Diwali Troll War: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏ చిన్న అంశమైనా అధికార-విపక్ష పార్టీల మధ్య పరస్పర విమర్శలు, ట్రోలింగ్‌లకు సోషల్ మీడియా వేదికగా మారుతోంది. ‘కాదేదీ ట్రోలింగ్‌లకు అనర్హం’ అన్నట్టుగా, తాజాగా దీపావళి పండుగ కూడా అధికార తెలుగుదేశం (TDP) కూటమి, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల (YSRCP) మధ్య కొత్త ‘ట్రోలింగ్ వార్’కి (Diwali Troll War) కారణమైంది.
చంద్రబాబు షాపింగ్‌పై వైసీపీ విమర్శలు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దీపావళి సందర్భంగా పండుగకు ముందు రోజైన ఆదివారం నాడు విజయవాడలోని రద్దీగా ఉండే బీసెంట్ రోడ్డులో సాధారణ పౌరుడిలా షాపింగ్ చేశారు. జీఎస్టీ సంస్కరణలు వచ్చాక వ్యాపారులకు కలుగుతున్న ప్రయోజనాలను తెలుసుకునేందుకు పలువురు వ్యాపారులతో ఆయన ముచ్చటించారు. దీపావళి ప్రమిదలు, ఇతర సామన్లు విక్రయించేవారితోనూ మాట్లాడి, వారి సాధకబాధకాలు తెలుసుకున్నారు. దాదాపు 180 మీటర్ల మేర ఇదే విధంగా కాలినడకన వెళ్లారు. ఈ సందర్భంగా పలువురు సామాన్యులు సైతం ఆయనతో సెల్ఫీలు దిగారు. అయితే, ఇదంతా మీడియా కవరేజీ కోసం చేశారంటూ వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోల్ చేస్తున్నాయి.
కేవలం మీడియా కవరేజీ కోసమే ముఖ్యమంత్రి రద్దీగా ఉండే ప్రాంతాన్ని ఎంచుకున్నారని విమర్శిస్తున్నారు. షాపింగ్ పేరుతో, సీఎం కాన్వాయ్, భద్రతా ఏర్పాట్ల కారణంగా బీసెంట్ రోడ్డులో ఉన్న సామాన్య ప్రజల జీవనం ఇబ్బందులు ఎదుర్కొన్నారని వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పోస్టులు పెట్టి, వ్యంగ్యాస్త్రాలు సంధించాయి. జనాలకు అసౌకర్యం కలిగించడమే కాకుండా, దానిని గొప్ప ప్రజా సంబంధాల చర్యగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు.
జగన్ దీపావళిపై టీడీపీ ‘నరకాసుర’ ట్రోలింగ్
మరోవైపు, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన భార్య వైఎస్ భారతితో కలిసి బెంగళూరులోని తమ నివాసంలో దీపావళి వేడుకలు సందడిగా జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే, టీడీపీ సోషల్ మీడియా శ్రేణులు మాత్రం తెగ ట్రోలింగ్‌కు దిగాయి. నరకాసురుడే దీపావళి జరుపుకోవడం ఎప్పుడూ చూడలేదంటూ పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. ప్రజల ధనాన్ని దోచుకున్న వ్యక్తి, రాష్ట్రానికి నష్టం కలిగించిన నరకాసుడు అంటూ టీడీపీ అనుకూల సోషల్ మీడియా అకౌంట్స్‌లో జగన్‌పై విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. దీపావళి పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని, కానీ ప్రజా ధనాన్ని దోచుకున్న వ్యక్తి పండుగ జరుపుకోవడం విడ్డూరమంటూ ఎద్దేవా చేస్తున్నాయి.
ఏదేమైనా, ఏపీ రాజకీయాల్లో ప్రతి పండుగ, ప్రతి కార్యక్రమం ఎన్నికల ముందస్తు వాతావరణాన్ని తలపిస్తూ, పరస్పర విమర్శలకు, ట్రోలింగ్‌కు దారితీస్తోంది. ఈ క్రమంలో దీపావళి పండుగ ఉత్సాహంలో కూడా రాజకీయ వేడి భాగమైందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదేమో.
#నరకాసురుడ్ని చంపినందుకు గుర్తుగా జనం దీపావళి చేసుకుంటారు!
కానీ….
..
ఆ జనాన్నే సావదొబ్బిన నరకాసురుడే దీపావళి చేసుకోవటం నేనెక్కడా చూడలేదు…!!#కలికాలం…😭 pic.twitter.com/wYlwvNKIwq— Swathi Reddy (@Swathireddytdp) October 20, 2025
తాతా😍😍ఎక్కడున్నావే🤔🤔పైన ఉన్నాను😍😍నువ్వు బాగున్నావా🥰🥰బాబుగారండి ఇటు రండి🥰🥰ప్రజల ఆత్మీయ పలకరింపుల ఆప్యాయతల మధ్యన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు🙏🙏🥰 🥰🥰😍😍…. pic.twitter.com/3p69HZdVu2
— Yash (@YashTDP_) October 20, 2025
