ఏఐసిసి(AICC), పిసిసి(PCC) ప్రతినిధులు పుదుచ్చేరి మాజీ సీఎం నారాయణస్వామి(Narayana Swamy) తదితరులు జిల్లా కేంద్రమైన గద్వాలతో పాటు ఆలంపూర్ నియోజకవర్గంలోని శాంతినగర్ లో పార్టీ నాయకుల, కార్యకర్తల అభిప్రాయ సేకరణ చేపట్టారు. ఆశావాహులతో సైతం విడివిడిగా సమావేశం నిర్వహించారు.
పార్టీ కోసం ఐదేళ్లు సేవలు తప్పనిసరి
కాంగ్రెస్ పార్టీ కోసం నిబద్దతో పనిచేసిన వారికి పార్టీ పెద్దపీట వేస్తోంది. అందులో భాగంగా కనీసం పార్టీలో ఐదేళ్లు ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వాలనే నిబంధన పెట్టింది. పార్టీ అధికారంలోకి రాకముందు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పటేల్ ప్రభాకర్ రెడ్డి(Patel Prabhakar Reddy) పార్టీ బాధ్యతలను భుజాన వేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ పదేళ్ల కాలం అధికారంలో లేకపోవడంతో పార్టీ కార్యక్రమాలను నిర్వహించారు. పార్టీ కోసం అహర్నిశలు కృషిచేసి గద్వాల నుంచి పోటీ చేసే అవకాశం రాకపోవడంతో పార్టీ నాయకుల తీరును నిరసిస్తూ బి ఆర్ ఎస్ లో చేరారు.
Also Read: US Obesity Study: అధిక బరువుతో అమెరికా బేజారు.. ఉబకాయంలో ఆల్‌టైమ్ రికార్డ్.. ఇలా అయితే కష్టమే!
జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పెరుగుతున్న పోటీ
జోగులాంబ గద్వాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవిని ఆశిస్తున్న ఆశావాహుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఈ మేరకు ఆశావాహులు నుంచి పరిశీలకులుగా వచ్చిన మాజీ ముఖ్యమంత్రి నారాయణస్వామికి దరఖాస్తులను అందజేశారు.
జోగులాంబ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల ఎన్నిక కోసం దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా అధ్యక్ష పదవి కోసం మొదటి నుంచి ప్రయత్నం చేస్తున్న నల్లారెడ్డి తో పాటు రాజీవ్ రెడ్డి, , షేక్షావలి ఆచారి,నారాయణరెడ్డి, గట్టు గౌస్, గంజిపేట్ శంకర్, ఎం ఏ ఇసాక్,డి ఆర్ శ్రీధర్, అచ్చన్న గౌడ్, మోహన్ రావు, ఖలీమ్ బాలకృష్ణ, రేపల్లె కృష్ణ జిల్లా అధ్యక్ష పదవిని ఆశిస్తుండగా ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తరఫున గతంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన పటేల్ ప్రభాకర్ రెడ్డి తో పాటు గడ్డం కృష్ణారెడ్డి, శేషం పల్లె నర్సింహులు దరఖాస్తు చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Also Read: Afghan Cricketers Died: పాకిస్థాన్ వైమానిక దాడులు.. ముగ్గురు ఆఫ్ఘనిస్థాన్ క్రికెటర్లు మృతి
