Viral News: బొద్దింకను చంపబోతే. పొరుగింటి వ్యక్తి మృతి
Coacroach (Image source Twitter)
Viral News, లేటెస్ట్ న్యూస్

Viral News: బొద్దింకను చంపబోయి పొరుగింటి వ్యక్తి ప్రాణాలు తీసిన మహిళ.. ఏం చేసిందో తెలిస్తే అవాక్కవుతారు?

Viral News: ఓ యువతి చిన్న బొద్దింకను చంపబోయి.. ఏకంగా మనిషి ప్రాణాలు (Viral News) తీసేసింది. నమ్మడానికి కాస్త ఆశ్చర్యంగా అనిపిస్తున్నా, దక్షిణ కొరియాలో ఈ ఘటన నిజంగానే జరిగింది. బొద్దింకను చంపే క్రమంలో ఆమె పొరపాటున అపార్ట్‌మెంట్‌కు నిప్పు పెట్టింది. దక్షిణకొరియాలో హాట్ టాపిక్‌గా మారిన ఈ ఘటన ఓసన్ అనే నగరం జరిగింది. నిందిత యువతి వయసు 20 ఏళ్లు. బొద్దింకను కాల్చిచంపడానికి ఆమె ప్రయత్నించింది. ఇందుకోసం ఫ్లేమ్‌త్రోవర్‌ను (లైటర్, మండే స్వభావం ఉన్న స్ప్రేని కలిపి) ఉపయోగించింది. అయితే, ఆ మంటలు ఇంట్లోని వస్తువులకు అంటుకొని చూస్తుండగానే వ్యాపించి, అపార్ట్‌మెంట్‌ను చుట్టుముట్టాయి. ఆ విధంగా భవనమంతా వ్యాపించి ప్రమాదానికి తీశాయి. ఈ ప్రమాదంలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాయపడ్డారు. మృతురాలు చైనాకు చెందిన మహిళగా గుర్తించారు.

బిల్డింగ్‌లోని ఐదవ అంతస్తులో తన భర్త, రెండు నెలల పసిబిడ్డతో నివాసం ఉంటున్న చైనా పౌరులు ప్రాణాలు కోల్పోయింది. ఆమె 30 ఏళ్లు అని అధికారులు నిర్ధారించారు. మంటలు, దట్టమైన పొగ వ్యాపించడంతో తప్పించుకునే మార్గాలు లేక కుటుంబమంతా చిక్కుకుంది. అయితే, పసిబిడ్డను కిటికీ గుండా పక్క బ్లాక్‌లో ఉంటున్న ఓ వ్యక్తికి సురక్షితంగా అందించారు. ఆ తర్వాత భర్త కూడా పక్క బ్లాక్‌లో సురక్షితంగా తప్పించుకోగలిగాడు. కానీ, మహిళ మాత్రం భర్తను అనుసరించే క్రమంలో కింద పడిపోయింది. తీవ్ర గాయాలపాలైంది. అక్కడి నుంచి హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. కానీ గాయాల తీవ్రత కారణంగా కొన్ని గంటల్లోనే ఆమె చనిపోయింది.

Read Also- Jubilee Hills Nominations: జూబ్లీహిల్స్‌లో ముగిసిన నామినేషన్లు.. వామ్మో.. ఎన్ని నామినేషన్లు వచ్చాయంటే

అగ్నిప్రమాదానికి గురైన బిల్డింగ్ కింది అంతస్తులో వాణిజ్య దుకాణాలు ఉన్నాయి. పైభాగంగా 30కి పైగా నివాసం ఉంటున్న ప్లాట్లు ఉన్నాయి. ఈ అగ్నిప్రమాదానికి చాలామంది ప్రభావితం అయ్యారు. కనీసం 8 మంది పొగ పీల్చుకోవడంతో అనారోగ్య సమస్యలకు గురయ్యారు. ఇక, ఈ ప్రమాదానికి కారణమైన యువతిని పోలీసులు అరెస్ట్ చేయనున్నారు. తన నిర్లక్ష్యం కారణంగా మరణం సంభవించడం, భవనానికి నిప్పు పెట్టడం వంటి సెక్షన్ల కింద అరెస్టు వారెంట్ జారీ చేయనున్నట్టు పోలీసులు తెలిపారు.

కీటకాలను చంపడానికి ప్రమాదకరమైన పద్దతులు

బొద్దింకలు, ఇతర కీలకాలను చంపడానికి బ్లోటోర్చెస్, లేదా ఇంట్లో తయారుచేసిన ఫ్లేమ్‌త్రోవర్‌లను ఉపయోగించడం చాలా ప్రమాదకరం. అయితే, ఇలాంటి ప్రమాదకరమైన పద్ధతులు సోషల్ మీడియాలో బాగా ప్రాచుర్యం పొందాయి. అయితే, ఈ విధానాలు అగ్నిప్రమాదాలకు, పేలుళ్లకు దారితీస్తాయని నిపుణులు చెబుతున్నాయి. గతంలో జరిగిన పలు ఘటనలు ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. 2018లో ఆస్ట్రేలియాకు చెందిన ఒక వ్యక్తి ఇంట్లో తయారుచేసిన ఫ్లేమ్‌త్రోవర్‌ ఉపయోగించే క్రమంలో తన వంటగదికి నిప్పు పెట్టాడు. ఇక, 2023లో మరో ఘటనలో, జపాన్‌కు చెందిన ఒక వ్యక్తి బొద్దింకను చంపే ప్రయత్నంలో, ఎక్కువ మొత్తంలో క్రిమిసంహారక మందును ఉపయోగించాడు. దీంతో, తన అపార్ట్‌మెంట్‌ పేలుడు సంభవించింది. 54 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి బొద్దింకను చంపబోయి ఇంతపని చేశాడు. బొద్దింక అంటే అసహ్యం కావడంతో అధిక మోతాదులో క్రిమిసంహారక మందును పిచికారీ చేయడం ఈ ప్రమాదానికి కారణమైంది.

Read Also- Gold Reserves: పసిడి నిల్వల్లో భారతీయ మహిళలు టాప్.. పది దేశాలివి కలిపినా సమానం కావట్లేదు!

Just In

01

Mowgli Controversy: ‘అఖండ 2’ సినిమా ‘మోగ్లీ’ని డేమేజ్ చేసిందా?.. నిర్మాత స్పందన ఇదే..

Local Body Elections: తెలంగాణ పల్లెల్లో మొదలైన రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్..!

Dharma Mahesh: మరో స్టేట్‌లోనూ మొదలెట్టిన ధర్మ మహేష్..

Kerala Local Polls: కేరళ రాజకీయాల్లో కీలక పరిణామం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయం?

Drug Seizure: 70 లక్షల విలువైన మాదక ద్రవ్యాలు సీజ్.. ఎలా పట్టుకున్నారంటే?​