Jubilee-Hills-By-Poll (Image source Twitter)
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

Jubilee Hills Nominations: జూబ్లీహిల్స్‌లో ముగిసిన నామినేషన్లు.. వామ్మో.. ఎన్ని నామినేషన్లు వచ్చాయంటే

Jubilee Hills Nominations: తెలుగు రాష్ట్రాలు ఆసక్తికరంగా గమనిస్తున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికకు సంబంధించి కీలక ప్రక్రియ పూర్తయ్యింది. మంగళవారం (అక్టోబర్ 21) సాయంత్రం 3 గంటలకు నామినేషన్ల గడువు (Jubilee Hills Nominations) ముగిసింది. మొత్తం 150కి పైగా నామినేషన్ల దాఖలయ్యాయని అధికారులు వెల్లడించారు. అక్టోబరు 24 వరకు ఉపసంహరణకు గడువు

మంగళవారం ప్రధానంగా దాఖలైన నామినేషన్లలో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ఉన్నారు. ఆయన తన అనుచరులతో కలిసి వచ్చి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఇక, స్వతంత్రులు, రీజినల్ రింగ్ రోడ్డు (RRR) బాధిత రైతులు, స్థానిక నిరుద్యోగ సంఘాల నాయకులతో పాటు పలువురు అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి సాయిరామ్ రేపటి నుంచి (బుధవారం) నామినేషన్లను పరిశీలించనున్నారు. అయితే, నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 24 చివరి తేదీ అని అధికారులు తెలిపారు. అయితే, గడువులోగా ఎవరైనా తమ నామినేషన్లను ఉపసంహరించుకుంటారా?, ఏమైనా బుజ్జగింపులు ఉంటాయా? అనేది ఆసక్తికరంగా మారింది. కాగా, నవంబర్ 11న పోలింగ్ జరగనుంది.

ప్రధాన పార్టీ అభ్యర్థులు వీరే

కాంగ్రెస్ పార్టీ తరపున బీసీ వర్గానికి చెందిన వీ.నవీన్ యాదవ్ పోటీ చేస్తున్నారు. ఇక, విపక్ష బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే, దివంగత గోపీనాథ్ భార్య సునీత బరిలో నిలిచారు. బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డిని నామినేషన్ దాఖలు చేశారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఏఐఎంఐఎం (AIMIM) అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఈ ఉపఎన్నికలో పార్టీ తరపున అభ్యర్థిని నిలబెట్టలేదు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు ఏఐఎంఐఎం మద్దతు ఇవ్వనుంది. జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతివ్వాలని అసదుద్దీన్ ఒవైసీ ఇప్పటికే ఓటర్లను కోరారు. ఈ ఉపఎన్నికలో ఏఐఎంఐఎం అభ్యర్థిని నిలబెట్టడం లేదని, యువ నేత నవీన్ యాదవ్ అభివృద్ధి చేస్తారని, ఆయనకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నామని, ఈ మేరకు పార్టీ నిర్ణయం తీసుకుందని అసదుద్దీన్ ఒవైసీ ఇటీవలే ప్రకటన చేశారు.

Read Also- Addanki Dayakar: బీఆర్ఎస్ ఆస్తులపై బహిరంగ చర్చకు కేటీఆర్ సిద్ధమా?..ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కీలక వ్యాఖ్యలు

ఇప్పటికే పరిశీలకుల నియామకం

నవంబర్ 11న జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకుగానే కేంద్ర ఎన్నికల సంఘం ముగ్గురు పరిశీలకులను నియమించింది. ఐఏఎస్ రంజిత్ కుమార్ సింగ్ (సాధారణ పరిశీలకులు), ఓం ప్రకాశ్ త్రిపాఠి (పోలీస్ పరిశీలకులు), ఐఆర్‌ఎస్ సంజీవ్ కుమార్ లాల్ (అభ్యర్థుల ఖర్చుల పరిశీలకులు) ఎప్పటికప్పుడు ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షిస్తారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా, సజావుగా జరిగేలా ఈ ముగ్గురు బాధ్యతలు నిర్వహించనున్నారు. ఎన్నికలకు సాధారణ ఏర్పాట్లు, శాంతిభద్రతలు, ఎన్నికల వ్యయం, ఎన్నికల ప్రవర్తనా నియమావళి పాటించేలా చూడనున్నారు.

కాగా, జూబ్లీహిల్స్‌తో పాటు దేశవ్యాప్తంగా మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా ఉపఎన్నిక జరగనుంది. ఈ జాబితాలో జమ్మూ కాశ్మీర్‌లోని బుద్గాం, నాగ్ రోటా స్థానాలు, రాజస్థాన్‌లోని అంటా, జార్ఖండ్‌లోని ఘాట్‌శిలా నియోజకవర్గాలు, పంజాబ్‌లోని టార్న్ తరణ్, మిజోరాంలోని దంపా, మఒడిశాలోని నువాపడా స్థానాలు ఈ జాబితాలో ఉన్నాయి.

Read Also- Gold Reserves: పసిడి నిల్వల్లో భారతీయ మహిళలు టాప్.. పది దేశాలివి కలిపినా సమానం కావట్లేదు!

Just In

01

Minister Konda Surekha: స్వేచ్ఛ ఎఫెక్ట్.. దేవాదాయశాఖపై మంత్రి కొండా సురేఖ సమీక్ష!

Rashmika Mandanna: సౌత్ ఇండియాలో రష్మికా మందాన టాప్ హీరోయిన్ ఎలా అయ్యారో తెలుసా.. రీజన్ ఇదే..

Election Commission: జూబ్లీహిల్స్‌లో సోదాలు ముమ్మరం.. అభ్యర్థుల వెనక షాడో టీమ్‌లు

Intermediate Exams: ఈసారి ఇంటర్ పరీక్షలు యథాతథం.. వచ్చే సంవత్సరం నుంచి మార్పులు

Satish Shah passes away: ప్రముఖ వెటరన్ నటుడు సతీశ్ షా కన్నుమూత..