Gold-Reserves (Image source Twitter)
Viral, లేటెస్ట్ న్యూస్

Gold Reserves: పసిడి నిల్వల్లో భారతీయ మహిళలు టాప్.. పది దేశాలివి కలిపినా సమానం కావట్లేదు!

Gold Reserves: భారతీయ మహిళలకు గోల్డ్ అన్నా, బంగారంతో తయారైన నగలన్నా చాలా చాలా ఇష్టం. అయితే, పసిడిపై ప్రేమ కేవలం అలంకారానికి మాత్రమే పరిమితం కాదు. సంస్కృతి, భద్రత, ఆర్థిక స్వాతంత్య్రానికి కూడా నిదర్శనంగా నిలుస్తోంది. వివాహంతో మొదలుకొని చాలా ముఖ్య శుభకార్యాలలోనూ బంగారానికి ఎనలేని ప్రాధాన్యత ఉంది. అందుకే బంగారంతో మహిళా మణుల పసిడి బంధం తరతరాలుగా కొనసాగుతోంది. ఎంతలా అంటే, గోల్డ్ కౌన్సిల్ నివేదికల ప్రకారం, భారతీయ మహిళల వద్ద ఏకంగా 24,000 టన్నుల బంగారం ఉన్నట్టు అంచనాగా ఉంది. తద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద ‘హౌస్‌హోల్డ్ వెల్త్’ను భారతీయ మహిళలు సృష్టించారని నివేదికలు పేర్కొంటున్నాయి. భారతీయ మహిళల వద్ద మొత్తం 24,488 టన్నుల బంగారం ఉండగా, భారత్ తర్వాతి 10 స్థానాల్లో ఉన్న దేశాల మహిళల మొత్తం బంగారం కలిపినా 23,927గా టన్నులుగా ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి.

వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఏం చెబుతోంది?

వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (World Gold Council) నివేదికల ప్రకారం, భారతీయ మహిళల వద్ద ఉన్న మొత్తం బంగారం నిల్వలు ప్రపంచంలోని మొత్తం గోల్డ్ నిల్వల్లో దాదాపు 11 శాతానికి సమానమని తెలిపింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ప్రపంచంలో అత్యధిక బంగారు నిల్వలు ఉన్న టాప్ 5 దేశాలైన అమెరికా, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, రష్యా దేశాల మహిళల వద్ద ఉన్న ఉమ్మడి బంగారం కంటే, భారతీయ మహిళల వద్దే ఎక్కువ నిల్వలు ఉన్నాయి. భారతదేశంలో బంగారం కేవలం ఆభరణం మాత్రమే కాదు; తరతరాలుగా వస్తున్న సంస్కృతి, ఆర్థిక భద్రత, ఆర్థిక స్థిరత్వానికి ప్రతీక అని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. అనూహ్య పరిస్థితుల్లో, ఏవైనా సంక్షోభాలు ఎదురైనప్పుడు కుటుంబాన్ని ఆదుకునే బలమైన ఆర్థిక భద్రతా కవచంగా పనిచేస్తుందని అంటున్నారు. భారతీయ మహిళలు బంగారానికి ప్రాధాన్యత ఇవ్వడానికి ఇదే కారణమని చెబుతున్నారు.

Read Also- HMDA Report: హైదరాబాద్‌లో వేగంగా భవన నిర్మాణాలు.. లేఔట్‌లకు అనుమతులు.. హెచ్ఎండీఏ కీలక రిపోర్ట్ విడుదల

ఆపదలో ఆర్థిక చేయూత

మన దేశంలో ఆర్బీఐ మాదిరిగా బంగారం నిల్వలను ఆయా దేశాల సెంట్రల్ బ్యాంకులు నిర్వహిస్తుంటాయి. కానీ, భారతదేశంలో మాత్రం జనాల వద్ద పెద్ద ఎత్తున బంగారం ఉంది. పెళ్లిళ్లు, పండుగలు, శుభకార్యాల సందర్భాల్లో కొనుగోలు చేసే బంగారం ఆర్థిక భద్రతగా అక్కరకొస్తోంది. ఎలాంటి ఆర్థిక కష్టాలు వచ్చినా, ఇతర ప్రత్యమ్నాయ మార్గాలు లేనప్పుడు ఠక్కున బంగారం గుర్తుకొస్తుంది. తాకట్టు పెట్టి, లేదా అవసరానికి అమ్ముకొని అయినా కుటుంబాన్ని ఆదుకోవడానికి పసిడి నగలు ఉపయోగపడతాయి.

ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోని తమిళనాడుతో పాటు పలు రాష్ట్రాల్లో దేశంలోనే అత్యధిక బంగారం నిల్వలు ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. భారతీయ మహిళలను కేవలం గృహిణులుగానే కాక, దేశ ఆర్థిక వ్యవస్థను నిశ్శబ్దంగా నడిపిస్తున్న అత్యంత శక్తివంతమైన ‘గోల్డ్ రిజర్వ్స్‌’గా నిలుస్తున్నారంటూ ప్రశంసలు అందుతున్నాయి.

Read Also- Diwali Troll War: ఏపీ పాలిటిక్స్‌లో దీపావళి చిచ్చు.. లేటెస్ట్‌గా ఏం జరుగుతుందో తెలుసా?

Just In

01

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?

Biggest Scams in India: భారతదేశాన్ని కుదిపేసిన అతిపెద్ద స్కామ్స్ ఇవే..

Napoleon Returns: జంతువు ఆత్మతో కథ.. ‘నెపోలియన్ రిటర్న్స్’ టైటిల్ గ్లింప్స్ అదిరింది